పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లుకు మోక్షం

  • టి-బిల్లు తిరస్కరించాలని సభ్యుల నోటీసు
  • నిరసనల మధ్యే టీ. బిల్లు చదివిన షిండే
  • సీమాంధ్ర, తెలంగాణ సభ్యుల పోటాపోటీ నినాదాలు
  • సీపీఎం, డీఎంకే, జేడీయూ వాకౌట్…  
  • క్రమం తప్పకుండా తృణమూల్ సభ్యుల నినాదాలు
  • చివరగా ప్రధాని మన్మోహన్ ప్రకటన..
  • క్లాజులవారీగా బిల్లుపై మూజువాణి ఓటింగ్


అత్యంత నాటకీయ పరిణామాలు, ఉద్వేగాలు, ఎడతెగని ఉత్కంఠ, పదిసార్లు వాయిదాలు…, 5 గంటల చర్చ, ఆ తర్వాత విభజన బిల్లుకు ఆమోదముద్ర. రాజ్యసభలో నిన్న రాత్రి టీ.బిల్లుకు ఆమోదముద్ర పడిన ఘట్టమిది. లోక్‌సభలో ఎలాంటి చర్చ లేకుండా ఆమోదించడంతో కాంగ్రెస్‌తో పాటు బిజెపి కూడా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో రూట్ మార్చి… సభ్యులు చర్చించేందుకు సమయం కేటాయించారు. అయితే ఓటింగ్ పెట్టాలని పలు పార్టీలు కోరినా.. మూజువాణి ఓటుతోనే ముగించి కొత్త రాష్ట్ర ఏర్పాటుకు రెడ్‌ కార్పెట్‌ పరిచారు.

ఏపీ పునర్ వ్యవస్థీకరణ బిల్లు పెద్దలసభ ఆమోదం పొందింది. బిల్లు గందరగోళ పరిస్థితుల మధ్యే సభకు వచ్చింది. బిల్లు రాజ్యాంగ విరుద్దంగా ఉందని, తిరస్కరించాలని… పలువురు సభ్యులు నోటీసుఇచ్చారు. సభ్యులు ఇచ్చిన నోటీసులను రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ కురియన్‌ చదివి వినిపించారు. విపక్షనేత అరుణ్ జైట్లీ ఇచ్చిన నోటీసును కురియన్ తప్పుగా చదివి, ఆ తరువాత సవరించుకున్నారు. పలువురు సభ్యులు నిరసన-అరుపులు-కేకల మధ్యలోనే హోంమంత్రి షిండేకు కురియన్ అనుమతి ఇచ్చారు. బిల్లుకు రాజ్యాంగబద్దతలేదని సభ్యులు నినాదాలు చేస్తుండగా –  గందరగోళంలోనే షిండే.. బిల్లును చదివేశారు. సీమాంధ్ర, తెలంగాణ సభ్యుల పోటాపోటీ నినాదాలు సభలో మార్మోగాయి. విభజనపై టిడిపి సభ్యులు రెండుగా చీలి అనుకూల – వ్యతిరేక ప్లకార్డులు ప్రదర్శించారు.

బిల్లు చదివిన తరువాత హోగయా.. అని షిండే.. డిప్యూటీ ఛైర్మన్‌కు చెప్పారు. బిల్లుకు వ్యతిరేకత తెలుపుతూ డిఎంకె, జెడియు సభ్యులు రాజ్యసభ నుంచి బయటకు వెళ్లిపోయారు. లోక్‌సభలో అప్రజాస్వామికంగా ఆమోదించన బిల్లును రాజ్యసభకు తెచ్చారని తృణమూల్ సభ్యులు ప్లకార్డులు పట్టుకున్నారు. సభ జరిగినంతసేపూ పలువురు సభ్యులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఆ క్రమంలోనే బిల్లుపై చర్చకు  డిప్యూటీ ఛైర్మన్ అనుమతించారు. బిల్లులో సవరణలపై వెంకయ్యనాయుడు పట్టుబట్టారు. సీమాంధ్రకు న్యాయం చేకూర్చాలన్న క్రమంలో వెంకయ్య నాయుడు హడావుడే సభలో ఎక్కువగా కనిపించింది. తమ డిమాండ్ల చిట్టాను షిండే, జైరాంలకు ముందే అందించారు వెంకయ్య. చివరకు సవరణల నుంచి ప్రకటన చేసేందుకు ఒప్పుకున్నారు. సీమాంధ్ర ప్రత్యేక ప్రతిపత్తిని పదేళ్లు చేయాలని డిమాండ్ చేశారు. అంతలో కల్పించుకున్న షిండే… ఐదేళ్లకే ఒప్పుకున్నారు కదా అని ప్రశ్నించారు. నిజానికి ఈ ఐదేళ్ల స్పెషల్ స్టేటస్ అన్నది వెంకయ్యనాయుడు వల్లే సాధ్యమైంది.

టీ. బిల్లులోని న్యాయ, రాజ్యాంగ పరమైన అంశాలపై అరుణ్‌జైట్లీ, న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్ మధ్య మాటల తూటాలు పేలాయి. ఉమ్మడి రాజధాని రాజ్యాంగంలో ఎక్కడా లేదని, గవర్నర్ పాలనపైనా జైట్లీ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే… గవర్నర్‌కు అధికారాలు కల్పించలేదని… కేవలం అదనపు బాధ్యతలు మాత్రమే అప్పగించామని సిబల్ చెప్పుకొచ్చారు.

గందరగోళం మధ్యలోనే అన్ని పార్టీల సభ్యులు బిల్లుపై, రాష్ట్ర విభజనపై తమతమ అభిప్రాయాలు చెప్పారు. సభ్యుల ప్రసంగాల తరువాత చివరగా ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ప్రకటన చేశారు. ఆ వెంటనే.. తెలంగాణ బిల్లుపై చర్చ ముగిసిందని డిప్యూటీ ఛైర్మన్ కురియన్ ప్రకటించారు. ఓటింగ్‌కు వెంకయ్యనాయుడు పట్టుబట్టినా… అంగీకరించని కురియన్ క్లాజులవారీగా బిల్లుపై మూజువాణి ఓటింగ్ జరిపారు. చివరగా బిల్లు సభ ఆమోదం పొందిందని డిప్యూటీ చైర్మన్ ప్రకటించడంతో టీ.బిల్లుకు ఉభయసభల ఆమోదం పడినట్లైంది.

Advertisements
Video | This entry was posted in National and tagged , , , , , , , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s