- మ్యానిఫెస్టోలు కోడ్ పరిధిలోకే!
- అఫిడవిట్లో అభ్యర్థి, కుటుంబ సభ్యుల..
- విదేశీ అస్తులు, కేసులు వివరాలు
- ఇవ్వకుంటే చర్యలు తప్పవన్న ఈసీ
ఎన్నికల నియమావళి ఈసారి రాజకీయ పార్టీల గుండెల్లో దడపుట్టిస్తున్నాయి. గతంలో ఎన్నడు లేని విధంగా కొత్త, కొత్త నిబంధనలు అమలు కాబోతున్నాయి. పార్టీల మ్యానిఫెస్టోలు కూడా ఎలక్షన్ కోడ్ కిందికి వస్తున్నాయి.
ఎన్నికల ప్రశాంత నిర్వహణ కోసం ఎలక్షన్ కమిషన్ అమలు చేస్తున్న నిబంధనలు రాజకీయ పార్టీల, అభ్యర్థులు గుండెల్లో రైల్లు పరిగెత్తిస్తున్నాయి. గతంతో పోల్చితే, ఈ సారి నియమావళిని ఈసీ కఠనతరంచేసింది. గతంలో అభ్యర్థులు పూర్తి సమాచారాన్ని ఇవ్వకుండానే అఫడవిట్లు సమర్పించే వారు. ఇకపై ఒక్క కాలమ్ పూర్తి చేయకపోయిన చర్యలు తప్పవని ఎన్నికల కమిషన్ హెచ్చరించింది. అఫడవిట్లో అభ్యర్థి, కుటుంబసభ్యులకు సంబంధించి విదేశాల్లో ఉన్న ఆస్తులు, కేసులు వివరాలను సైతం సమర్పించాల్సిందేనని తేల్చి చెప్పింది. నామినేషన్ దాఖలు చేసిన మరుక్షణమే ప్రత్యేకంగా బ్యాంక్ అకౌంట్ ఒపెన్ చేయాలని ఆదేశించింది. ఖర్చు నగదు రూపంలో కాకుండా చెక్‌ల ద్వారా జరగాలని సూచించింది. అయితే వ్యయాన్ని ఎంపీ అభ్యర్ధికి 40 నుంచి 70 లక్షలకు, అసెంబ్లీ అభ్యర్థికి 16 నుంచి, 28 లక్షలకు పెంచింది…
మరోవైపు రాజకీయ పార్టీలు ప్రకటించే మ్యానిఫెస్టో లు కూడా ఎన్నికల కోడ్ కు కిందికి వస్తాయని స్పష్టం చేసింది ఎన్నికల సంఘం. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా హామీలు ఇవ్వాలని, ఉచిత హమీలు, బడ్జెట్ కు సంబంధంలేకుండా ప్రకటనలు చేయడం లాంటివి ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికే వస్తాయని ఎన్నికల ప్రధానాధికారి తెలిపారు. అటు తిరస్కరణ ఓటు ఇప్పటికే అమల్లో ఉన్నా.. సార్వత్రిక ఎన్నికలకు మాత్రం మొదటి సారిగా అమలు చేస్తున్నారు. ఎన్నికల ప్రశాంత నిర్వహణ కోసం ఈసీ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ప్రజలు, పార్టీలు ఏమేరక సహకరిస్తారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.