బీసీలకు పీసీసీ…సీనీయర్లతో ఎన్నికల కమిటీ

  • పదవుల పంపకంపై కాంగ్రెస్ వ్యూహాత్మకం
  • సామాజిక సమీకరణాలను తనదైన స్టైల్‌లో డీల్
  • తెలంగాణలో పొన్నాల, ఏపీలో రఘువీరా  
  • తెలంగాణాకు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు బోనస్‌
  • 50 శాతం ఓటు బ్యాంకున్న బీసీలపై కాంగ్రెస్ ఫోకస్
  • తెలంగాణలో దళితున్నే సీఎం చేస్తామని ప్రకటన
  • రెడ్డి వర్గాన్ని విస్మరించట్లేదన్న సంకేతాలు
  • హైకమాండ్‌కు పొన్నాల వీర విధేయుడు
  • బొత్స తప్పుకోవడంతో మారిపోయిన సీన్
  • సమైక్య ఉద్యమ సమయంలో బొత్సపై వ్యతిరేకత
  • ఆ ప్రభావం పార్టీపై పడకూడదనే తప్పుకున్న బొత్స

m1
వారం పాటు సాగిన కసరత్తును కాంగ్రెస్‌ అధినాయకత్వం ఓ కొలిక్కి తీసుకొచ్చింది. రెండు రాష్ట్రాలకు ప్రత్యేక పీసీసీలు ప్రకటించి రథ సారధుల పేర్లను వెల్లడించింది. సామాజిక సమీకరణాలు, అనుకూల పవనాలు, గెలుపు గుర్రాలు, సమర్థతను పరిగణలోకి తీసుకుంటూ.. కీలక నిర్ణయాలు వెలువరించింది హైకమాండ్. రెండు ప్రాంతాల్లోనూ.. ప్రతిపక్షాల బలాబలాలను బేరీజు వేసుకుంటూ సమతూకం పాటించింది హైకమాండ్.

అసలే కీలకమైన సార్వత్రిక ఎన్నికలు. అందునా.. రాష్ట్ర విభజన జరిగిన సందర్భం. ఒక ప్రాంతంలో పార్టీ జోష్, మరో ప్రాంతంలో కాస్త నైరాశ్యం.. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ… వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. రెండు రాష్ట్రాలకు రెండు పీసీసీలను ఏర్పాటు చేయడమే కాకుండా.. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. రథ సారథులను ప్రకటించేసింది. అన్ని రకాల కమిటీలకు ఇతర కీలక నేతలను ఎంపిక చేసి సామాజిక సమీకరణాలను తనదైన స్టైల్లో సెట్ చేసింది. తెలంగాణ పీసీసీ ఛీఫ్‌గా పొన్నాల లక్ష్మయ్యకు, ఏపీ బాధ్యతలు రఘువీరాకు అప్పగించింది. వీటికి తోడు తెలంగాణలో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టును అదనంగా సృష్టించి ఆ పదవిని ఉత్తమ్ కుమార్ రెడ్డికి కట్టబెట్టింది హైకమాండ్.

వైసీపీ వైపు రెడ్డి, దళిత వర్గాలు, టీడీపీ వైపు కమ్మ, కాపు వర్గాలు వెళ్తున్నాయని భావిస్తున్న కాంగ్రెస్.. రెండు ప్రాంతాల్లో 50 శాతం ఓటు బ్యాంకు ఉన్న బీసీలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. గతంలో కంటే భిన్నంగా ఈ దఫా ఎంపిక చేసిన పదవుల్లో సీనియర్లను పక్కన పెట్టడం.. చర్చనీయాంశమైంది. తెలంగాణలో దళితున్ని సీఎం చేస్తామని ఇదివరకే ప్రకటించిన కాంగ్రెస్… ఉత్తమ్‌ కుమార్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం ద్వారా.. రెడ్డి వర్గాన్ని విస్మరించట్లేదన్న సంకేతాలు పంపింది. తర్వాతి తరాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. వర్కింగ్ ప్రెసిడెంట్ విషయంలో ఉత్తమ్ లాబీయింగ్ పని చేసింది. తనకున్న పరిచయాలతో… కీలక పదవి దక్కించుకున్నారు.

ఇక టీ.పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన పొన్నాల మున్నూరు కాపు వర్గానికి చెందిన నాయకుడు. అమెరికా నుంచి వచ్చాక.. కాంగ్రెస్ పట్ల వీర విధేయత చూపుతూ తన అభిమానాన్ని పలు సందర్భాల్లో చాటుకున్నారు. తెలంగాణ ఉద్యమం హైవోల్టేజ్‌లో ఉన్నప్పుడు.. ఉద్యమకారుల నుంచి తీవ్ర నిరసనలు ఎదుర్కొన్నారు. అన్నిటినీ సమర్థంగా దాటుకుని వచ్చి తెలంగాణ వాదంపై హైకమాండ్‌కు నొప్పింపక తానొవ్వక అన్నట్లు డిమాండ్లు వినిపించారు.

సీమాంధ్రలో మాత్రం పదవుల విషయంలో కాపులకు తక్కువ ప్రాధాన్యం లభించినట్లైంది. పీసీసీ బాధ్యతలు  తనకు వద్దని బొత్స స్వయంగా సోనియాను కోరడంతో సీన్ మారిపోయింది. సమైక్య ఉద్యమాలు జరుగుతున్న సమయంలో… బొత్సపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. విజయనగరంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఏకంగా కర్ఫ్యూ విధించేంత వరకూ పరిస్థితులు వెళ్లాయి. ఇప్పుడు పీసీసీ ఛీఫ్ పదవిలో ఉంటే ఆ ప్రభావం పార్టీపై పడుతుందని చెప్పుకొచ్చినట్లు తెలిసింది. ఇక తన కుటుంబం నుంచి ఎందరో ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. అధ్యక్ష హోదాలో టిక్కెట్ల కేటాయింపుల్లోనూ గందరగోళం ఎందుకన్న లాజిక్ వినిపించినట్లు చెబుతున్నారు. అందుకే చివరి నిమిషంలో రఘువీరా పేరును కాంగ్రెస్ ప్రకటించింది. ఎన్నికల సమయంలో తనకు క్లిష్టమైన బాధ్యత అప్పగించారని అందరి సహకారంతో పార్టీని ముందుకు తీసుకెళ్తానని ధీమా వ్యక్తం చేశారు రఘువీరా.

మొత్తానికి రాష్ట్ర విభజన తర్వాత సీమాంధ్రలో డీలా పడ్డ కాంగ్రెస్‌కు జవసత్వాలు నింపేందుకు అధిష్టానం బ్రహ్మాస్త్రాన్నే సంధించింది. ఇరు ప్రాంతాల్లో బీసీలకే పార్టీ పదవులు కట్టబెట్టి రాజకీయంగా ముందడుగు సాధించింది. వరుస ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మైండ్‌ గేం మొదలెట్టిన ఢిల్లీ పెద్దలు భవిష్యత్‌లో ఎలాంటి చాణక్యం చూపిస్తారోనన్న ఉత్కంఠ ప్రత్యర్థి పార్టీల్లో నెలకొంది.

Advertisements
Video | This entry was posted in Andhra Pradesh News and tagged , , , , , , , , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s