విభజన ప్రక్రియలో గవర్నర్‌ దూకుడు


  • విభజన ప్రక్రియలో దూకుడు పెంచిన గవర్నర్‌
  • కమిటీ శాఖల కార్యదర్శులతో సమీక్ష
  • ఆర్అండ్‌బి ఉన్నతాధికారులతో మీటింగ్
  • వారంలోగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు భవనాల కేటాయింపు
  • కొత్త ప్రభుత్వాలు కొలువు తీరేలా చర్యలు
  • సచివాలయం, అసెంబ్లీ మంత్రుల ప్రాంగణం..
  • ఎమ్మెల్యే క్వార్టర్స్‌, గెస్ట్‌ హౌజ్‌ల విభజనకు వారంలో కమిటీ
  • కొత్త సీఎంలకు వాస్తు, భద్రత ఉండేలా బ్లాక్స్‌ ఏర్పాటు
  • రెండు ప్రభుత్వ కార్యాలయాల మధ్య ఫెన్సింగ్‌
  • ఒక ప్రభుత్వ ప్రాంగణంలోకే సచివాలయంలోని గుడి, మసీదు
  • హెలీప్యాడ్‌ వద్ద ఉపయోగంలో లేని గేటు పునరుద్ధరణకు గ్రీన్ సిగ్నల్‌
  • 40 శాఖల అధిపతులతో విభజనపై గవర్నర్ ఆరా
  • ఎలా విభజిస్తే బాగుంటుందో వారినే కోరిన గవర్నర్‌
  • బ్లాక్స్‌ కేటాయింపులపై నరసింహన్‌దే తుది నిర్ణయం

విభజన ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. వారంలోగా రెండు కొత్త రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైన భవనాలు ఏర్పాటు చేయాలని గవర్నర్ నరసింహన్ అధికారులను ఆదేశించారు. జూన్ 2న కొత్త ప్రభుత్వాలు కొలువుతీరనున్న నేపథ్యంలో సెక్రటేరియట్, అసెంబ్లీలను రెండు రాష్ట్రాలకు కేటాయించేలా నివేదిక సిద్దం చేయాలని సూచించారు. వాస్తు , భద్రత దృష్టిలో పెట్టుకొని కొత్త సీఎంల బ్లాక్ ఏర్పాటుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

రాష్ట్ర విభజన ప్రక్రియను వేగవంతం చేసే బాధ్యతను గవర్నర్‌ నరసింహన్‌ భుజాలకెత్తుకున్నారు. అన్నింటికన్నా కీలకమైన భవనాల విభజనపై.. ఆయన ఆర్‌ అండ్‌ బీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వారం లోగా రెండు ప్రభుత్వాలకు భవనాల కేటాయింపు జరిగిపోవాలని ఆదేశించారు.

పదేళ్లపాటు ఉమ్మడి రాజధాని జీహెచ్ ఎంసీ పరిధిలో ఉండటంతో.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఇక్కడే నుంచే పాలన కొనసాగించే విధంగా అనువైన భవనాలు వెతికే పనిలో పడ్డారు అదికారులు. జూన్ 2 న కొత్త ప్రభుత్వాలు కొలువుదీరాల్సి ఉన్నందున అధికారులు ప్రస్తుత సచివాలయం , అసెంబ్లీలనే రెండు ప్రభుత్వాలకు కేటాయించాలని నిర్ణయానికి వచ్చారు. సచివాలయం విషయానికి వస్తే…. సీబ్లాక్ ను  తెలంగాణ ముఖ్యమంత్రికి కేటాయిస్తూ..  ఆంద్రప్రదేశ్ సీఎం కోసం చాంబర్ ను  అన్వేషిస్తున్నారు. క్యాబినెట్ మీటింగ్ హాల్ , ఛీఫ్ సెక్రటరీ చాంబ , విజిటర్స్ రూమ్, భద్రతా సిబ్బంది ఇలా అన్ని హంగులు  ఉండాలి.. ఇందుకోసం వారంలోగా  బ్లాక్ ను గుర్తించి.. అందులో ఏర్పాట్లు చేసేందుకు అధికారులు సిద్దమయ్యారు.

మరోవైపు  ఏబీసీడీ పాత జీ బ్లాక్ తోపాటు ఇప్పుడున్న టెంపుల్, మసీద్ రెండు ఒకే ప్రభుత్వ ప్రాంగణంలో ఉండేలా కేటాయించే అవకాశం ఉంది.. రెండు ప్రభుత్వాల మద్య ఫెన్సింగ్ ఏర్పాటు తో పాటు  ఎంట్రీ, ఎగ్జిట్ గేట్స్ ఏర్పాటు చేయాల్సి ఉంది. పాత గేటుకు వాస్తు దోషం ఉన్నందున హెలిప్యాడ్ పక్కన ఉన్న గేట్ ఓపెన్ చేయడం గాని…  ఎన్టీఆర్ గార్డెన్స్ పక్కన మరో గేట్ నిర్మించడం గాని చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. తెలంగాణకు సీఎంతో సహా పద్దెనిమిది మంది మంత్రులు, ఆంద్రప్రదేశ్ కు సీఎంతో సహా 24 మంది మంత్రులకు చాంబర్స్ కేటాయించాల్సి ఉంటుంది.

ఇక అసెంబ్లీ విషయానికి వస్తే  జూన్ 2 న ప్రభుత్వాలు ఏర్పడగానే ఎమ్మెల్యేలు  ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది.. అందుకు ఎంసీఆర్ హెచ్ఆర్డీ పరిశీలించినప్పటికీ… ఇప్పుడున్న పాత కొత్త అసెంబ్లీలను ఉపయోగించుకోవాలని డిసైడ్ అయ్యారు. అలాగే మంత్రుల ప్రాంగణం, ఎమ్మెల్యే క్వార్టర్స్‌ను విభజించాల్సి వస్తోంది. మరోవైపు సచివాలయంలో  ప్రస్తుతం దాదాపు 40 విభాగాలు పనిచేస్తున్నాయి. రెండు ప్రభుత్వాలు ఇక్కడినుంచే పనిచేయాల్సి ఉంటుంది. డీజీపీలు, ఏసీబీ , ఇంటిలిజెన్స్, సీసీఎల్ఏ, ఎక్జైజ్ , కమర్షియల్ ,ఇంజీనీరింగ్ ఛీప్ ఇలా అన్ని శాఖలను రెండు ప్రభుత్వాలకు విభజించాలి. వీటికి సంబంధించిన నివేదిక ఇవ్వాలని గవర్నర్‌…హెచ్‌ ఓ డీ లను ఆదేశించారు.

మరో వైపు కార్పోరేషన్ల విభజన మాత్రం కొత్త ప్రభుత్వాలు కొలువుతీరాకే ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. అందులో కొన్నింటిని తొలగించడంకాని,.. ఇతర శాఖలో కలపడం కాని ఉంటుందని చెబుతున్నారు.

Advertisements
Video | This entry was posted in Andhra Pradesh News and tagged , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s