మద్యం మత్తులో ఓ ఖాకీ రెచ్చిపోయాడు. పీకలదాకా తాగి 3నెలల చిన్నారిని బూటుకాలుతో తొక్కి చిదిమేశాడు. మెదక్ జిల్లా దుబ్బాక మండలం హబ్షీపూర్ లో బీరయ్య, ఎల్లయ్య అన్నదమ్ములు. ఇంటి నిర్మాణం విషయంలో ఇద్దరి మధ్య జరిగిన గొడవ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. ఈ వివాదంలో జోక్యం చేసుకున్న ఏఎస్సై పాషా.. మూడురోజుల క్రితం పూటుగా తాగి ఎల్లయ్య ఇంటిమీదికి వెళ్లి దాడికి పాల్పడ్డాడు. అక్కడే నిద్రిస్తున్న ఎల్లయ్య కూతురు మూడు నెలల పాపపై బూటుకాలుతో తొక్కాడు. ఆ పాప ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో చిన్నారి కుటుంబ సభ్యులు పీఎస్ ముందు ఆందోళనకు దిగారు. ఈ కిరాతకానికి పాల్పడ్డ ఏఎస్సై పాషా పరారీలో ఉన్నాడు.
Advertisements