మావోల దాడిలో 20మంది జవాన్ల దుర్మరణం

చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మళ్లీ పంజా విసిరారు. సుకుమా-బస్తర్ సరిహద్దుల్లోని తోంగ్‌పాల్‌ వద్ద జవాన్ల వాహనాన్ని ల్యాండ్‌మైన్‌తో పేల్చేశారు. తర్వాత విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో 15మంది జవాన్లు, ఐదుగురు పోలీసులు చనిపోయారు.

గతేడాది కాంగ్రెస్ నేతలపై దాడి జరిగిన ప్రాంతంలోనే ఈ ఘటన కూడా జరిగింది. ఇవాళ్టి దాడిలో చనిపోయిన వారి మృతదేహాల్ని సుకుమాకు తీసుకొచ్చారు. అత్యవసర సాయం కోసం జగదల్‌పూర్‌, రాయ్‌పూర్ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్లను ఘటనా స్థలానికి పంపారు. ఈ దాడిలో 150 మంది వరకూ సాయుధులైన మావోయిస్టులు పాల్గొన్నట్టు తెలుస్తోంది. దర్బాఘాట్‌-తోంగ్‌పాల్‌ మధ్య మూడు వాహనాల్ని అడ్డంగా పెట్టి రోడ్ బ్లాక్ చేసి ఎటాక్‌కి దిగారు. ప్రస్తుతం జావాన్లకు-మావోయిస్టులకు మధ్య ఎన్‌కౌంటర్ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. మొత్తం 48 మంది జవాన్లు, పోలీసులు వాహనాల్లో జగదల్‌పూర్‌కి వెళ్తుండగా ఈ ఎటాక్ జరిగింది. ఈ ఘటనకు బీజేపీ ప్రభుత్వ అసమర్థతే కారణమని ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగీ మండిపడ్డారు.

Advertisements
Video | This entry was posted in National and tagged , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s