పరిషత్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఇవాళ్టి నుంచి ప్రారంభం

  • 1,096 జడ్పీటీసీలు
  • 16 వేల 589 ఎంపీటీసీలు
  • బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు
  • ఎంపీటీసీ డిపాజిట్‌:
  • ఎస్సీ, ఎస్టీ, బీసీలకు  రూ.1250
  • ఇతరులకు రూ.2500
  • జడ్పీటీసీ డిపాజిట్:
  • ఎస్సీ, ఎస్టీ, బీసీకు రూ.2500
  • ఇతరులకు రూ.5000
  • 17 – 20 నామినేషన్లు
  • 21న నామినేషన్ల పరిశీలన
  • 24న ఉపసంహరణ, తుది జాబితా
  • ఏప్రిల్ 6, 8 తేదీల్లో పోలింగ్‌
  • కౌంటింగ్‌ తేదీలపై తర్జనభర్జన
  • కౌటింగ్‌ తేదీపై అస్పష్టత?

పరిషత్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. అభ్యర్థుల ఎంపికను పార్టీలు దాదాపు పూర్తి చేశాయి. నామినేషన్లు వేయడానికి క్షేత్రస్థాయి నాయకులు సిద్దమయ్యారు. నామినేషన్ల స్వీకరణకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది.

గ్రామాల్లో స్థానిక సంస్థల సమరానికి తెరలేచింది. జిల్లాల్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. ఎంపీటీసీ నామినేషన్లను మండలాల్లోని MDO కార్యాలయాల్లో, జడ్పీటీసీ స్థానాలకు జడ్పీ ఆఫీస్‌లో స్వీకరిస్తారు. రాష్ట్రంలో 1096 జడ్పీటీసీ, 16  వేల 589 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇవాళ్టి నుంచి ఈనెల 20 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 24న తుది జాబితా ప్రకటిస్తారు.
రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. ఏప్రిల్‌ ఆరున JEE మెయిన్‌ పరీక్ష ఉండటంతో ఆ పరీక్షా కేంద్రాలున్న వరంగల్‌, తిరుపతి, విశాఖ, విజయవాడలతో పాటు ఆయా జిల్లాల్లో ఎన్నికల్ని 8న నిర్వహిస్తారు. ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేసే ఎస్సీ, ఎస్టీ, బీసీలు  12 వందల 50, ఇతరులు 2 వేల 5వందలు డిపాజిట్‌ చెల్లించాలి. జడ్పీటీసీ స్థానాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీలు  రెండున్నర వేలు, ఇతరులైతే 5 వేలు డిపాజిట్‌ కట్టాలి.

ఎన్నికలన్ని ఒకే సారి రావడంతో ఈవీఎంలు సరిపడా లేనందున చాలాకాలం తర్వాత బ్యాలెట్‌ పద్ధతిలో ఎన్నికలు జరగనున్నాయి. పరిశీలకులుగా ఒక్కో జిల్లాకు ఇద్దరేసి ఐఏఎస్‌ అధికారులను నియమించారు. ప్రచారం, కోడ్‌ అమలు, వ్యయం, ఏర్పాట్లను వాళ్లు పర్యవేక్షిస్తారు.

ఎన్నికల కౌటింగ్‌ తేదీపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. సాధారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఓట్లు లెక్కిస్తారు. పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 11న ముగుస్తున్న నేపథ్యంలో ఆ తర్వా కౌటింగ్‌ జరపాలని విద్యాశాఖ సూచన. 8వ తేదీన జరిగే పదో తరగతి పరీక్షను ఇప్పటికే వాయిదా వేశారు. మొత్తమ్మీద 13న కౌటింగ్‌ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రకటన రానుంది. అభ్యర్థులు మాత్రం తమ బలాబలాలు, ప్రత్యర్థుల వ్యూహాల్ని లెక్కిస్తూ ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమైపోయారు.

Advertisements
Video | This entry was posted in Andhra Pradesh News and tagged , , , , , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s