ఇవాళ సీఎం కిరణ్ రాజీనామా అస్త్రం

సీఎం కిరణ్‌ ఇవాళ మాట నిలబెట్టుకోబోతున్నారు. తెలంగాణ బిల్లు సభలో ప్రవేశపెడితే రాజీనామా చేస్తానని ఎపుడో చెప్పారు. బిల్లుపై చర్చ మొదలైన తర్వాత అన్నంత పనిచేసేలా ఉన్నారు. కొత్త పార్టీ ప్రకటన కూడా చేయబోతున్నట్లు సమాచారం.

నాల్గో కృష్ణుడి రాకకు సమయం ఆసన్నమవుతోంది. సీఎం కిరణ్‌ రాజీనామా ఖాయం అయ్యింది. ఇక న్యూ చీఫ్‌ మినిస్టర్‌ ఎంట్రీకి లైన్‌ క్లియర్‌ అవుతోంది. తెలంగాణ బిల్లు పెడితే రాజీనామా చేస్తానన్న ముఖ్యమంత్రి అన్నంత పనికి సిద్ధమైపోతున్నారు. ఇవాళ రాజీనామా పక్కా… అని బల్లగుద్ది మరీ చెబుతోంది కిరణ్‌ వర్గం. పదవికి, పార్టీకి గుడ్‌బై చెప్పడంతో సస్పెన్స్‌కు తెరపడనుంది. కలసి వచ్చే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి ఆయన హస్తానికి గుడ్‌బై చెప్పనున్నారు.

సీఎంతో పాటు 70 మంది వరకు కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులుంటారని అంచనా. అదరితో కలసి వెళ్ళి ఈ కృతువును పూర్తి చేస్తారు. బిల్లుపై చర్చ మొదలైన క్షణమే రాష్ట్రంలో ఈ రాజీనామాల ఎపిసోడ్‌ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే కీలక నేతలతో రాజీనామాలపై చర్చించారు. రాజీనామాలు చేసిన నేతలతోనూ సంప్రదింపులు జరిపారు. ఇవాళ మధ్యహ్నం రాజ్‌భవన్‌కు వెళ్ళి రాజీనామా లేచ్చే ఛాన్సుంది. అట్నుంచి క్యాంపు ఆఫీసుకు కాకుండా సొంత ఇంటికి వెళ్ళి కొత్త పార్టీ ఏర్పాటుపై క్లారిటీ ఇవ్వనున్నారు.

అయితే సీఎంగా కిరణ్‌ రాజీనామా చేయగానే గవర్నర్‌ నరసింహన్‌ ఏం చేయబోతున్నారు… అన్నదే ఇప్పుడు అసక్తిగా మారింది. గత కొంత కాలంగా సీఎంకు గవర్నర్‌ కు మధ్య అగాధం ఏర్పడింది. కిరణ్‌ అదిష్టానంపై తిరుగుబాటు చేయడంతో గవర్నర్‌ కొన్ని కీలక విషయాల్లో సీఎం పంపిన ఫైళ్లను సైతం అదిష్టానంలోని కొందరు పెద్దల అనుమతితోనే వాటికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తున్నట్లుగా సమాచారం. గతంలో ఎవ్వరు సీఎంగా రాజీనామా చేసిన కొత్త ముఖ్యమంత్రి వచ్చే వరకు అపద్దర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కొరడం అనవాయితీ. అదే సాంప్రదాయాన్ని గవర్నర్‌ కొనసాగిస్తారా… లేక వెంటనే రాజీనామాను ఆమోదించి రాష్ట్రంలో మోజార్టీ ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్‌ ను కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా కొరుతారా అన్నది ఉత్కంట రేపుతోంది.

మరో 10, 15 రోజుల్లో సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్‌ రాబోతుంది. మరో వైపు కేంద్రం తెలంగాణ ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ లో బిల్లు ఆమోదం పొంది రెండు రాష్ట్రాలు అధికారికంగా ఏర్పడే వరకు ఈ అపద్ధర్మ సీఎంగా కొనసాగించి ఆ తరువాత రెండు రాష్ట్రాలకు ఇద్దరు ముఖ్యమంత్రులను నియమించే అవకాశాలు కూడా లేకపోలేదని అంచనా వేస్తున్నారు. ఎన్నికల సమయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు లేనందున ఎన్నికలు పూర్తి అయ్యే వరకు రాష్ట్రపతి పాలన విధించి ఎన్నికల తరువాత రెండు రాష్ట్రాలకు ప్రజలు ఎన్నుకునే సీఎంలు పాలనా పగ్గాలు చేపట్టేలా కూడా వ్యవహరించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటన్నంటికి కేంద్రం , గవర్నర్‌ లు సమన్వయంతో నిర్ణయం తీసుకోనున్నారు. ఇదంత వ్యవహరం కొలిక్కి రావడానికి కనీసం వారం పది రోజుల వరకు సమయం పట్టవచ్చని చెబుతున్నారు.

Advertisements
Video | This entry was posted in Hyderabad News and tagged , , , , , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s