రజినీకాంత్ కోసం పార్టీల ఎదురుచూపు

తమిళ సూపర్‌స్టార్‌ రజనీ అనుగ్రహం కోసం జోరుగా లాబీయింగ్ జరుగుతోంది. ఆయన ఏ పార్టీవైపు మొగ్గు చూపుతారో అనే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. రజనీ అభిమానులు చేస్తున్న హంగామా చూస్తే.. త్వరలో ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు అర్థమవుతోంది.
m10
తమిళనాడులో పార్టీల గెలుపు ఓటములను ప్రభావితం చేయగల సత్తా ఉన్న సూపర్‌స్టార్ రజనీకాంత్ ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీవైపు మొగ్గుచూపుతారో అనే అంశం చర్చనీయాంశంగా మారింది. ఆయన అభిమానులు చెన్నై, సేలం జిల్లాల్లో చేస్తున్న హంగామా చూస్తుంటే.. రజనీ పొలిటికల్ ఎంట్రీ ఖాయంగానే కనిపిస్తోంది. తమిళనాడులోని పలు ప్రాంతాల్లో సమావేశమై రజనీ అభిమాన సంఘాలు అభిప్రాయ సేకరణ జరపడం దీనికి బలం చేకూరుస్తోంది.

రజనీకాంత్ అనుగ్రహం కోసం జాతీయ పార్టీలు సైతం ఎదురుచూస్తున్నాయి. 96లో డీఎంకే, కాంగ్రెస్ కూటమికి ఈయన మద్దతు పలికారు. తరువాత ఎన్నికల్లో బీజేపీకి జై కొట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మంచిపాలన అందించే పార్టీకే ఓటు వేయాల్సిందిగా అభిమానులకు పిలుపునిచ్చారు. ఈసారి ఎన్నికల్లో రజనీ మద్దతు పొందాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. రజనీకి మోడీ సన్నిహితుడు కావడం కమలనాథులకు కలిసొస్తున్న అంశం.

ఫ్యాన్స్ నాడి తెలుసుకునేందుకు రజనీకాంత్ అభిమాన సంఘాలు రంగంలోకి దిగాయి. కేంద్రంలో సమర్థవంతమైన సుస్థిరపాలన రావాలని, ధరలు తగ్గుముఖం పట్టాలని, కరెంట్ కోతలు లేని పాలన కావాలని అభిమానులు కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇవన్నీ సమకూర్చగల పార్టీకి ఓటేస్తామన్నారు. అభిప్రాయసేకరణ పూర్తైన తరువాత నివేదికను రజనీకాంత్‌కు సమర్పిస్తామని, తుది నిర్ణయం ఆయనే తీసుకుంటారని అభిమాన  సంఘాల నాయకులు చెప్తున్నారు.

Advertisements
Video | This entry was posted in National and tagged , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s