సీమాంధ్రలో కొనసాగుతున్న బంద్..

పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టడాన్ని నిరసిస్తూ అటు వైసీపీ, ఇటు సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక బంద్ కు పిలుపునిచ్చాయి. కేంద్ర అప్రజాస్వామికంగా లోక్‌సభలో బిల్లు పెట్టిందని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. కేంద్రం తీరుకు నిరసనగా రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చినట్టు ప్రకటించారు.

t3

లోక్ సభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ..వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బంద్‌కి  పిలుపునిచ్చింది. రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తోందని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 సెకన్లలో తెలంగాణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టేశారని ఆయన ఎద్దేవా చేశారు. సీమాంధ్రకు జరిగిన అన్యాయంపై రాష్ట్ర బంద్ కు పిలుపునిస్తున్నట్టు జగన్ ప్రకటించారు.

లోక్ సభలో తెలంగాణ బిల్లుతోపాటు సీమాంధ్ర ఎంపీలపై దాడిని వ్యతిరేకిస్తూ..సీమాంధ్ర బంద్ కు సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక పిలుపునిచ్చింది. కేంద్రం మొండిగా వ్యవహరిస్తూ..వ్యూహాత్మకంగానే సీమాంధ్ర ఎంపీలపై దాడికి ఉసిగొల్పిందని ఏపీఎన్జీఓ అధ్యక్షుడు అశోక్ బాబు ఆరోపించారు. ఇప్పటికైనా సీమాంధ్ర కేంద్రమంత్రులు తెలంగాణ బిల్లును అడ్డుకోవాలన్నారు.  విద్యుత్ ఉద్యోగులు సైతం సమ్మెలోకి రావాలని ఆయన కోరారు.

సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక బంద్ కు సీమాంధ్ర టీడీపీ మద్దతు ప్రకటించింది. లోకసభలో జరిగిన ఘటనలపై ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చింది. విభజన ఎపిసోడ్ క్లైమాక్సుకు చేరుకోవడంతో అన్ని వర్గాల ప్రజలు రోడ్లపైకొస్తున్నారు. విభజనకు వ్యతిరేకంగా నిరసన గళం వినిపిస్తున్నారు. ధర్నాలు, రాస్తారోకోలతో హోరెత్తిస్తున్నారు.

Advertisements
Video | This entry was posted in Andhra Pradesh News and tagged , , , , , , , , , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s