పాలనలో గవర్నర్ జెట్‌ స్పీడ్‌ దూకుడు

– క్షణాల్లో సమస్యకు పరిష్కారం…
– ప్రజలకు అన్యాయం జరిగితే సహించేది లేదు..
– బంకు యాజమాన్యాల ఓవరాక్షన్‌కు చెక్..
– రాష్ట్రపతి పాలనలో ఓవరాక్షన్‌లు కుదరవ్..
– టీచర్ల బదిలీల్లో అక్రమాలపైనా గవర్నర్ దృష్టి..
– టీచర్ల అక్రమ బదిలీలకు నరసింహన్ చెక్ పెడతారని ప్రచార
– కిరణ్ చివరి నిర్ణయాల్లో క్లారిటీ లేదని ఫిర్యాదులు
– అనంతరాము, విజయానంద్, రావత్‌ల బదిలీల నిలిపివేత
– రావత్‌ను జెన్‌కో ఎండీగా నియమించిన కిరణ్..
– సాంఘిక సంక్షేమ కార్యదర్శిగా బదిలీ చేసిన గవర్నర్
– రామును సాంఘిక సంక్షేమ శాఖకు బదిలీ చేసిన కిరణ్
– రామును పాతశాఖకే మారుస్తూ రాజ్‌భవన్ ఉత్తర్వులు
– విజయానంద్‌కు పాతశాఖ కేటాయిస్తూ నరసింహన్ ఆదేశాలు

http://www.youtube.com/watch?v=qh8dQQDSPXk

రాష్ట్రపతి పాలనలో.. రాజ్‌భవన్‌ దూకుడుగా వెళ్తోంది. ప్రజలకు ఏమాత్రం అన్యాయం జరుగుతోందని తెలిసినా… సహించేది లేదన్నట్లుగా గవర్నర్ దూసుకెళ్తున్నారు. అనవసర  బదిలీలు.., అక్రమాలపై ఉక్కుపాదం మోపుతున్నారు నరసింహన్. చెకింగ్‌లు చేస్తే తప్పా అంటూ.. పెట్రోల్ బంకుల యాజమాన్యాల అసలు రంగును బయటపెట్టి.. సమస్యను గంటలోనే పరిష్కరించారు. ఈమధ్య జరిగిన అక్రమాలపైనా తనదైన శైలిలో విచారిస్తున్నారు నరసింహన్. గవర్నర్ పాలనలో అన్యాయాలకు చెక్ పడుతుండడంతో.. జనం నుంచీ భారీ స్పందన లభిస్తోంది.

గవర్నర్ పాలన ఎలా ఉంటుందో తెలియని నేటి తరానికి అసలు సిసలు రుచి చూపిస్తున్నారు నరసింహన్. పాలనలో పారదర్శకత…., అక్రమాలకు చెక్… సమాజంలో శాంతిభద్రతలే పరమావధిగా… జనానికి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా… క్షణాల్లో సమస్యకు పరిష్కారం చూపడం ఎలాగో చేతల్లో చేసి చూపిస్తున్నారు. ప్రజలకు ఏమాత్రం అన్యాయం జరగడానికి వీల్లేదని కంకణం కట్టుకున్న నరసింహన్… పెట్రోల్ బంకుల యాజమాన్యాల ఓవరాక్షన్‌కు క్షణాల్లోనే చెక్ పెట్టారు. రాష్ట్రపతి పాలనలో ఇలాంటి చేష్టలు  అస్సలు కుదరవని…, యాక్షన్‌కు వెంటనే రియాక్షన్ ఉంటుందని నిరూపిస్తున్నారు.

ముఖ్యమంత్రిగా చివరి రోజుల్లో కిరణ్ తీసుకున్న కొన్ని నిర్ణయాల్లో క్లారిటీ లేదని… టీ. కాంగ్రెస్‌ నేతలు గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేయడమే తరువాయి.. తనదైన స్టైల్లో… బ్రేకులేస్తున్నారు. ఐఎఎస్ అధికారులు అనంతరాము, విజయానంద్, రావత్‌ల బదిలీలను నిలిపివేస్తూ ఆదేశాలిచ్చారు. సిఎం స్పెషల్ సెక్రెటరీగా పనిచేసిన రావత్‌ను ఎపి జెన్‌కో ఎండీగా నియమిస్తూ ఫిబ్రవరి 18న ఆదేశాలు వెలువడగా, తాజాగా రావత్‌ను సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇక రవాణాశాఖ కమిషనర్‌గా పనిచేసిన అనంత రామును సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా బదిలీ చేస్తు ఫిబ్రవరి 17న ఆదేశాలు జారీ అవగా, ఆయన్ని తిరిగి పాతశాఖకే మార్చుతూ తాజా ఉత్తర్వులు వచ్చాయి. ఎపి జెన్‌కో ఎండీగా ఉన్న విజయానంద్‌ను ఆ స్థానం నుంచి మార్చి రవాణా శాఖ కమిషనర్‌గా పాత ప్రభుత్వం చేసిన నియామకాన్ని  గవర్నర్ రద్దు చేశారు.

టీచర్ల బదిలీల్లో చివరి నిమిషంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపైనా.. రాజ్‌భవన్ దృష్టి సారిస్తున్నట్లు తెలిసింది. మొదటి విడతగా.. 3 వందల మంది టీచర్ల బదిలీలు జరిగాయి. రెండో విడతలో మరో 6 వందల మంది ఉపాధ్యాయులను బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా…, విద్యాశాఖ కార్యదర్శి.. అప్పట్లో సెలవుపై వెళ్లడంతో ఆ ఫైల్ అక్కడితో ఆగిపోయింది. ఈ వ్యవహారంపై నరసింహన్‌ చెక్ పెట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రాజ్‌భవన్ వర్గాలంటున్నాయి. మొత్తంగా.. గవర్నర్ గిరీ.. అసలు రుచి చూపిస్తున్నారు నరసింహన్. ఈ దూకుడుపై కొందరు గుండెల్లో రైళ్లు పరుగెడుతుండగా… జనం నుంచి కూడా భారీ స్పందన లభిస్తోంది.

Advertisements
Video | This entry was posted in Andhra Pradesh News and tagged , , , , , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s