రాష్ట్రవ్యాప్తంగా మహాశివరాత్రి శోభ

రాష్ట్రవ్యాప్తంగా శివరాత్రి శోభ వెల్లివిరుస్తోంది. పర్వదినం సందర్భంగా  ప్రముఖ శైవక్షేత్రాలు భక్తులతో కళకళలాడుతున్నాయి. లింగోద్భవ సమయాన అర్చకులు ముక్కంటికి మహా రుద్రాభిషేకం నిర్వహించారు. లక్షల సంఖ్యలో తరలివస్తున్న భక్తులు.. మహాదేవుణ్ని దర్శించుకుని తరించిపోతున్నారు.

భూలోక కైలాసంగా భాసిల్లుతున్న శ్రీశైల క్షేత్రంలో శివరాత్రి వేడుకలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో  ఏడో రోజున విశేష పూజలందుకున్న పార్వతీ పరమేశ్వరులు.. సాయంత్రం గజవాహనంపై ఊరేగారు. ఈ గ్రామోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. ఇక ఇవాళ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి నంది వాహనంపై దర్శనమివ్వనున్నారు. రాత్రి లింగోద్భవ సమయంలో.. ఏకాదశ మహన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించనున్నారు. అలాగే ఆనవాయితీ ప్రకారం జరిగే పాగాలంకరణ సేవను నిర్వహిస్తారు…

ఇక చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో శివరాత్రి వేడుకలు అత్యంత భక్తిప్రపత్తుల నడుమ జరుగుతున్నాయి. ప్రభుత్వం తరఫున మంత్రి గల్లా  అరుణకుమారి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. సాయంత్రం స్వామివారు శేషవాహనంపై.. జ్ఞాన ప్రసూనాంబ యాళి వాహనాలపై ఊరేగారు. వినాయకుడు, సుబ్రమణ్యస్వామి, భక్త కన్నప్ప, చండికేశ్వరుడు వారి వెంట నడిచివచ్చారు. ఈ అపురూప దృశ్యాలను తిలకించేందుకు… భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు..

దక్షిణ కాశిగా పిలిచే కరీంనగర్‌ జిల్లా వేములవాడ క్షేత్రంలో మహాశివరాత్రి వేడుకలకు జనం పోటెత్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున.. ముఖ్య అర్చకులు గురువరాజన్‌ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని… మూడు రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు చేశారు. ఈ సాయంత్రం స్వామివారికి.. మహా లింగార్చన, లింగోద్భవ సమయాన… ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తారు. ఇప్పటికే దాదాపు లక్ష మంది వేములవాడకు చేరుకోగా… మరో నాలుగు లక్షల వరకు భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు…

ఇక పంచారామాల్లో  మూడు ఆరామాలు కొలువైన తూర్పు గోదావరి జిల్లాల్లో  శివరాత్రి శోభ వెల్లివిరుస్తోంది. పిఠాపురం పాదగయా క్షేత్రం, ద్రాక్షారామ కుక్కుటేశ్వరస్వామి ఆలయం, సామర్లకోట భీమేశ్వరస్వామి ఆలయాలకు లక్షల సంఖ్యలో భక్తులు పోటెత్తుతున్నారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని అధికారులు.. విస్తృత ఏర్పాట్లు చేశారు. ఆర్టీసీ అధికారులు సైతం పెద్ద సంఖ్యలో ప్రత్యేక బస్సులను కేటాయించారు.

Advertisements
Video | This entry was posted in Andhra Pradesh News and tagged , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s