తెలంగాణపై ఫోకస్‌.. పొత్తులే టార్గెట్‌

– వలసలు, పొత్తులు, అసంతృప్తులు, ఇబ్బందులు
– తెలంగాణపైనే ప్రధానంగా దిగ్విజయ్‌ ఫోకస్
– ఇవాళ, రేపు తెలంగాణ ముఖ్య నేతలతో మంతనాలు
– విభజన నిర్ణయంతో తొలిమెట్టుకు చేరిన కాంగ్రెస్
– కిరణ్‌ను ఎదుర్కొనే వ్యూహాలపైనా మంతనాలు.

t11

విభజన తర్వాత దిగ్విజయ్ తొలిసారిగా ఇవాళ రాష్ట్రానికి వస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జ్‌ను ఓ రేంజ్‌లో ఎదుర్కొనేందుకు ఎవరూ సిద్ధంగా లేకపోవడమే అసలు ట్విస్ట్. తెలంగాణలో అంతా బాగానే ఉందనుకుంటే.. తాజా కమిటీల ప్రకటనతో.. అసంతృప్తి రాజుకుంది. ఇక సీమాంధ్రలో మళ్లీ మొదటి నుంచి లెక్కెట్టుకునే పరిస్థితి. దీంతో సమస్యలు అంతకు మించిన సవాళ్లతో రాష్ట్ర కాంగ్రెస్ స్వాగతం పలుకుతోంది. మూడు రోజుల పర్యటన కోసం హైదరాబాద్‌ వస్తున్న దిగ్విజయ్‌కు రాష్ట్ర కాంగ్రెస్… సమస్యల స్వాగతం పలుకుతోంది.

నేతల వలసలు, టీఆర్‌ఎస్‌తో కొలిక్కి రాని పొత్తులు, తాజా కమిటీలతో అసంతృప్తులు…, రెండు ప్రాంతాల్లో పార్టీకి ఇబ్బందులు…, చాలా నియోజకవర్గాల్లో పార్టీకి అభ్యర్థులు లేని పరిస్థితుల్లో… దిగ్విజయ్ స్పెషల్ తంత్రం వేసేందుకు సిద్ధమయ్యారు. ఈనెల 15వరకూ ఇక్కడే మకాం వేసి పార్టీని గాడిలో పెట్టే ప్రణాళికలతో వస్తున్నారు. ఈ టూర్‌లో దిగ్విజయ్‌ ప్రధానంగా.. తెలంగాణపైనే ఫోకస్ పెట్టనున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ఆశ పెట్టుకుందంటే అది తెలంగాణలోనే. అందుకే ఇక్కడి లెక్కలు తేల్చి.. పార్టీని పరుగులు పెట్టించాలనుకుంటున్నారు. ఇవాళ, రేపు తెలంగాణ ముఖ్య నేతలతో దిగ్విజయ్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. తెలంగాణాలో పొత్తులు, ఎన్నికల ప్రచారం, అభ్యర్థుల ఎంపికపై దిగ్విజయ్ దృష్టి సారిస్తారు. జాబితాను దాదాపుగా ఫైనలైజ్ చేయబోతున్నారు. సిట్టింగ్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలకు బెర్తులు దాదాపు ఖరారు చేస్తారని ప్రచారం జరుగుతోంది.

ఈనెల 15న సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులతో దిగ్విజయ్ సమావేశమవుతారు. అక్కడ కాంగ్రెస్‌ను గట్టెక్కించే వ్యూహాలపై మధించనున్నారు. నిజానికి విభజనతో సీమాంధ్రలో కాంగ్రెస్ పరిస్థితి.మొదటి మెట్టుకు చేరింది. ఎన్నికల సమయం వరకూ కనీసం సగం మెట్లైనా ఎక్కించాలనుకుంటున్నారు. ఇక పార్టీ పెట్టబోనని చెప్పి మాట తప్పిన కిరణ్‌ను ఎలా ఎదుర్కోవాలన్న అంశంపైనా కసరత్తు చేయనున్నారు. సీమాంధ్రకు ప్యాకేజీ ఇచ్చింది కాంగ్రెస్సేనన్న విషయాన్ని జనంలోకి తీసుకెళ్లాలని దిశా నిర్దేశం చేయనున్నారు. సోనియా, రాహుల్‌తో త్వరలోనే బహిరంగ సభలకు ప్లాన్ చేయడంతో పాటే.. ఎన్నికల హామీల రూపంలో సీమాంధ్రకు మరిన్న వరాలు కురిపిస్తామని… అందరూ కాంగ్రెస్‌నే బలపరిచే దిశగా నిర్ణయాలుంటాయని చెబుతున్నారు.

Advertisements
Video | This entry was posted in Hyderabad News and tagged , , , , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s