మలేషియా విమానం శకలాల గుర్తింపు

  • హిందూ మహాసముద్రంలో రెండు వస్తువులు
  • ఒకటి విమానం రెక్కలోనిది కావొచ్చని అనుమానం
  • ఆస్ట్రేలియా శాటిలైట్ చిత్రాల్లో వస్తువుల గుర్తింపు
  • వస్తువులు ఉన్న ప్రాంతానికి బయల్దేరిన విమానాలు
  • ఉపగ్రహాల్లో విమాన శకలాలు
  • పెర్త్ నగరానికి 2,500 కి.మీ. దూరంలో శకలాలు?
  • శకలాల్లో ఒకటి 80 అడుగులు, మరొకటి 15 అడుగులు
  • సెర్చింగ్‌లో యుద్ధ విమానం, ఎయిర్‌క్రాప్ట్ల్‌లు
  • శకలాలున్న ప్రాంతాన్ని గుర్తించడం కష్టమన్న ఆస్ట్రేలియా
  • రంగంలోకి కివీస్‌, యూఎస్‌, ఆస్ట్రేలియాల విమానాలు, నౌకలు

మలేషియా విమానం కూలిపోయిందా? అదృశ్యమైన MH-370 ఫ్లైట్‌ ప్రమాదానికే గురైందా? అందుకే, విమానం జాడ గుర్తించడం ఆలస్యమయిందా? ఆస్ట్రేలియా ప్రధాని తాజా వ్యాఖ్యలతో ఈ ప్రశ్నలకు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే 239 మంది ప్రయాణికులు జలసమాధి అయినట్లే.

దాదాపు రెండు వారాల క్రితం గల్లంతైన మలేషియా విమానం ఆచూకీ దొరికినట్లు ఆస్ట్రేలియా ప్రకటించింది. హిందూ మహాసముద్రం పరిసర ప్రాంతాల్లో విమాన శకలాలను పోలిన చిత్రాలను ఉపగ్రహాల ద్వారా సంపాదించామని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి టోనీ అబ్బోట్ వెల్లడించారు. విమానం గుర్తింపునకు ఉద్దేశించిన ఉపగ్రహాలు… రెండు భాగాలను గుర్తించాయని, ఆ శకలాలు ఎమ్‌హెచ్-370 బోయింగ్ విమానానికి సంబంధించినవి కావొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరానికి 2,500 కిలోమీటర్ల దూరంలో రెండు తేలాడే వస్తువులను నాలుగు రోజుల కిందట తమ శాటిలైట్ చిత్రాల్లో గుర్తించినట్లు ఆస్ట్రేలియా అధికారులు చెప్పారు. వీటిలో ఒకటి 80 అడుగులు, మరొకటి 15 అడుగుల పొడవు ఉంది. కొలతను బట్టి అది విమానం రెక్కలో పెద్ద భాగం కావొచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా తమ సైనిక విమానం ఆ వస్తువులు ఎక్కడున్నాయో కనిపెట్టలేకపోయిందని ఆస్ట్రేలియా తెలిపింది.

శకలాలు ఉన్న ప్రాంతాన్ని గుర్తించడానికి ఓ యుద్ధ విమానాన్ని, మరో మూడు ఎయిర్‌క్రాప్ట్లను కూడా పంపింది ఆస్ట్రేలియా. అయితే విమానం కూలినట్లు భావిస్తున్న ప్రాంతాన్ని గుర్తించడం చాలా కష్టంతో కూడినదన్న ఆస్ట్రేలియా ప్రధాని… ఆ శకలాలు మలేషియా విమానానివి కాకుండా పోయే అవకాశం కూడా ఉందని అభిప్రాయపడ్డారు. మరోవైపు… విమాన గుర్తింపు ప్రక్రియను అమెరికా, న్యూజీలాండ్‌లు మరింత తీవ్రం చేశాయి. వస్తువులున్న చోటికి న్యూజిలాండ్, అమెరికా, ఆస్ట్రేలియాల సైనిక విమానాలు, నౌకలు పయనమయ్యాయి. నార్వే నౌక కూడా చేరుకుంది. దక్షిణ హిందూ మహాసముద్రం పరిసర ప్రాంతాల్లో అన్వేషణను కొనసాగిస్తున్నాయి. అటు చైనా కూడా నౌకను పంపాలని భావిస్తోంది. ఆస్ట్రేలియా చెబుతున్నట్లు అది మలేషియా విమాన శకలాలే అయితే.. 239 మంది జలసమాధి అయినట్లే.

Advertisements
Video | This entry was posted in International and tagged , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s