ఎన్నికల ప్రచారం లో వైయస్ కుటుంబానికి ఘన స్వాగతం

రాజన్న రాజ్యం కోసం వైఎస్‌ఆర్‌ కుటుంబం ప్రచారంలోకి దిగింది. నెల్లూరులో షర్మిల, అనంతలో విజయమ్మ,  గోదావరి జిల్లాల్లో జగన్‌ పర్యటించారు. ఈ ముగ్గురికీ అడుగడుగునా… ఘనస్వాగతం పలికారు జనం.

jasan1

ఫ్యాన్‌గాలి సుడిగాలిలా తిరిగింది. సీమాంధ్ర జిల్లాల్లో వైసీపీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌ స్వర్ణయుగాన్ని స్థాపించడం కోసం వైఎస్‌ కుటుంబం కదిలింది. జనం కోసం కదిలిన జగన్‌, షర్మిల, విజయమ్మలకు ప్రజలు కూడా ఘన స్వాగతం పలికారు. సీమాంధ్రలో ప్రధాన ప్రత్యర్ధిగా ఉన్న టీడీపీని టార్గెట్‌ చేస్తూ ఈ ముగ్గురి ప్రచారం, పర్యటన సాగింది.

చంద్రబాబులా అబద్ధాలు చెప్పడం చేతకాదంటూ మొదలుపెట్టిన జగన్‌… ఏనాడూ ప్రజల వద్దకు వెళ్లి కష్టాలు పట్టించుకోని నేత చంద్రబాబేనని విమర్శించారు. రామరాజ్యం చూడలేదు కానీ, వైఎస్ఆర్ స్వర్ణయుగాన్ని చూశామని గర్వంగా చెప్పవచ్చని అన్నారు. వైఎస్ మరణించి ఇన్నేళ్లయినా ప్రజల గుండెల్లో బతికే ఉన్నారని చెప్పారు. గోదావరి జిల్లాల్లో జగన్‌ రోడ్‌షోకు ప్రజలు బ్రహ్మరధం పట్టారు.

అటు వైఎస్‌ విజయమ్మ జనపథం ఎన్నికల ప్రచార యాత్ర కూడా విజయవంతంగా కొనసాగుతోంది. అనంతపురం జిల్లా కదిరి, పుట్టపర్తి, హిందూపురంలలో విజయమ్మ రోడ్ షో జరిగింది. కదిరి వేదికగా చంద్రబాబు పాలనను ఎండగట్టారు విజయమ్మ. తొమిదేళ్లలో చంద్రబాబు చేసిన మంచిపని ఒకటి చెప్పాలని సవాల్ విసిరారు. కిరణ్ తన ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని సవాల్ చేశారు.

ఇక జనపథంలో భాగంగా  నెల్లూరు జిల్లా ఆత్మకూరు చేరుకున్న షర్మిల ప్రచారభేరి మోగించారు. ఎన్నికల రోడ్ షోలో ప్రసంగించిన షర్మిల చంద్రబాబుపై మండిపడ్డారు. బాబు గారు ఒక సైకో.. ఆయన్ను మించిన సైకో ఇంకెక్కడా లేరని దుయ్యబట్టారు. ఎనిమిదేళ్లలో 8సార్లు కరెంట్ ఛార్జీలు పెంచిన వ్యక్తి బాబునేనని షర్మిల విమర్శించారు. వైఎస్ఆర్ మరణం తర్వాత రాష్ట్రం అస్తవ్యస్తమైందన్న సంగతిని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. కిరణ్ తన హయాంలో రైతులను పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిస్థితులకు బాబు-కిరణ్ లే కారణమన్నారు.

షర్మిల యాత్ర ఈనెల 20వరకు నెల్లూరు జిల్లాలోనే సాగనుంది. మరోవైపు విజయమ్మ  ఇవాళ మడకశిర, ధర్మవరం, అనంతపురంలో  రోడ్డు షోలలో పాల్గొంటారు.

Advertisements
Video | This entry was posted in Andhra Pradesh News and tagged , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s