ప్రభుత్వశాఖల విభజనపై కసరత్తు

ప్రభుత్వ శాఖల విభజనపై మూడు అంచెల కసరత్తు
15 విభజన కమిటీలు, రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ విభాగం, ఎపెక్స్‌ కమిటీ
ముందుగా విభజన కమిటీ ముందుకు ఫైళ్లు
రెండో దశలో రీ ఆర్గనైజేషన్‌ సెల్‌కు దగ్గరగా
చివరగా ఎపెక్స్‌ కమిటీ ముందుకు ఫైళ్లు
రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణలో ముగ్గురు ఐఏఎస్‌లు
ఆంధ్రా నుంచి రామకృష్ణారావు, తెలంగాణ నుంచి బి.వెంకటేశం, తటస్థుడిగా జయేష్‌ రంజన్‌
వివిధ శాఖలపై 15 కమిటీల అధ్యయనం
మూడు అంచెల్లో క్షుణ్ణంగా ఫైల్‌ పరిశీలన  

ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన ఖరారైంది. ప్రణబ్‌ ముఖర్జీ ఇవాళే సంతకం చేయనున్నారు. మరోవైపు.. పాలనాపరమైన విభజనకు రంగం సిద్ధమవుతోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి మూడు అంచెల వ్యవస్థ ఏర్పాటు చేశారు. వివిధ అంశాలపై అధ్యయనం చేసేందుకు ఛత్తీస్ గఢ్‌కు ఐఏఎస్‌ బృందాలను పంపనున్నారు. రాష్ట్రపతి పాలన అమల్లోకి వస్తున్నందున అధికారులపై ఆంక్షలు విధించారు.

రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రభుత్వ శాఖల విభజనపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి దృష్టి పెట్టారు. విభజన ప్రక్రియ సాఫీగా సాగేందుకు విభజన కమిటీ, రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ విభాగం, ఎపెక్స్‌ కమిటీలను ఏర్పాటు చేశారు. వివిధ అంశాలకు సంబంధించిన  ఫైళ్లను మొదట విభజన కమిటీలు పరిశీలిస్తాయి. అక్కడి నుంచి ఫైళ్లు రీ ఆర్గనైజేషన్‌ సెల్‌కు చేరుతాయి. ఈ విభాగం నుంచి ఎపెక్స్ కమిటీ ముందుకు ఫైళ్లు వెళతాయి. ఈ మూడు అంచెల్లో ఫైళ్లను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత చివరగా గవర్నర్ ఆమోదం కోసం పంపిస్తారు.


రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ విభాగంలో ముగ్గురు ఐఏఎస్ అధికారులున్నారు. ఇందులో ఆంధ్రా నుంచి రామకృష్ణారావు, తెలంగాణ నుంచి బుర్ర వెంకటేశం, రాష్ట్రేతరుడైన జయేష్‌ రంజన్‌ నియమించారు. ఇక 15 కమిటీలు ఫైల్‌ ఇన్వెంటరీ, పోలీసింగ్‌ గ్రేహౌండ్స్‌ అండ్‌ అక్టోపస్‌, బిల్డింగ్స్ అస్సెట్స్ అండ్‌ లయబిల్టీస్‌, కంపెనీస్‌ అండ్‌ కార్పొరేషన్స్, కాంట్రాక్ట్‌ , ట్రైనింగ్‌ సంస్థలు, ఉద్యోగుల కేటాయింపు, స్పెషల్‌ డెవలప్ మెంట్‌ ప్యాకేజీ, ఇరిగేషన్, ఎనర్జీ, కొత్త రాజధాని, ఉన్నత విద్య, సర్వీసెస్‌, కోర్టు కేసులు, రీ సోర్స్ మొబలైజేషన్‌ వంటి అంశాలపై నివేదికలు తయారు చేస్తారు. వీటిని రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ సెల్‌ అధ్యయనం చేసి, సీఎస్ నేతృత్వంలోని ఎపెక్స్‌ కమిటీకి పంపిస్తారు. ఇలా మూడు అంచెల్లో ఫైల్‌ను క్షుణ్ణంగా పరిశీలించి, చివరగా ఆమోదం కోసం గవర్నర్‌కు దగ్గరికి పంపిస్తారు. 

ఈ మూడు అంచెల వ్యవస్థతో పాటు నూతన విద్యా సంస్థ ఏర్పాటు, మౌలిక వసతుల కల్పన కమిటీలను సైతం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా రాజ్యాంగంలోని 9, 10 షెడ్యూళ్లోని చాలా శాఖల్లో పని లేకున్నా సిబ్బంది మాత్రం కొనసాగుతున్నారు. వీరిపై అధ్యయనానికి సెంటర్ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ ఆధ్వర్యంలో 30 మందితో రీసెర్చ్‌ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం ఇచ్చే నివేదక ఆధారంగా పని లేని శాఖలను తొలగిస్తారు. మరోవైపు విభజన నేపథ్యంలో పరిస్థితులను అధ్యయనం చేయడానికి ఐఎఎస్‌ల బృందాలను ఛత్తీస్‌గఢ్ పంపించనున్నారు. ప్రస్తుతానికి ఇరిగేషన్‌ బృందం ఖరారైంది. ఇందులో జోషి, ఆదిత్యనాథ్‌ దాసు, రామకృష్ణారెడ్డి ఉన్నారు
.

ఇక ఐఎఎస్‌ల అధికారుల విభజనను కేంద్రమే చూస్తోంది. ఇందుకు ఓ కమిటీని నియమించనున్నారు. రాష్ట్రంలో 376 అఖిల భారత సర్వీసుల పోస్టులుండగా. ప్రస్తుతం 290 మంది మాత్రమే పనిచేస్తున్నారు. అయితే ఇటీవల ఆరుగురికి రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్‌ హోదా కల్పించింది. ఇతర రాష్ట్రాల నుంచి ముగ్గురు రావడంతో వీరి సంఖ్య 299కు చేరింది. 


ఇంకోవైపు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వస్తున్న నేపథ్యంలో అధికారులపై సీఎస్ కొన్ని ఆంక్షలు విధించారు. ఇక అధికారులు ఫైళ్లను సచివాలయంలోనే పరిశీలించాలి. ఇంటికి తీసుకెళ్లడం కుదరదు. దీన్ని కట్టుదిట్టంగా అమలు చేసేందుకు జేఏడీ, ఎస్‌పీఎఫ్‌లో విజిలెన్స్ కమిటీ నియమించారు. 

Advertisements
Video | This entry was posted in Andhra Pradesh News and tagged , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s