ఇవాళ సమ్మక్క, సారమ్మల వన ప్రవేశం

నాలుగురోజుల మేడారం జాతర ఇవాళ్టీతో ముగియనుంది. సమ్మక్క-సారలమ్మల వనప్రవేశంతో జాతర పరిసమాప్తమవుతుంది. లక్షలాది మంది భక్తుల జయజయధ్వానాల మధ్య అమ్మవార్లను సాగనంపుతారు. మరోవైపు ఇవాళ అఖరిరోజు కావడండో భక్తుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది.

మేడారం జాతర ఆఖరి ఘట్టానికి చేరుకుంది. ఇసుకెస్తే రాలనంతగా ఎటుచూసినా భక్తప్రవాహమే కనిపిస్తోంది. కిక్కిరిసిన భక్తులతో జంపన్నవాగు జనసంద్రంగా మారిపోయింది. గద్దెలపై కొలువైన సమ్మక్క-సారలమ్మలను కనులారా వీక్షించి భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. చల్లగా దీవించు తల్లీ అంటూ అమ్మవార్లకు ఇష్టమైన బెల్లాన్ని..నిలువెత్తు బంగారం రూపంలో సమర్పించుకుంటున్నారు.

m10

గద్దెలపైనుంచి భక్తులకు దర్శనమిచ్చిన సమ్మక్క-సారలమ్మలు ఇవాళ వనప్రవేశం చేయనున్నారు. ఈ తుదిఘట్టంతో నాలుగురోజుల జాతర పరిసమాప్తమవుతుంది. దేవతలిద్దరిని గద్దెలపైకి తీసుకొచ్చేటప్పుడు ఎలాంటి భద్రత కల్పించారో..అంతే కట్టుదిట్టమైన రక్షణ మధ్య అమ్మవార్లను సాగనంపుతారు. సమ్మక్కసారలమ్మల వనప్రవేశానంతరం గుండెలనిండా నింపుకున్న భక్తిభావంతో భక్తులు తిరుగుపయనమవుతారు. మరిచిపోని మధురానుభూతులను మరో రెండేళ్ల వరకు నెమరువేసుకుంటారు.

ఇప్పటికే లక్షలాది మంది భక్తుల రాకతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం అవుతోంది. ఎంత శ్రమిస్తున్నా..ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించడం పోలసుల వల్ల కావడం లేదు. మేడారం ఇవాళ జాతర ఆఖరిరోజు కావడంతో భక్తుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది

Advertisements
Video | This entry was posted in Andhra Pradesh News and tagged , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s