విభజనలో లెక్కతప్పిన చంద్రబాబు వ్యూహం

చంద్రబాబు లెక్క తప్పింది. విభజన ఎపిసోడ్ తో బీజేపీతో పొత్తు పెట్టుకుని రెండు ప్రాంతాల్లోనూ లబ్ది పొందాలని చూసిన టీడీపీ చీఫ్ కు తాజా పరిణామాలు షాకిచ్చాయి. లోక్ సభలో టీ-బిల్లుకు బీజేపీ మద్దతివ్వడంతో బాబు అంచనాలు తప్పాయి. కమలనాథులతో  పొత్తుకు సై అన్న సీమాంధ్ర తమ్ముళ్లు ఇపుడు నో చెప్పే పరిస్థితి తలెత్తింది. బీజేపీతో కలిసి ఎన్నికల్లోకి వెళితే  ప్రజలు పాతరేస్తారని ఆందోళన చెందుతున్నారు.

కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ కేసీఆర్‌, జగన్‌లతో ఒప్పందం కుదుర్చుకునే ఓట్లు, సీట్ల రాజకీయం చేస్తోందని తెలుగుదేశం మొదటి నుంచీ ఆరోపిస్తోంది. అందుకే తెలంగాణాపై సానుకూల నిర్ణయం తీసుకుందని చెబుతోంది.రాజకీయ ప్రయోజనాల కోసం ఆ రెండు పార్టీలతో కలిసి TDPని దెబ్బతీసేందుకు ఢిల్లీ పెద్దలు కుట్ర పన్నారని చంద్రబాబు పదేపదే ఆరోపిస్తున్నారు. ఇతర టీడీపీ నేతలు కూడా ఇదే అంశాన్ని  ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.

ఇక కాంగ్రెస్‌ నుండి దేశాన్ని రక్షించాలంటూ నినదిస్తున్న బీజేపీ దక్షిణాదిన నమ్మకస్తుడైన గట్టి ప్రాంతీయపార్టీ కోసం ఎదురుచూసింది. హైదరాబాద్‌ వచ్చిన మోడీ కాంగ్రెస్‌ను ఇంటికి పంపటానికి తెలుగుదేశం నాంది పలకాలని పిలుపునిచ్చారు. అదే సమయంలో కాంగ్రెస్‌ రాజకీయ  కుట్రను ఎదుర్కొనేందుకు ఢిల్లీలో చక్రం తిప్పాల్సిన అవసరం వుందని TDP నాయకత్వం భావించింది. అందుకే ఇరు  పార్టీల మధ్య వచ్చే ఎన్నికలకు పొత్తు పొడిచేలా కథ నడిచింది. మోడీతో పాటు బీజేపీ అగ్రనేతలతో చంద్రబాబు పలుమార్లు  చర్చించారు. ఒక దశలో చంద్రబాబును ఎన్‌డీఎ కన్వీనర్‌గా ప్రకటించే అవకాశాలున్నాయనే వార్తలు వచ్చాయి. విభజనకు అనుకూలిస్తేనే ఆ పార్టీతో పొత్తు మంచిందని తెలంగాణా నేతలు, సమైక్యంగా వుంచడానికి సహకరిస్తేనే ఆ పార్టీతో  కలిసి ప్రయాణం మంచిదని సీమాంధ్ర తమ్ముళ్లు బాబుకు సూచించారు.

ఇక మొదటినుంచి ఇరు ప్రాంతాలకు సమన్యాయం జరపాలని డిమాండ్‌ చేస్తున్న చంద్రబాబు .. అదే విషయం మీద బీజేపీ నేతలను ఒప్పించే ప్రయత్నం చేశారు. కమలంతోపొత్తు వుండే అవకాశం వుందని పార్టీ నేతలకు సంకేతాలిచ్చారు. విభజనపై బీజేపీ  అగ్రనేతలు విభిన్న ప్రకటనలు చేసినా అంతిమంగా సమన్యాయానికే కట్టుబడి వుంటుందని బాబు భావించారు. అయితే లోక్‌సభలో బీజేపీ అనుసరించిన వైఖరితో చంద్రబాబు షాకయ్యారు. కాంగ్రెస్ ను బీజేపీ రిస్ట్రిక్ట్ చేయలేకపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు టీ-బిల్లుకు బీజేపీ సంపూర్ణ మద్దతు ఇవ్వడంతో సీమాంధ్ర టీడీపీ నేతలు ఆపార్టీపై రగిలిపోతున్నారు. కేంద్రం అన్యాయం చేస్తుంటే ప్రధాన ప్రతిపక్షంగా తమకు అండగా వుండాల్సిందిపోయి అధికార పార్టీకి కొమ్ముకాసిందని విమర్శిస్తున్నారు.మొత్తానికి విభజన ఎపసోడ్ తో సీమాంధ్రలో కాంగ్రెస్‌ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమంటున్న టీడీపీ నాయకులు..ఇపుడు బీజేపీని కూడా అక్కడి ప్రజలు విలన్‌గా చూస్తారని చెబుతున్నారు. దీంతో కమలంతో పొత్తు తమకు నష్టం చేస్తుందని భావిస్తున్నారు. తాజా పరిణామాలతో రెండు పార్టీల మధ్య  పొత్తుకు  బ్రేక్‌ వేసినట్లేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతున్నా…రానున్న రోజుల్లో  ఎలా వుంటాయో చూడాల్సిన అవసరం వుంది.

Advertisements
Video | This entry was posted in National and tagged , , , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s