జోరు పెంచుతున్న చంద్రబాబు

 • జోరు పెంచుతున్న చంద్రబాబు
 • ఈ నె 8 నుంచి 28 వరకు జిల్లాల్లో బాబు పర్యటనలు
 • ఈ నెల 8న హైదరాబాద్‌లో మహిళా సదస్సు,
 • 12న విశాఖ, 15న ఖమ్మంలో ప్రజా గర్జన
 •  16న గుంటూరులో రైతు గర్జన
 • 17న కృష్ణాలో ప్రజాగర్జన, 18న అనంతపురంలో బీసీ గర్జన,
 • 19న కర్నూలులో ప్రజా గర్జన, 20న హైదరాబాద్‌లో యువగర్జన  
 • 21న శ్రీకాకుళంలో, 22న తూర్పుగోదావరి జిల్లాలో ప్రజా గర్జన
 •  23న వరంగల్‌లో  మెనార్టీ గర్జన సభ
 •  24న కరీంనగర్‌లో, 25న మహబూబ్‌నగర్‌లో, 27న కడపలో ప్రజా గర్జన
 •  28న ఆదిలాబాద్‌లో జరిగే గిరిజన గర్జన

m2
సార్వత్రిక ఎన్నికలకు రెట్టించిన ఉత్సాహంతో దూసుకెళ్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. నెల్లూరు ప్రజాగర్జనలో.. కాంగ్రెస్‌, వైసీపీలపై నిప్పులు చెరిగారు. అవినీతికి పరాకాష్టగా మారిన ఆ రెండు పార్టీలను భూస్థాపితం చేయాలని పిలుపిచ్చారు. తెలుగు జాతి అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశానికి పట్టం కట్టాలని కోరారు. పోలింగ్‌ లోపు రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలకు రూట్‌మ్యాప్ సిద్దం చేసుకున్నారు.

తెలుగుదేశం పార్టీ నెల్లూరు వీఆర్ కాలేజీ మైదానంలో నిర్వహించిన ప్రజాగర్జనకు భారీ స్పందన వచ్చింది. చంద్రబాబు సమక్షంలో సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్‌ రెడ్డి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే శ్రీధర కృష్ణారెడ్డి, కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలం శ్రీనివాసులు రెడ్డి తమ అనుచరులతో కలసి టీడీపీలో చేరారు. తెలుగుజాతి మధ్య కాంగ్రెస్‌ చిచ్చు పెట్టిందని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ అధినేత జగన్‌ పైనా విమర్శలు గుప్పించారు. టీడీపీని గెలిపించుకోవడం చారిత్రక అవసమన్నారు. తాను అధికారంలో వస్తే క్రైస్తవులను ఎస్సీల్లోకి, కాపులను బీసీల్లోకి చేర్చేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో ఈ నెల చివరి వరకు వివిధ ప్రాంతాల్లో ప్రజా గర్జన సభ నిర్వహించడానికి చంద్రబాబు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ నెల 8న హైదరాబాద్‌లో మహిళా సదస్సు, 12న విశాఖ, 15న ఖమ్మంలో ప్రజా గర్జన నిర్వహిస్తున్నారు. 16న గుంటూరులో రైతు గర్జనలో బాబు పాల్గొంటారు. 17న కృష్ణాలో ప్రజాగర్జన, 18న అనంతపురంలో బీసీ గర్జన, 19న కర్నూలులో ప్రజా గర్జన, 20న హైదరాబాద్‌లో యువగర్జన  సభలను టీడీపీ ఏర్పాటు చేసింది. 21న శ్రీకాకుళంలో, 22న తూర్పుగోదావరి జిల్లాలో ప్రజా గర్జన సభలో చంద్రబాబు పాల్గొంటారు. 23న వరంగల్‌లో టీడీపీ మెనార్టీ గర్జన సభ నిర్వహిస్తోంది. 24న కరీంనగర్‌లో, 25న మహబూబ్‌నగర్‌లో, 27న కడపలో ప్రజా గర్జన సభలుంటాయి. ఈ నెల 28న ఆదిలాబాద్‌లో జరిగే గిరిజన గర్జనల్లో చంద్రబాబు పాల్గొంటారు.

Advertisements
Video | This entry was posted in Andhra Pradesh News and tagged , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s