పవన్‌ పంజాకు బలైయ్యేది ఎవరు

రాజకీయాల్లోకి పవన్ రాక ఖాయమైపోయింది.  పవర్‌ కోసం కాదు ప్రశ్నించేందుకేనంటూ ఓ కొత్త వరవడితో ప్రజల మధ్యకు  వెళ్తేందుకు సిద్ధమవుతున్నారు.అసలు పవన్ ఉద్దేశమేంటి ? లక్ష్యమేంటి?. పవన్ పంజా విసిరితే అది ఏ పార్టీని దెబ్బతీస్తుంది?.

ఎన్నికలకు ఏళ్ల ముందు పార్టీలు పెట్టి… నానాతంటాలు పడడం ఓల్డ్ ఫ్యాషన్‌.  ఇప్పుడు కాలం మారింది. ఎన్నికలనాటికి స్టేట్‌మొత్తం  కనీసం రెండు చక్కర్లు కొట్టేందుకు సమయం లేకున్నా సరే.  పార్టీలు పెట్టేస్తున్నారు.  హీరో పవన్‌ కల్యాణ్‌ పెడుతున్న పార్టీ కూడా  అలాంటిదే… మరీ ఈ పార్టీ ఎవరిపై ప్రభావం చూపుతుంది..? ఎవరి ఓట్లను చీలుస్తుంది..?

Click Here For Video 
పవన్‌ పార్టీ వల్ల సీమాంధ్రలో జగన్‌కు నష్టమని కొందరంటుంటే..  కాదుకాదు టీడీపీకే దెబ్బన్నది మరికొందరి అభిప్రాయం. కాపు  సామాజిక వర్గానికి చెందిన చిరు పార్టీ పెట్టినప్పుడు మేజారిటీ కాపులు పీఆర్పీకి మద్దతుపలికారు.  అయితే చిరు పార్టీని  కాంగ్రెస్  విలీనం చేయడం,  రాష్ట్రాన్ని ముక్కలు చేయడం వంటి పరిణామాలతో కాపు సామాజిక వర్గం టీడీపీ వైపు మొగ్గుచూపడం  మొదలైంది. ఇటీవల కోస్తాకు చెందిన చాలా  మంది కాపు నేతలు కాంగ్రెస్‌ను వీడి టీడీపీలోకి క్యూ కట్టడం అందుకు నిదర్శనం.   ఇప్పుడు పవన్ పార్టీ పెట్టడం వల్ల టీడీపీ వైపు మొగ్గు చూపుతున్న కాపు సామాజికవర్గం పునరాలోచనలో పడితే టీడీపీ కొంతమేర  డ్యామేజ్‌ తప్పదన్నది ఓ వాదన.

కాపు ఓటర్లు పవన్ వైపు మళ్లితే రాయలసీమలోనూ టీడీపీకి నష్టం తప్పకపోవచ్చు. ఎందుకంటే కాపు ఉపకులమైన బలిజ కులస్తులు  రాయలసీమలో చాలా మందే ఉన్నారు. మొదటి నుంచి కూడా వీరు టీడీపీకి అండగా నిలుస్తూ వస్తున్నారు. అయితే కాపు నేతలు  మాత్రం  చిరు సత్తా చూశాం… ఇప్పుడు పవన్‌ పంజా కోసం మరోసారి తమ జీవితాలను పణంగా పెట్టలేమని చెబుతుండడం విశేషం.  అవినీతికి వ్యతిరేకంగా ఓటు వేయాలనుకుంటున్న వారిలోనూ ఎక్కువమంది టీడీపీ వైపు మొగ్గుచూపుతున్నారని ఓ అంచనా.  ఈ  సమయంలో పవన్ పార్టీ పెట్టడం వల్ల ఇలాంటి ఓటర్లు అంతోఇంతో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ, వైసీపీలను కాదని  పవన్‌ వైపు మళ్లుతారేమోనన్న అభిప్రాయం ఉంది. ఇదే జరిగితే అవినీతి వ్యతిరేక ఓట్లు చీలి మధ్యలో జగన్ లాభపడుతారేమోనని  కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ వాళ్లు మాత్రం పవన్‌ పార్టీ తమనేమి చేయలేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

పవన్‌ పార్టీ వల్ల సీమాంధ్రలో  టీడీపీ కన్నా జగన్ పార్టీకే భారీ నష్టం ఉంటుందని అంచనా వేస్తున్న వారి వాదన మరోలా ఉంది.   ప్రస్తుతం జగన్ ఫాలోయింగ్‌లో యూత్ అధికంగా ఉంది.  దూకుడు తనం, పోరాడేతత్వం చూసి జగన్‌కు అభిమానులుగా మారిన  యూతే ఎక్కువ. ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం. రాజకీయాలను మార్చేద్దామంటూ ఇప్పుడు పవన్‌ కూడా అంతే అగ్రెసివ్‌గా దూసుకొస్తే  యువత అటువైపు  ఆకర్శితమయ్యే అవకాశం ఉందని కొందరు విశ్లేషకుల అభిప్రాయం. టీడీపీ ఓటు బ్యాంకులో సిర్థత్వం  ఉందని… కాబట్టి ఆ పార్టీకి పవన్ వల్ల పెద్దగా ఇబ్బంది ఉండదని విశ్లేషిస్తున్నారు.

Advertisements
Video | This entry was posted in Uncategorized. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s