పునర్ నిర్మాణంలో కలిసిరావాలని KCR పిలుపు

  • పునర్ నిర్మాణంలో కలిసిరావాలన్నారు KCR.

అనుకున్నది సాధించారు. తెలంగాణ ప్రజల స్వప్నాన్ని సాకారం చేశారు.13 ఏళ్ల ఉద్యమంతో కేంద్రం మెడలు వంచి విజయతీరాన్ని ముద్దాడారు కేసీఆర్. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చి హీరోగా నిలిచారు. టీ-బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించడంతో ఆనందబాష్పాలు కార్చారు. బంగారు తెలంగాణ సాధించుకుందామని పిలుపునిచ్చారు. అటు విడిపోయినా తెలుగుజాతిగా కలిసుందామని


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంనుంచి వెళుతున్నా….తెలంగాణ రాష్ట్రంలోనే అడుగుపెడాతనంటూ ఢిల్లీ వెళ్లిన TRS చీఫ్‌ కె.చంద్రశేఖర్‌రావు అనుకున్నది సాధించారు. అరవై ఏళ్ల తెలంగాణ రాష్ట్ర స్వప్నాన్ని సాధించారు. రాజ్యసభలో టీ-బిల్లు పాస్ కావడంతో  విక్టరీ సింబల్ చూపుతూ విజయగర్వంతో పార్లమెంట్ నుంచి బయటికి వచ్చారు. పార్టీ నేతలు,కార్యకర్తలతో సంబరాలు జరుపుకున్నారు. 60 ఏళ్ల కల సాకారం కావడంతో ఉద్వేగానికి లోనైన కేసీఆర్.. విజయాన్ని తెలంగాణ ప్రజలకు అంకితమిచ్చారు.

చరిత్రలో ఫిబ్రవరి 20 చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు కేసీఆర్‌. రాష్ట్ర విభజన ఒకరి విజయం, మరొకరి పరాజయం కాదన్నారు. ఇప్పటివరకు జరిగిన ఘటనలు మరిచిపోయి, రెండు రాష్ట్రాల అభివృద్ధికి తెలుగు ప్రజలు కృషి చేయాలని కేసీఆర్ పిలుపినిచ్చారు. హైదరాబాద్‌ లో సీమాంధ్రుల రక్షణకు ఢోకా లేదని టీఆర్ఎస్ అధినేత భరోసా ఇచ్చారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ చేసిన కృషి మరవలేనిదని కేసీఆర్ అన్నారు. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల తరుపున సోనియాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. టీ-బిల్లు ఆమోదానికి ఉన్న అన్ని అవరోధాలను తొలగించిన ప్రధాని మన్మోహన్, హోంమంత్రి షిండేలకు ఆయన అభినందనలు తెలిపారు. తెలంగాణ ఏర్పాటుకు సహకరించిన బీజేపీ నేతలకు కేసీఆర్ ధన్యావాదాలు తెలిపారు.

తెలంగాణ కోసం ఎందరో అమరులయ్యారని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. వారికి  కన్నీటి నివాళులర్పిస్తున్నానని తెలిపారు. అమరవీరుల కుటుంబాలను తెలంగాణ రాష్ట్రంలో ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజలు చిరకాల వాంఛ తీరిన సమయాన తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ లేకపోవడం దురదృష్టకరమన్నారు కేసీఆర్.తెలంగాణ ఉద్యమంలో తన పిలుపుకు స్పందించి కులం, మతం తేడా లేకుండా అంతా కలిసివచ్చారని చెప్పారు. ఉద్యమంలో పాల్గొన్న తెలంగాణ ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు, న్యాయవాదులు, ఆర్టీసీ తదితర జేఏసీ నేతల పోరాటాన్ని  కేసీఆర్ కీర్తించారు.

Advertisements
Video | This entry was posted in Andhra Pradesh News and tagged , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s