“నవరత్నాలు” పేరుతో TDP మునిసిపల్‌ మేనిఫెస్టో

అత్యధిక మునిసిపాలిటీల్లో  సైకిల్‌ను పరిగెట్టించి సార్వత్రిక ఎన్నికల్లో లాభపడాలని టీడీపీ చూస్తోంది. అందులో భాగంగా రూపొందించిన మునిసిపల్‌ మేనిఫెస్టోలో సంక్షేమ, అభివృద్ధి మంత్రాలను వల్లించారు చంద్రబాబు. టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమన్న భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.

వరుస ఎన్నికల వేళ తెలుగుదేశం సంక్షేమ పథకలపై ఫోకస్‌ చేస్తోంది. మునిసిపోల్స్‌లో పట్టణ ఓటర్లను ఆకర్షించేలా మేనిఫెస్టోను రూపొందించింది. మునిసిపాలిటీలను టీడీపీయే ఆదర్శవంతంగా తీర్చిదిద్దగలదన్న సంకేతాలిస్తోంది. కాంగ్రెస్‌ అన్ని పురపాలక సంఘాల్ని మురికికూపాలుగా మార్చేసిందని టీడీపీ చీఫ్‌ చంద్రబాబు ఆరోపించారు. నగర పాలనకు నవరత్నాల పేరుతో ఆయన మునిసిపల్‌ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు.

పట్టణాల్లో పచ్చదనం, పరిశుభ్రం, సౌర విద్యుత్తు, ఆధునిక రహదార్ల నిర్మాణంపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. మేనిఫెస్టోలో వాటికే పెద్ద పీఠ వేశారు. యువతకు ఉపాధి కల్పన, అత్యాధునిక శిక్షణ, పెద్ద నగరాలలో రవాణా వ్యవస్థ మెరుగు పరిచేందుకు సమగ్ర ప్రణాళిక ప్రకటించారు. మున్సిపాల్టీలలో ప్రజలకు రెండు రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్ పంపిణి మొదలైన సౌకర్యాలను ఏర్పాటు చేయదలచినట్టు చంద్రబాబు వెల్లడించారు.

అత్యాధునిక డ్రైనేజీలు, మహా నగరాలలో మెట్రో, ఎమ్ఎమ్‌టీఎస్ రైళ్ళ ఏర్పాటుకు హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికీ ఒక ఉద్యోగం ఖచ్చితంగా ఉండేలా అన్ని చర్యలూ తీసుకుంటామని చంద్రబాబు చెప్పారు. ఉన్నచోటే అత్యాధునిక శిక్షణా సౌకర్యాలు కల్పించి అందరికీ ఉద్యోగ అవకాశాలను మెరుగుపరుస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. త్వరలోనే రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడటం ఖాయమన్న ఆయన పట్టణాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రకటించారు.

సార్వత్రిక ఎన్నికల్లో ఉచిత వాగ్దానాల్ని భారీగా ఇచ్చిన చంద్రబాబు పురపాలక సంఘాలకొచ్చేసరికి మేనిఫెస్టోలో సమగ్ర మార్పులు చేశారు. అభివృద్ధి ఎలా చేస్తామో వివరించే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్‌ వైఫల్యాలను ప్రజలకు వివరించి మునిసిపాలిటీల్లో పసుపు జెండాను రెపరెపలాడించేలా తమ్ముళ్ళను ఉత్తేజపరిచారు.

Advertisements
Video | This entry was posted in Andhra Pradesh News, Hyderabad News and tagged , , , , , , , , , , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s