కమలంతో దోస్తీకి కరుణానిధి తహతహ!

బీజేపీ చెంతకు డీఎంకే!
తమిళనాట మారుతున్న సీన్
జయ దూకుడుకు బ్రేక్ వేస్తారా?

తమిళనాట బీజేపీకి కొత్త మిత్రుడు దగ్గరవుతున్నాడు. కాంగ్రెస్‌ పేరెత్తితేనే మండిపడుతున్న కరుణానిధి… నరేంద్ర మోడీ తనకు మంచి మిత్రుడని చెప్పడం హాట్‌ టాపిక్ అయింది. రాబోయే ఎన్నికల్లో బీజేపీ-డీఎంకే మధ్య పొత్తు కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రధానమంత్రి కుర్చీపై కన్నేసిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రజాకర్షక హామీలతో ప్రజలకు గాలం వేస్తున్నారు. వామపక్షాలతో పొత్తు కుదుర్చుకుని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపుపై ధీమాగా ఉన్నారు.


డీఎంకే అధినేత కరుణానిధి పరిస్థితి వేరు. సొంతింట్లో వారసత్వ పోరు తారస్థాయికి చేరింది. ఇద్దరు కుమారులు అళగిరి – స్టాలిన్ రెండు ధృవాలుగా మారిపోయారు. కూతురు కనిమొళిపై అవినీతి కేసులు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి. రాష్ట్రంలో అధికారం కనుచూపుమేర కనిపించడం లేదు. కేంద్రంలోనైనా చక్రం తిప్పితేగానీ సమస్యల సుడిగుండం నుంచి బయటపడలేని దుస్థితి. సీఎం జయలలిత దూకుడుకు బ్రేకులు వేయాలంటే వచ్చే ఎన్నికల్లో నమ్మకమైన మిత్రుడి అండ డీఎంకేకు అవసరం. దీంతో కరుణానిధి బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీ తనకు మంచి మిత్రుడని ఆయన చెప్తున్నారు.

తమిళనాడులో కమలానికి ఆదరణ అంతంతే. ప్రాంతీయ పక్షాలతో, చిన్నా చితకా పార్టీలతో కలిసి వెళ్తేనే గానీ అక్కడ ఫలితం ఉండదని బీజేపీ నాయకుల అభిప్రాయం. పనిలోపనిగా సూపర్‌స్టార్‌ రజనీకాంత్ వెంటబడ్డారు. ఆయనతో మోడీకున్న అనుబంధాన్ని గుర్తుచేస్తూ పార్టీలైన్లోకి తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఇప్పుడు కరుణానిధి లాంటి రాజకీయ దిగ్గజం తమ చెంతకు వస్తానంటే కాదనే పరిస్థితిలో కమలనాథులు లేరు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ఆలోచనలోనే ఉన్నారు.

Advertisements
Video | This entry was posted in National and tagged , , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s