కిరణ్‌ కొత్త పార్టీకి అంతా సిద్ధం

  • సన్నిహితులతో ఇవాళ ఆఖరు మీటింగ్
  • సమైక్యాంధ్ర పేరుతోనే పార్టీ
  • సీమాంధ్ర టూర్‌కి సన్నాహాలు
  • పార్టీ ప్రకటించిన వెంటనే జనంలోకి..
  • విజయవాడ, తిరుపతి, రాజమండ్రిల్లో ఒక చోట సభ
  • సీమాంధ్ర పర్యటన రూట్‌మ్యాప్‌పై కసరత్తు

m1
ఎలక్షన్ షెడ్యూల్ వచ్చేసింది. పార్టీలన్నీ సమరానికి సై అంటున్నాయ్‌. అభ్యర్థుల ఎంపికపైనా జోరుగా కసరత్తులు చేస్తున్నాయ్‌. ఈ హంగామా సరే.. ఇంతకీ మాజీ సీఎం కిరణ్‌ ఏం చేయబోతున్నారు. ముందునుంచి ఊరిస్తున్నట్టుగా కొత్త పార్టీ పెడతారా? పార్టీ పేరేంటి? వీటన్నింటికి ఇవాళ సమాధానం దొరకబోతోంది. సాయంత్రం ఆరింటివరకూ ఆగితే.. వెయిటంగ్‌ న్యూస్‌ కాస్తా బ్రేకింగ్‌ న్యూస్‌ అవడం ఖాయంగా కనిపిస్తోంది.

లేటైనా లేటెస్ట్‌గా వస్తానంటున్నారు మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌. ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చేశాక ఇక పార్టీ ఏం ప్రకటిస్తారనుకున్న వాళ్లకు సరైన సమాధానం చెప్పబోతున్నారు. ఇప్పటికే మాదాపూర్‌లోని తన  ఆఫీస్‌ కేంద్రంగా సన్నిహితులతో కొత్త పార్టీపై చర్చలు కూడా పూర్తి చేశారు. ఇవాళ ఆ ఆరుగురు ఎంపీలతో మరోసారి సమావేశమయ్యాక.. మీడియా ముందుకు రానున్నారు. సమైక్యవాదం తన నినాదం కాదు విధానం అని మొదట్నంచి చెప్తూ వస్తున్న ఆయన.. కొత్త పార్టీ పేరులో అది స్పష్టమయ్యేలా డిజైన్ చేసినట్టు సమాచారం. ఐతే.. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున ఇప్పుడు పార్టీ పేరు ఈసీ వద్ద రిజిస్టర్ చేయడం.. దానికి గుర్తింపు రావడం సాధ్యమయ్యే పనికాదు. అందుకే ఇప్పటికే ఈసీ గుర్తింపు ఉన్న పార్టీ పేరుతో ఎన్నికలకు వెళ్లాలని కిరణ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగే అంశమూ పరిశీలనకు వచ్చినా దాన్ని పక్కకుపెట్టేశారు.

ఇవాళ ఎంపీలతో పాటు మరికొందరు మద్దతుదార్లతోనూ కిరణ్‌ చర్చలు జరపనున్నారు. తర్వాత పార్టీ పేరు ప్రకటిస్తారని అంటున్నారు. విభజనతో సీమాంధ్రకు జరిగిన అన్యాయాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ.. ఆ ప్రాంతానికి ఎలాంటి మేలు చేసే లక్ష్యంతో పార్టీ పెడుతున్నానో వివరిస్తూ భారీ బహిరంగసభ పెట్టాలన్న ఆలోచనలో కిరణ్ ఉన్నారు. విజయవాడ, తిరుపతి, రాజమండ్రిల్లో ఎక్కడ పబ్లిక్‌ మీటింగ్ పెట్టాలన్న దానిపై ఇంకా ఓ నిర్ణయానికి రాలేకపోయారు. మాజీ సీఎంకి బాసటగా నిలిచిన లీడర్లు… ఇప్పటికే సీమాంధ్ర టూర్ రూట్‌మ్యాప్‌ సిద్ధం చేసే పనిలో ఉన్నారు. అటు, ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చేయడంతో కాంగ్రెస్‌ నుంచి బయటపడదామనుకుంటున్న వాళ్లంతా ఇప్పుడు కిరణ్‌ వైపే ఆశగా చూస్తున్నారు. కొత్త పార్టీ విధివిధానాలు, ఎన్నికల నినాదం చూశాక అటువైపు జంపైపోవచ్చన ఆలోచనలో వీళ్లంతా ఉన్నారు. కొత్త పార్టీపై నేతల ఆలోచన ఇలా ఉంటే.. ఇది ఎవరి కొంప ముంచుతుందోనన్న చర్చా అప్పుడే మొదలైంది. 2009లో టీడీపీ విజయావకాశాల్ని పీఆర్‌పీ దెబ్బకొట్టినట్టు ఈసారి కిరణ్‌ పార్టీతో ఎవరికి ఎసరొస్తుందోనని అంతా మాట్లాడుకుంటున్నారు. అటు, పవన్ కల్యాణ్‌ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగి, 40 మంది మద్దతుదార్లను కూడా పోటీకి దించబోతున్నారన్న వార్తలూ కలకలం రేపుతున్నాయి. ఏదేమైనా, మొదట్నుంచి సమైక్యానికి కట్టుబడి పోరాటం చేసిన కిరణ్‌.. ఎన్నికల్లోనూ ప్రజల్ని మెప్పించగలరని లగడపాటి, సబ్బంహరి లాంటి వాళ్లు చెప్తున్నారు. ఇవాళ సాయంత్రం కొత్త పార్టీపై ప్రకటన ఖాయమని వారు ధీమాగా ఉన్నారు.

Advertisements
Video | This entry was posted in Andhra Pradesh News and tagged , , , , , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s