కాంగ్రెస్ హామీలతో మెత్తబడ్డ కమలనాథులు

  • సీమాంధ్రకు న్యాయం చేయాలని డిమాండ్
  • బీజేపీ ఉడుంపట్టుతో ఆత్మరక్షణలో పడ్డ కాంగ్రెస్
  • లోక్‌సభలో ఆంక్షలు లేకుండానే బీజేపీ మద్దతు
  • సీమాంధ్రకు న్యాయం చేసేలా సవరణలకు పట్టు
  • కమలం డిమాండ్‌తో టీ.బిల్లుపై కొనసాగిన ఉత్కంఠ
  • కాంగ్రెస్ హామీలతో మెత్తబడ్డ కమలనాథులు


క్షణక్షణం ఉత్కంఠ. చివరి వరకూ ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. బిల్లు ఆమోదం అంతా విపక్ష బీజేపీ చేతుల్లోకి వెళ్లింది. కమలదళం మద్దతు పలుకుతుందా? లేదా? ఓ చిన్న సస్పెన్స్. సవరణలపై ఉండుం పట్టు. కాంగ్రెస్‌తో దోబూచులాట. గత 3 రోజుల ఎపిసోడ్‌లో ఎన్నెన్నో అనుమానాలు.. మరెన్నో ఊహాగానాలకు తెరలేపాయి. చివరకు టీ.బిల్లుకు కమలనాథులు కలిసిరావడంతో.. సునాయాసంగా గట్టెక్కింది.


ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు ఆమోదానికి పార్లమెంటు ఉభయసభల్లో పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. బిల్లును కాంగ్రెస్‌ పార్టీ తెచ్చినా.. వ్యవహారం మొత్తం.. బీజేపీ చుట్టే తిరిగింది. తెలంగాణ ఏర్పాటుకు అనుకూలమంటూనే…, సీమాంధ్రకు న్యాయం చేయాలన్న డిమాండ్‌ను గట్టిగా వినిపించింది. బీజేపీ ఉడుంపట్టుతో ఓ దశలో ఆత్మరక్షణలో పడ్డ కాంగ్రెస్.. ఏం చేయాలోనని తీవ్ర తర్జనభర్జన పడింది. తొలుత లోక్‌సభలో టీ.బిల్లుకు ఆమోదముద్ర పడింది. ప్రభుత్వం ప్రతిపాదించిన 34 సవరణలకు ఆమోదం తెలిపారు. అప్పుడు ట్విస్ట్ ఇవ్వాలనుకున్న కమలం.. ఎందుకో వెనక్కు తగ్గి.. టీ.బిల్లుకు క్లియరెన్స్ ఇచ్చింది. ఈ చిన్నమ్మను కూడా తెలంగాణ ప్రజలు గుర్తుంచుకోవాలని.. సుష్మా చెప్పడం, మిగిలిన తతంగం రాజ్యసభలో చూసుకుందామన్నట్లుగా.. అప్పటికి పుల్‌స్టాప్ పెట్టారు.

రాజ్యసభలో తమ మద్దతు లేకుండా బిల్లు ఎలా పాసవుతుందో చూస్తామని పదేపదే బీజేపీ నేతలు ప్రకటించడంతో కేంద్రానికి మరోసారి ఇరకాటం తప్పలేదు. టీ.బిల్లును ఇంత తప్పుల తడకగా ఆమోదించేది లేదని.., సీమాంధ్రకు న్యాయం చేసేలా సవరణలు చేయాల్సిందే అని.. పట్టుబట్టారు. లోక్‌సభలో పాసైన బిల్లుకు రాజ్యసభలో సవరణలు చేస్తే.. మళ్లీ బిల్లు లోక్‌సభ ఆమోదానికి వెళ్లాల్సి రావడం.. అదో పెద్ద తతంగమని భావించిన కాంగ్రెస్.. నేరుగా బీజేపీ నేతలతోనే తేల్చుకునేందుకు రంగంలోకి దూకింది. కచ్చితమైన హామీలు ఇస్తామని.., సభలో ప్రధానితో ప్రధానితో ప్రకటన చేయిస్తామని చెప్పడంతో కమలనాథులు మెత్తబడ్డారు. రాజ్యసభలో అవన్నీ యదాతథంగా జరగడంతో తమ మాట నిలబెట్టుకున్నామన్న సంతృప్తికి లోనైంది. రెన్నెళ్ల తర్వాత తామే అధికారంలోకి వస్తామని అప్పుడు ఈ హామీలను దగ్గరుండి నెరవేర్చుకుంటామని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు అన్నారు.

మొత్తంగా.. టీ.బిల్లులో కమలం ట్విస్టులు తెలంగాణ వాదుల్లో ఒకింత ఆందోళనకు గురి చేసినా.. గతంలో చెప్పినట్లు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం ద్వారా కమలనాథులు… కాంగ్రెస్‌తో పాటే చిత్తశుద్ధిని నిరూపించుకున్నట్లైంది.

Advertisements
Video | This entry was posted in International and tagged , , , , , , , , , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s