నల్లారి మౌనం వెనుక ప్రత్యేక వ్యూహం

కిరణ్‌ మౌనం దేనికి సంకేతం?
కొత్త పార్టీ పెడతారా? లేదా..?
23 లేదంటే 24న కార్యాచరణ

రాష్ట్రం ముక్కలైనట్టే. రేపో, మాపో తెలంగాణ గెజిట్‌ ఖాయం. మరి సీమాంధ్రలో కొత్త పార్టీ సంగతేంటి? కిరణ్‌ మదిలో ఏముంది? కొందరు నాయకులు ఒత్తిడి తెస్తున్నా.. కిరణ్ మౌనం వెనుక వ్యూహమేంటి? తన వెంట నడిచే నాయకుల సంఖ్యపై డైలమాలో ఉన్నారా? ఎల్లుండి కానీ, ఆ తర్వాతి రోజు కానీ జరిగే సమావేశంలో క్లారిటీ ఇస్తారా?
కిరణ్ కొత్త పార్టీపై పూటకో మాట వినిపిస్తోంది. cwc నిర్ణయం తరువాత అధిష్టానంపై కిరణ్ ధిక్కారంతో.. పురుడుపోసుకున్న కొత్త పార్టీ ప్రచారం ఊగిసలాట వీడడం లేదు. నల్లారి మౌనం భిన్న విశ్లేషణలకు, వాదనలకు ఆస్కారం కల్పిస్తోంది. ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన తరవాత ఉత్కంఠ మరింత పెరిగింది. రాజీనామా కంటే ముందే ఆయన సీమాంధ్ర కాంగ్రెస్‌ నాయకులతో పలుదఫాలు చర్చలు జరిపారు. తన వెంటవచ్చే వారిపై కిరణ్‌కు క్లారిటీ వచ్చిందనే ప్రచారం కూడా ఉంది.
రాజకీయ భవిష్యత్‌ కార్యాచరణకు సంబంధించిన చర్చకు కిరణ్‌ పుల్‌స్టాఫ్‌ పెట్టబోతున్నారు. 23న లేదంటే 24న ఆయన సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. కొత్తపార్టీపై క్లారిటీ ఇస్తారని తెలుస్తోంది. విభజన ఆపగలిగి.. సమైక్య పార్టీ పేరుతో జనాల్లోకి వెళ్లి ఉంటే ఆదరించేవారనీ.. అంతా అయిపోయాక సమైక్య పార్టీని పట్టించుకునేవాళ్లు ఉండరనే నాయకులు లేకపోలేదు. మరికొందరేమో… కొత్త పార్టీతో జనంలోకి వెళ్లేందుకు కిరణ్‌ ఎజెండా సిద్ధం చేసుకున్నట్లు చెబుతున్నారు.
రాష్ట్రంలోని పార్టీలన్నిటికి ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో విభజనలో భాగస్వామ్యం ఉందని కిరణ్‌ వర్గం అంటోంది. విభజన పాపం కాంగ్రెస్‌దే అయినా.. లేఖ ఇచ్చి టీడీపీ.. మద్దతిచ్చి బీజేపీ.. ఆర్టికల్‌ త్రీ అంటూ వైసీపీ… సీమాంధ్రుల్లో వ్యతిరేకత మూటగట్టుకున్నాయని అంటున్నారు. అన్ని పార్టీలను ఎండగట్టేందుకు కొత్త పార్టీకి అవకాశం ఉంటుందని నమ్ముతున్నారు. తెలుగు వారి ఐక్యత పేరుతో ప్రజల మన్నన పొందగలదనే ధీమా కిరణ్‌ శిబిరంలో కన్పిస్తోంది. కిరణ్‌ అజెండా ఎలా ఉన్నా ఆయనతో కలిసి వచ్చేవారు ఎంతమంది ఉన్నారనే చర్చ ఆసక్తి రేపుతోంది. ముఖ్యమంత్రిగా ఉండగా మీ వెంటే మేమంతా అని చెప్పినవాళ్లు.. పదవి పోయాక కూడా అదేమాట మీద నిలుస్తారా? త్వరలో జరగబోయే భేటీకి ఎంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరవుతారనేది హాట్‌టాపిక్‌గా మారింది.

Advertisements
Video | This entry was posted in Uncategorized and tagged , , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s