పశ్చిమ నుంచి ప్రజాగర్జన రెండోభాగం

  • మలిదశ ప్రజాగర్జనకు సిద్ధమైన తెలుగుదేశం
  • ప్రజల్ని చైతన్యపరచడమే ప్రజాగర్జన లక్ష్యం
  • యూపీయే అవినీతి, కాంగ్రెస్‌ కుట్రలపై ప్రచారం
  • రాజకీయ లబ్ది కోసం కాంగ్రెస్‌ దురాలోచన
  • ఓ వైపు బహిరంగ సభలు.. మరోవైపు పార్టీ సమావేశాలు
  • ఏ ప్రాంత అభివృద్ధి అయినా టీడీపీతోనే సాధ్యం
  • రైతు రుణమాఫీ, బెల్టు షాపుల రద్దు, రక్షిత మంచినీరు..

ప్రజాగర్జన రెండోభాగానికి చంద్రబాబు సిద్ధమయ్యారు. అవినీతి, కుట్ర రాజకీయాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టనున్నారు. ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో జరిగే సభలో… ఇతర పార్టీల నుంచి టీడీపీలోకి పెద్దఎత్తున చేరికలు ఉంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

m4

తిరుపతి, ఒంగోలులో నిర్వహించిన తొలిదశ ప్రజాగర్జన సభలు విజయవంతం కావటంతో రెట్టింపు ఉత్సాహంతో మలిదశకు తెలుగుదేశం సిద్ధమైంది. వచ్చే సార్వత్రిక ఎన్నికలు సమైక్య రాష్ట్రంలో జరిగినా…, రెండు రాష్ట్రాల్లో జరిగినా…, ప్రజల్ని చైతన్య పరచటమే లక్ష్యంగా అన్ని జిల్లాల్లోనూ ఈ బహిరంగ సభల నిర్వహణకు చంద్రబాబు సిద్ధమయ్యారు. యూపీఏ హయాంలో జరిగిన అవినీతి కుంభకోణాలు…, కాంగ్రెస్,టిఆర్‌యస్,వైసిపి లతో కలసి రాష్ట్ర విభజనకు కుట్రపన్నిందనే విషయాన్ని ఈ సభల ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లనున్నారు. ముఖ్యంగా తెలంగాణలో సానుకూల ఓటు…, సీమాంధ్రలో కాంగ్రెస్ వ్యతిరేక ఓటు కూడా తమకే దక్కాలన్న రాజకీయ లబ్ధితో కాంగ్రెస్ దురాలోచన చేసిందనే విషయంపై.. చంద్రబాబు ప్రజల్ని చైతన్యపరుస్తారని పార్టీ వర్గాలంటున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో  ప్రభుత్వ వ్యతిరేక ఓటును టిఆర్‌యస్‌కు వేసినా…,వైసిపీ కి వేసినా అది తిరిగి కాంగ్రెస్‌కే పడుతుందనే అంశాన్ని ఈ సభల ద్వారా చంద్రబాబు ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఓ పక్క బహిరంగ సభలు నిర్వహిస్తూనే మరో పక్క జిల్లాల విసృత స్థాయి సమావేశం నిర్వహించి… పార్టీ నేతల మధ్య ఉన్న విబేధాలు తొలగించేలా చంద్రబాబు వ్యూహ రచన చేశారు. ఏ ప్రాంత అభివృద్ధి అయినా… తెలుగుదేశంతోనే సాధ్యమనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటంతో పాటు తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్నది వివరించేలా చంద్రబాబు తన ప్రసంగంలో మార్పులు చేసుకున్నారు. పాదయాత్రలో భాగంగా ఇచ్చిన మూడు ప్రధాన హామీలు… రైతు రుణమాఫీ, బెల్టుషాపుల రద్దు, రక్షిత మంచినీటి సరఫరాతో పాటు వివిధ వర్గాలకు ప్రకటించిన డిక్లరేషన్లు బహిరంగ సభల ద్వారా మరోసారి ప్రజలకు గుర్తు చేయనున్నారు.

శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లనున్న చంద్రబాబు అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా తాడేపల్లిగూడెం వెళ్లనున్నారు. బహరంగ సభ అనంతరం తిరిగి విజయవాడ రానున్న ఆయన రాత్రికి అక్కడే బస చేస్తారు. అదివారం ఉదయం విజయవాడ నుంచి శంషాబాద్ వచ్చి అక్కడి నుంచి నేరుగా పంజాబ్ వెళ్లి అక్కడ జరిగే రైతు సదస్సులో పాల్గొంటారు.

Advertisements
Video | This entry was posted in Hyderabad News and tagged , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s