కొలిక్కివస్తున్న టీడీపీ-బీజేపీ పొత్తు

  • బీజేపీలో పొత్తుల పంచాయితీ
  • టీడీపీతో కలిసివెళ్లాలంటున్న సీనియర్లు
  • ఒంటరిపోరే మేలంటున్న మరికొందరు
  • అభ్యర్థుల ఎంపికపై మల్లగుల్లాలు..
  • 20 తర్వాతే స్పష్టత వచ్చే ఛాన్స్
  • సీమాంధ్రలో పొత్తువద్దంటున్న తమ్ముళ్లు
  • తెలంగాణలో కమలంతో దోస్తీకి సై..
  • తమసీట్లకు ఎసరొస్తుందని అనుమానం
  • సూత్రప్రాయంగా పొత్తుకు మోడీ- బాబు ఓకే?
  • అంతర్గత సమావేశాల్లో బాబు సంకేతాలు
  • మానసికంగా పొత్తుకు ఇరుపార్టీల సన్నద్ధత
  • వారంలో ఫైనల్ చేస్తామంటున్న జవదేకర్
  • పవన్ జనసేనకు కూడా కొన్ని సీట్లు?

టీడీపీ-బీజేపీ పొత్తు ప్రకటనకు లేటెందుకు.. ఇద్దరి మధ్య అవగాహన కుదరలేదా.. ఎవరికివారు ఎత్తుకు పైఎత్తు వేస్తూ మైండ్ గేమ్ ఆడుతున్నారా.. ఎక్కువ సీట్లు పొందేందుకు ప్లాన్ చేస్తున్నారా..

రాష్ట్రంలో ఎన్నికల పొత్తులు, అభ్యర్థుల ఎంపికపై బీజేపీలో ప్రతిష్టంభన ఏర్పడింది. ఆ పార్టీ ఎన్నికల కమిటీ  అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే పలుమార్లు సమావేశమైనా తుది నిర్ణయం తీసుకోలేకపోయింది. పొత్తులపై కూడా పార్టీలో భిన్నాభిప్రాయాలు  వ్యక్తమవుతున్నాయి. టీడీపీతో పొత్తు మంచిదని సీమాంధ్ర నేతలు అంటుండగా, తెలంగాణ నేతలు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకొనేందుకు చివరివరకు ప్రయత్నించిన చంద్రబాబుతో పొత్తు పెట్టుకొని ఈ  ప్రాతంలో ఎలా తిరగగలమని ప్రశ్నిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో కార్యకర్తలకు ఇష్టం లేకుండా పొత్తు పెట్టుకున్నా ప్రయోజనం ఉండదని పేర్కొంటున్నారు. అయితే, టీడీపీతో పొత్తుకు జాతీయ  నాయకత్వం సానుకూలంగా ఉండడంతో వ్యతిరేకించినా ప్రయోజనం ఉండదని సీనియర్లు వాదిస్తున్నారు.

అటు పొత్తుల అంశం తేలకుండా అభ్యర్థులను  ఎంపిక చేయటం కూడా కష్టంగా మారింది. తెలంగాణలో బీజేపీతో పొత్తుకు ఉత్సాహం చూపిస్తున్న టీడీపీ.. కమలం నేతలను  దారికి తెచ్చేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో పొత్తుకు సై అంటేనే సీమాంధ్రలో కలిసి ఎన్నికలకు వెళ్లేందుకు  ముందుకొస్తామని, లేదంటే ఎలాంటి పొత్తూ ఉండదని టీడీపీ షరతు పెడుతున్నట్లు తెలుస్తోంది.  ఐతే.. 20వ తేదీ తర్వాతే వీటిపై స్పష్టత వస్తుందని ఇరుపక్షాల నేతలు తెలిపారు. పొత్తులపై త్వరలోనే ఒక నిర్ణయానికి వస్తామని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ ఇప్పటికే ప్రకటించారు. పార్టీ ఎన్నికల కమిటీ సమావేశంలో  పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఆయన, పార్టీ తెలంగాణ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు హరిబాబుతో వేర్వేరుగా  చర్చలు జరిపారు. అలాగే టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ తో కూడా రహస్య చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో పొత్తులపై వారంలోగా నిర్ణయం తీసుకుంటామని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా ఎన్నో పార్టీలు తమతో పొత్తు పెట్టుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయన్నారు.అటు దేశ, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పొత్తులపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని, తనను ప్రజలు అర్థం చేసుకోవాలని టీడీపీ చీఫ్ చంద్రబాబు అన్నారు.

తమతో జనసేనను కూడా కలుపుకుపోవాలని ఇరు పార్టీలు యోచిస్తున్నాయి. ఈక్రమంలో పవన్ పార్టీకి కూడా కొన్ని సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తం మీద మరో వారంలోనే రాష్ట్రంలో బీజేపీ- టీడీపీ దోస్తీని అధికారికంగా ప్రకటించేందుకు రంగం సిద్దం అవుతోందని ఉభయ పార్టీల నేతలు అంగీకరిస్తున్నారు.

Advertisements
Image | This entry was posted in Andhra Pradesh News and tagged , , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s