ఖమ్మం టూర్‌కి సిద్ధమైన జగన్‌..

తానేంటో.. తన సత్తా ఏంటో నిరూపించాలని పట్టుదలగా ఉన్న జగన్‌.. ఎన్నికల్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ దూసుకెళ్తున్నారు. నిన్న పశ్చిమ గోదావరి పర్యటనకు ప్రజల్లో చక్కటి స్పందనే వచ్చింది. ఐతే, ఇవాళ ఆయన ఖమ్మంలో అడుగు పెడుతుండడం అగ్గి రాజేస్తోంది. జగన్‌ను అడ్డుకుని తీరతామని తెలంగాణవాదులు హెచ్చరించడంతో జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

వైసీపీ అధినేత జగన్‌ రెండు రోజుల పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో క్యాడర్‌లో కొత్త ఉత్సాహం నింపింది. తొలి రోజున ఏలూరు జనభేరీలో పాల్గొన్న యువనేత.. రెండో రోజున దూబచర్ల, నల్లజర్ల, అనంతపల్లి, గౌరీపట్నంలో రోడ్‌ షో నిర్వహించారు. నిడదవోలులో  జరిగిన జనభేరీ సభలో ఉద్వేగంగా మాట్లాడారు.  సీమాంధ్రుల భావోద్వేగాలను పట్టించుకోకుండా అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించారని మండిపడ్డారు.  ద్రబాబుకు విశ్వసనీయత లేదని, ఆయన అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలుండవని ఎద్దేవా చేశారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు జీఎస్‌ రావుతో పాటు పలురు కాంగ్రెస్‌ నాయకుల్ని వైసీపీలోకి ఆహ్వానించారు.

ఇక జగన్‌ ఇవాళ ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన్ను అడ్డుకుంటామని తెలంగాణవాదులు హెచ్చరించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇవాళ జిల్లాలో బంద్‌ కొనసాగుతోంది. అయితే వైసీపీ నేతలు మాత్రం జగన్‌ పర్యటన జరిగితీరుతుందని చెబుతున్నారు.

మరోవైపు ఖమ్మం జిల్లా బంద్‌కు కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకించిన జగన్‌కు తెలంగాణలో తిరిగే హక్కు లేదంటూ.. వైసీపీకి వ్యతిరేకంగా వివిధ పార్టీల లీడర్లు ర్యాలీలు తీశారు. వీరికి పోటీగా వైసీపీ కార్యకర్తలు కూడా ర్యాలీ చేయడంతో ఉద్రిక్తత నెలకొంది.  ఇంకోవైపు జగన్‌ ఖమ్మం పర్యటనకు అనుమతి రద్దు చేయాలని తెలంగాణ న్యాయవాదుల జేఏసీ గవర్నర్‌కు విజ్ఞప్తి చేసింది. జగన్‌ టూర్‌పై ఎవరికి వారు పట్టుదలగా ఉండడంతో.. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. చట్టాన్ని ఎవ్వరూ ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

Advertisements
Video | This entry was posted in Andhra Pradesh News and tagged , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s