మెగా ఫ్యామిలీ నుంచి మరో పార్టీ?

  • మెగా ఫ్యామిలీ నుంచి మరో పార్టీ?
  • మెగా బ్రదర్‌కి పోటీనా?
  • పవర్‌ పాలిటిక్స్‌పై ఎన్నో కథనాలు
  • అన్నయ్య పార్టీ కోసం తెగ కష్టపడ్డాడు
  • ప్రజారాజ్యం విలీనంతో రాజకీయాలపై విరక్తి
  • సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో నిరాహార దీక్ష?
  • పవన్‌ పార్టీ పెడితే ఓటేస్తా: వర్మ

పవర్‌ స్టార్‌ నోటి వెంట పాలిటిక్స్‌ అన్న పదం రాబోతోంది. ప్రజారాజ్యం పార్టీ విలీనం తరువాత రాజకీయాలంటేనే విరక్తి పెంచుకున్న పవర్‌స్టార్‌.. మళ్లీ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. పార్టీ పెడతాడా, ఏదైనా పార్టీకి సపోర్ట్‌ చేస్తాడా.. వీటన్నిటికీ దూరంగా ఉంటానని చెబుతాడా అనేది మరో రెండు వారాల్లో తేలిపోనుంది.

To View Video Click Here

మెగా ఫ్యామిలీ నుంచి మరో పార్టీ పుట్టుకురానుందా? లేదా మెగా బ్రదర్‌కి పోటీగా రాజకీయాల్లో ఎదగడానికి ప్లానింగా? పవన్ సృష్టించిన సస్పెన్స్‌లో చివరికి ఏం తేలబోతోంది? ప్రజారాజ్యం విలీనం తరువాత పవన్‌ కళ్యాణ్‌ నోటి వెంట పాలిటిక్స్ అనే పదం వినిపించడం బహుషా ఇదే మొదటిసారి కావచ్చు. పవన్‌ రాజకీయాల్లోకి రాబోతున్నాడంటూ మీడియాలో ఎప్పటి నుంచో కథనాలు వస్తున్నాయి. వాటిపై ఇప్పటి వరకు స్పందించని పవన్‌… అన్నిటికీ ఒకేసారి సమాధానం చెబుతానంటూ మీడియాకు కబురుపంపాడు.

పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేస్తాడా, రాజకీయాల్లోకి వస్తాడా లేదా అన్న దానిపై స్పష్టత ఇస్తాడా అన్నది ఈ నెల రెండో వారంలో తేలనుంది. నిజానికి పవన్‌ పాలిటిక్స్‌పై ఆసక్తి చూపుతున్నాడని ఎప్పటి నుంచో వింటున్నదే. అన్నయ్య ప్రజారాజ్యం పార్టీ సమయంలో బాగానే కష్టపడ్డాడు. జిల్లాల్లోని యూత్‌ వింగ్‌ను ఏర్పాటుచేయడంలోనూ, జిల్లా నేతల నియామకంలోనూ ప్రత్యేక ఇంట్రస్ట్‌ చూపించాడు. అన్నయ్య పార్టీని ఓ రేంజ్‌లో నిలపడం కోసం… చిన్నా పెద్దా తేడా చూపించకుండా అందరి నుంచి సలహాలు తీసుకున్నాడు. ప్రజలకు సేవ చేయాలన్న తపన కూడా ఉండేది. కాని, ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్‌లో కలపడంతో రాజకీయాలపై విరక్తి పెంచుకున్నాడు. ఇంకోసారి పాలిటిక్స్‌ అన్న పదాన్నే పలక్కూడదనుకున్నాడని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. కాని, సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో మాత్రం మనసు మార్చుకున్నట్లు కనిపించింది. ఆ రోజుల్లో జరుగుతున్న పరిణామాలను చూసి తట్టుకోలేక ఇంట్లోనే కూర్చుని నిరాహార దీక్ష చేశాడన్న టాక్‌ కూడా వచ్చింది.

పవన్‌ను పాలిటిక్స్‌లోకి వెళ్లమని కొందరు వ్యక్తిగతంగా సలహా ఇచ్చారని ఫిల్మ్‌నగర్‌ వర్గాల్లో గుసగుసలు వినిపించాయి. ఇక వర్మలాంటి వాళ్లైతే పవన్‌ రాజకీయాల్లోని వస్తే మొదటి ఓటు వేస్తానంటూ ట్విట్టర్‌లోనే చెప్పాడు. ఏదేమైనా పవన్‌ నోట్లోకి పాలిటిక్స్ అన్న పదం రాగానే.. ఆయన్ను ఆహ్వానించేందుకు రాజకీయ పార్టీలు క్యూ కడుతున్నాయి. పవర్‌ స్టామినాను వాడుకునేందుకు రెడీగా ఉన్నాయి. ఆ మధ్య పవన్‌ కల్యాణే స్వయంగా ఓ పార్టీ ఆఫీస్‌కు కూడా వెళ్లొచ్చాడని వార్తలు వచ్చాయి. మరి పవన్‌ ఏదైనా పార్టీ వెంట నడుస్తాడా? కొత్త పార్టీ పెడతానని ప్రకటిస్తాడా అనేది మరో రెండు వారాల్లో తేలనుంది.

Advertisements
Video | This entry was posted in Andhra Pradesh News and tagged , , , , , , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s