గులాబీ బాస్‌ తీరుతో విజయశాంతి రగిలిపోతోంది

వ్రతం చెడ్డా ఫలితం దక్కాలంటారు. కానీ కాంగ్రెస్‌కి అది కుదరడం లేదు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన క్రెడిట్ తమకు దక్కుతుందని హస్తం పార్టీ భావిస్తే.. అది కాస్తా TRS ఖాతాలోకెళ్లిపోతోంది. సోనియా దేవత అంటూనే.. ఓటు మాత్రం గులాబీ పార్టీకి వేసే ఆలోచనలో జనం ఉండడం వాళ్లకు మింగుడు పడడం లేదు. KCR కూడా ఏరుదాటాక తెప్పతగలేయడంతో.. ఇక డైరెక్ట్‌ వార్‌కే సిద్ధమైంది. ఈ గొడవను సెటిల్ చేసుకుంటూనే తెలంగాణ, సీమాంధ్రల్లో వేర్వేరు PCCల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది.
m2
గులాబీ బాస్‌ తీరుతో కాంగ్రెస్‌ అధిష్టానం రగిలిపోతోంది. ఢిల్లీలో ఒకమాట.. హైదరాబాద్ తిరొచ్చాక ఆయన మరోమాట చెప్తున్నారన్న ఆగ్రహం వారిలో కనిపిస్తోంది. అందుకే అదును చూసి.. విజయశాంతిని సీన్‌లోకి దింపారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్నాక ఫస్ట్‌ ఎంట్రీలోనే రాములమ్మ చెలరేగిపోయారు. తాను కాంగ్రెస్‌కి రాజీనామా చేస్తే… TRSను విలీనం చేస్తారా అంటూ KCRను సూటిగా ప్రశ్నించారు. విలీనంపై కుంటిసాకులు చెప్పొద్దని ఫైరైపోయారు.

విజయశాంతి సంధించిన ప్రశ్నలకు ప్రస్తుతానికి TRS వైపు నుంచి సమాధానం రాలేదు. అటు, ఆ పార్టీతో కలసి నడిచే విషయంపై.. సోనియా గాంధీతో చర్చించారు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్. అహ్మద్‌ పటేల్‌తో కలసి మేడమ్‌కి అన్ని విషయాలూ వివరించిన ఆయన.. భవిష్యత్ కార్యాచరణపై టి-నేతలతోనూ మాట్లాడారు. ఇవాళ ఎన్నికల షెడ్యూల్‌ రానున్నందున ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటించనున్నారు. అటు, రెండు రాష్ట్రాలకు రెండు పీసీసీల ఏర్పాటుపై ఇప్పటికే కసరత్తు కూడా పూర్తి చేశారు. కుల సమీకరణాల్ని కూడా లెక్కలోకి తీసుకుని కొత్త బాస్‌లను ప్రకటించబోతున్నారు. సీమాంధ్రలో కాపు సామాజిక వర్గానికి చెందిన వారికే పీఠం అప్పచెప్పడం ఖాయమైనా.. తెలంగాణ విషయంలో తర్జనభర్జన కొనసాగుతోంది. అక్కడ బీసీ మంత్రం జపిస్తున్న కాంగ్రెస్‌.. ఆ వర్గానికి చెందిన లీడర్‌కే పీసీసీ పదవి కట్టబెట్టొచ్చని తెలుస్తోంది. దీనిపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Advertisements
Video | This entry was posted in Hyderabad News and tagged , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s