సీమాంధ్ర నేతలను బుజ్జగించిన రాహుల్‌

  • సీమాంధ్ర నేతలను బుజ్జగించిన రాహుల్‌
  • ప్రత్యేక రాయితీలు – స్పెషల్ ప్యాకేజీలు
  • సీమాంధ్ర కేంద్రమంత్రులకు రాహుల్ హామీ
  • టీ-బిల్లుకు సహకరించాలని విజ్ఞప్తి
  • పాత విజ్ఞప్తులను పరిశీలించిన రాహుల్‌
  • విభజన జరిగి తీరుతుంది
  • రాయలతెలంగాణ కుదరదు
  • హైదరాబాద్‌ యూటీ చేయం
  • చర్చలో పాల్గొనండి
  • ప్యాకేజీలు కోరండి

రాష్ట్ర విభజనపై క్లైమాక్స్‌ దశలో క్లారిటీ వస్తోంది. సీమాంధ్ర ప్రాంత కేంద్రమంత్రులను కాంగ్రెస్‌ హైకమాండ్‌ బుజ్జగిస్తోంది. విభజన తప్పదని… మీకేం కావాలో కోరుకోండని ఓపెన్‌ ఆఫర్‌ ఇచ్చారు యువరాజు రాహుల్‌. దీంతో భారీ ప్యాకేజీలు, ప్రత్యేక తాయిలాలు ఇవ్వాలన్న సీమాంధ్ర నేతల విజ్ఞప్తిపై రాహుల్‌ కొన్నింటికి సూత్రప్రాయంగా మరికొన్నింటికి మౌనంగా స్పందించినట్లు సమాచారం.

m2
లోక్‌సభలో పెప్పర్‌ స్ప్రే కలకలంతో అప్రతిష్ట మూటగట్టుకున్న కాంగ్రెస్‌ తెలంగాణ బిల్లు సందర్భంగా అంతా కూల్‌గా నడిచేలా ప్లాన్‌ చేస్తోంది. నిన్న రాత్రి సీమాంధ్రకు చెందిన కేంద్రమంత్రులు కావూరి, పళ్లంరాజు, పురంధేశ్వరి, చింరజీవి, కిషోర్‌ చంద్రదేవ్‌, కిల్లి కృపారాణి, పనబాక లక్ష్మి, జేడీశీలంతోపాటు ఎంపీలు కనుమూరి బాపిరాజు, మాగుంట శ్రీనివాసులురెడ్డి, బొత్స ఝాన్సితో కాంగ్రెస్‌ యువరాజు రాహుల్‌ గాంధీ చర్చలు జరిపారు. ఇవాళ్టి సభలో తెలంగాణ బిల్లుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.  గత గురువారం జరిగిన సీన్‌ రిపీట్‌ కావద్దని కోరారు.

నిన్న రాత్రి సుమారు రెండు గంటలపాటు సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు చెప్పిన విషయాలను సావదానంగా విన్నారు రాహుల్‌. గతంలో వీరిచ్చిన వినతి పత్రాలను తెప్పించుకుని మరీ పరిశీలించారు. అన్ని విన్నాక రాష్ట్ర విభజన జరిగి తీరుతుందని రాయలతెలంగాణ కుదరదని… హైదరాబాద్‌ను యూటీ చేయడం కష్టమని రాహుల్‌ అన్నట్లు సమాచారం. అయితే రాయల తెలంగాణ ఆ ప్రాంత ప్రజల ఆకాంక్ష అని సీమాంధ్ర కేంద్రమంత్రులు రాహుల్‌కు వివరించారు. అక్కడి నాయకులు అడుగుతున్నారు. ఇప్పటికే అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని పలు గ్రామ పంచాయతీలు చేసిన తీర్మానాలను ప్రస్తావించారు. మీరు గతంలో వచ్చినప్పుడు రాయల తెలంగాణాపై నాయకులు ఎవరూ స్పష్టంగా చెప్పనందువల్లే తాము ఆ ప్రతిపాదనను విరమించుకున్నామని ఇప్పుడు చేర్చలేమని రాహుల్‌ ఖరా ఖండిగా చెప్పినట్లు సమాచారం.

విభజన బిల్లుపై జరిగే చర్చలో పాల్గొని సీమాంధ్రకు ఏం కావాలో కోరాలని రాహుల్‌ సీమాంధ్ర నేతలకు విజ్ఞప్తి చేశారు. ఆర్థిక ప్యాకేజీ భారీగా ఇస్తామని.. చెప్పారు. అయితే హైదరాబాద్‌ ఆదాయ పంపిణీపై సీమాంధ్ర నేతలకు రాహుల్‌ నుంచి మౌనమే సమాధానంగా వచ్చిన్నట్లు తెలిసింది. ఈశాన్య రాష్ట్రాల తరహా ప్యాకేజీతోపాటు ట్యాక్స్‌ హాలీడే ప్రకటించాలని సీమాంధ్ర నేతలు కోరారు. అటు అవశేష ఆంధ్రప్రదేశ్‌ను కేంద్రం ప్రత్యేక కేటగిరి కింద పరిగణించాలన్నారు. యూటీ లక్షణాలతో హైదరాబాద్‌పై అధికారాలు ఉండాలని సీమాంధ్ర నేతలు రిక్వెస్ట్‌ చేశారు. వీటిలో కొన్నింటిపై రాహుల్‌ సానుకూలత వ్యక్తం చేయగా మరికొన్నింటిపై మౌనమే దాల్చారు. అయితే పోలవరం ప్రాజెక్టు విషయంలో మీరు అన్నట్లుగానే ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలుపుతున్నామని రాహుల్‌ అన్నారు. రాయలసీమకు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాలని.. అలా కుదరని పక్షంలో ప్రత్యేక నిధి ఇప్పించాలన్న నేతల విజ్ఞప్తికి రాహుల్‌ కుదరదన్నట్లే అన్నారని తెలిసింది.

రాహుల్‌తో సీమాంధ్ర నాయకుల భేటీలో దిగ్విజయ్‌ సింగ్‌, GOM సభ్యుడు జైరాం రమేష్‌ కూడా ఉన్నారు. అయితే తాము ప్రతిపాదించిన సవరణలపై కేంద్రం ఎలా వ్యవహరిస్తుందో చూశాక… చర్చలో పాల్గొనేది లేనిది వెల్లడిస్తామని JD శీలం చెప్పినా రాహుల్‌ చేసిన మంత్రాంగం ఫలించినట్లే భావిస్తున్నారు. ఇవాళ్టి టి-బిల్లు సందర్భంగా చర్చలో సీమాంధ్ర ప్రాంత నేతలు పాల్గొంటారని సమాచారం.

Advertisements
Video | This entry was posted in National and tagged , , , , , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s