పోలవరం ముంపు ప్రాంతాల విలీనంలో ట్విస్ట్

  • పోలవరం ముంపు ప్రాంతాల విలీనంలో ట్విస్ట్  
  • ఏడు మండలాలను బదలాయించడంపై వివాదం
  • కేంద్ర అర్డినెన్స్ పై పలువర్గాల అభ్యంతరం
  • న్యాయసమ్మతం కాదంటూ రాష్ట్రపతికి లేఖలు
  • హోంశాఖ ఫైలును తిప్పిపంపిన రాష్ట్రపతి ప్రణబ్?

పోలవరం ముంపు ప్రాంతాలు సీమాంధ్రకు బదలాయింపులో కొత్త ట్విస్ట్. కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌కు ఇంకా రాష్ట్రపతి ఆమోదం లభించలేదు. అర్డినెన్స్ పై పలు వర్గాలు అభ్యంతరం చెప్పడంతో ఫైల్ ను ప్రణబ్ హోంశాఖకు తిప్పిపంపినట్లు సమాచారం. ఎన్నికలయ్యాకే దీనిపై స్పష్టత వచ్చే అవకాశమున్నట్లు ఢిల్లీ వర్గాల టాక్. దీంతో సీమాంధ్ర నేతలు కలవరపడుతున్నారు.

రాష్ట్ర విభజనలో అత్యంత కీలకంగా మారిన పోలవరం ముంపు ప్రాంతాల విలీనం మరోసారి వివాదాస్పదమవుతోంది. ఖమ్మం జిల్లా భద్రచాలం డివిజన్ లోని ఏడు మండలాలను సీమాంధ్రలో కలుపుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం అమలయ్యేలా కన్పించడం లేదు. దీనిపై కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ ను రాష్ట్రపతి తిప్పిపంపినట్లు సమాచారం. ముంపు ప్రాంతాలను  సీమాంధ్రలో కలపడంపై టీఆర్ఎస్ తో పాటు పలువర్గాల నుంచి అభ్యంతరాలు రావడంతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆర్డినెన్స్ ఫైలును హోంశాఖకు తిరిగి పంపించినట్లు తెలుస్తోంది.

పోలవరం ముంపు ప్రాంతాన్ని మాత్రమే సీమాంధ్రకు కేటాయించారు. అయితే ముంపు గ్రామాలను మాత్రమే కలిపితే నిర్వాసితులకు భూమికి బదులు భూమి ఇవ్వడం కష్ఠమవుతుందని ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు కేంద్రానికి విన్నవించారు. దీంతో నిర్వాసితుల పునరావాసంపై అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని రాజ్యసభలో కేంద్రం హామి ఇచ్చింది. దీనిపై సమీక్షించిన కేంద్రం ..ముంపు గ్రామాలున్న ఏడు మండలాలను పూర్తిగా సీమాంధ్రకిస్తే భూపంపిణి ఈజీగా ఉంటుందని భావించింది. విభజనతో గుర్రుగా ఉన్న సీమాంధ్రులను కొంత సంతృప్తి పరచవచ్చని ప్లాన్ చేసింది. దీంతో భద్రాచలం పట్టణాన్ని మినహాయించి మిగిలిన ఏడు మండలాలను సీమాంధ్రలో కలుపుతూ విభజన చట్టానికి ఈనెల 2న సవరణ తీసుకువచ్చింది.

కేంద్ర నిర్ణయంపై పలుసంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. విభజనపై  గెజిట్ వెలువడిన తర్వాత కేంద్రం సవరణ చేయడంపై టీఆర్ఎస్ మండిపడింది.ఆర్డినెన్స్ ను ఆమోదించవద్దంటూ కేసీఆర్ రాష్ట్రపతికి లేఖరాశారు. ఒకవేళ ఆమోదించినా దానిపై తాము న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. సీపీఎం జాతీయ కార్యదర్శి ప్రకాశ్ కారత్ సైతం కేంద్ర ఆర్డినెన్స్ న్యాయబద్దం కాదంటూ ప్రణబ్ కు లేఖరాశారు. కేంద్రం నిర్ణయం వల్ల తెలంగాణలో గోదావరి పరీవాహక ప్రాంతం తగ్గుతుందని మరికొన్ని వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. దీంతో ఆర్డినెన్స్ జారీపై రాష్ట్రపతి వెనక్కితగ్గినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం అమల్లోకి రాకముందే దానికి సవరణ చేస్తే న్యాయపరమైన చిక్కులు వస్తాయని ఆయన అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో ఆర్డినెన్స్ జారీపై రాష్ట్రపతి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని హోంశాఖవర్గాల సమాచారం.తాజా ట్విస్ట్ తో సీమాంధ్ర నేతలు కలవరపడుతున్నారు.

Advertisements
Video | This entry was posted in Andhra Pradesh News and tagged , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s