విప్లవాత్మక భావాలకు వేదికగా ఇజం

  • విప్లవాత్మక భావాలకు వేదికగా ఇజం
  • మొత్తం 12 అధ్యాయాలుగా ఇజం
  • కూడు, గూడ, గుడ్డ అందివ్వడమే లక్ష్యం
  • స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాలకే పెద్దపీట
  • పార్టీ ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవాలు

విడుదలకు ముందే పవన్ పుస్తకం ఇజం సరికొత్త భావాలతో సంచలనాలను రేకెత్తిస్తోంది. పుస్తకంలో వెలుగుచూసిన అంశాల ప్రకారం.. రాజకీయ ప్రయోజనాల కోసంగా  సాగే ఉత్సవాలు,  ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధానాలకు పవన్ పూర్తిగా స్వస్తి పలకబోతున్నారు. సమాజంలో ఉన్న  ప్రజలందరికీ కూడు, గూడ, గుడ్డ అందించాలనే లక్ష్యంతో సాంప్రదాయ పార్టీలకు భిన్నంగా వెళ్లాలని పవన్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

నేటి తరానికి కొత్త రాజకీయాలను పరిచయం చేయడమే లక్ష్యంగా పవన్ సాగుతున్నారు. దేశం కోసం చచ్చిపోయే  మొదటి పిచ్చివాడిని నేనే అంటూ ప్రకటించిన పవన్.. తనలాగే యువతరాన్ని కూడా దేశశ్రేయస్సు, సార్వభౌమత్వం,  సమగ్రతకోసం పాటుపడేలా కార్యోన్ముఖుల్ని చేసేందుకు సిద్ధమౌతున్నారు.  జనసేన ఆవిర్భావ సభలో ఉద్వేగపూరితంగా  ప్రసంగించిన పవర్ స్టార్… కొన్ని అంశాలపై క్లారిటీ ఇవ్వలేకపోవడంతో.. తన ఆలోచనలు, భావాలను  పుస్తక రూపంలో జనం  ముందుకు తీసుకు రాబోతున్నారు.

తన సహచరుడు రాజు రవితేజతో కలిసి ఇజం పుస్తకాన్ని రచించిన పవన్  కళ్యాణ్.. అందులో తన విప్లవాత్మక  భావాలను కుండబద్ధలు కొట్టినట్లుగా ప్రకటించారు. సుమారు ఆరు సంవత్సరాలుగా.. పవన్‌ కళ్యాణ్‌, రాజు రవితేజల మధ్య  సాగిన సామాజిక, రాజకీయ చర్చలు  ఈ  పుస్తకంలో ప్రతిబింబించనున్నాయి. మొత్తం 12 అధ్యాయాలుగా విభజించబడిని  ఇజం పుస్తకం ఉద్దేశ్యం..సమాజంలో అందరికీ కూడు, గూడు, గుడ్డ అందివ్వడమే లక్ష్యమని రాజు రవితేజ స్పష్టం  చేశారు. దీంతో పాటే.. విద్యా విధానంలోని లోపాలు, అందరికీ వైద్యం, ఆరోగ్యం, కొత్త ఉద్యోగాల కల్పన, పారిశ్రామిక  అభివృద్ధి మొదలైన అన్ని సమస్యలకు తగిన పరిష్కారాలు ఇజం సూచిస్తుందని తెలుస్తోంది.

పార్టీ తరపున కేవలం స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవాలతో పాటు కేవలం రెండు రాష్ట్రాల ఆవిర్భావ  దినోత్సవాలను మాత్రమే జరుపుకోవాలని పవన్ సూచిస్తున్నారు. జాతీయ నాయకుల పుట్టిన రోజులు, సాంస్కృతిక ,మత  సంబంధమైన పండుగల నిర్వహణ ప్రస్తుతం రాజకీయ ప్రయోజనాల కోణంలో సాగుతున్నాయి. అందుకే వాటిని వ్యతిరేకించాలని  పవన్  పిలుపు ఇవ్వనున్నారు.

దీంతోపాటే స్వతహాగా విప్లవ భావజాలం ఎక్కువగా ఉన్న పవన్‌ తన పుస్తకంలో సమసమాజ స్థాపన,  కార్మికులు, కర్షకుల సమస్యలపై రాజీలేని పోరాటం, సామాజిక సంక్షేమానికి పాలనావ్యవస్థ ఎలా కృషి చేయాలి  మొదలైన అంశాలపై తన భావాలను పంచుకొనే అవకాశం ఉంది. దీంతో పాటే.. ప్రాథమిక హక్కుల పరిరక్షణ, సమాజంలో  శాంతిభద్రతలు ,  మహిళా సంక్షేమం, సమకాలీన రాజకీయాలు, నేతలు వ్యవహరించాల్సిన తీరు, వారి  బాధ్యతలు..తదితరాలపైనా  ఇజం పుస్తకంలో పవన్ ఆలోచనలు ప్రతిబింబించనున్నాయి.

Advertisements
Video | This entry was posted in Hyderabad News and tagged , , , , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s