కమలానికి పవన్ సంపూర్ణ మద్దతు

  • విభజన సహా అనేక అంశాలపై చర్చలు
  • విభజించొచ్చు..కాని ప్రజలను చీల్చొద్దు
  • అధికారంపై ఆసక్తి లేదు: పవన్‌
  • ఎన్నికల్లో పోటీపై నిర్ణయం తీసుకోలేదు: పవన్‌

pawan1

నరేంద్ర మోడీకి జనసేన చీఫ్‌ పవన్‌ కళ్యాణ్‌ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మోడీతో అరగంటకు పైగా సమావేశమై పవన్‌.. కాబోయే ప్రధాని ఆయనేనని చెప్పారు. పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదని, అధికారం కోసం చూడడం లేదని స్పష్టం చేశారు.. పవర్‌ స్టార్‌.

తెలుగు ప్రజల తరపున మద్దతు కూడగడతానని ఘనంగా ప్రకటించిన పవన్‌ … కార్యాచరణను కూడా అదే స్థాయిలో ప్రారంభించారు. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీతో సమావేశమైన పవన్‌.. రాష్ట్ర విభజన సహా అనేక అంశాలపై అరగంటకు పైగా చర్చించారు. విధివిధానాలు లేకుండా రాష్ట్రాన్ని చీల్చారంటున్న కల్యాణ్‌బాబు… మోడీ లాంటి వ్యక్తి నిర్ణయం తీసుకునే స్థానంలో ఉండి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదని చెబుతున్నారు. మోడీతో కలిసి పనిచేయడంపై క్లారిటీ కూడా ఇచ్చారు పవన్‌. రాష్ట్ర విభజన జరగవచ్చు గానీ ఇరు ప్రాంతాల ప్రజలు చీలిపోవడం మంచిది కాదని చెబుతూ వస్తున్న ఈ మెగా బ్రదర్‌… రెండు రాష్ట్రాలకు న్యాయం చేయడం కోసం మోడీ ఏమేం చేస్తారో అడిగి తెలుసుకున్నారు. రెండు రాష్ట్రాలకు చేయాల్సిన కార్యక్రమాల గురించి వివరించారు.

తాను రాజకీయ నాయకుడిని కాదన్న పవర్‌స్టార్‌… తనకు అధికారంపై ఆసక్తి లేదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలా, వద్దా అనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. మోడీకి మద్దతు తెలపడం కోసమే అహ్మదాబాద్ వచ్చానని, మోడీని ప్రధానిని చేయడానికి జనసేన పార్టీ కృషి చేస్తుందని స్పష్టం చేశారు.

పవన్ కళ్యాణ్‌తో పాటు రాజు రవితేజ, మరి కొంత మంది అనుచరులు అహ్మదాబాద్ వెళ్లారు. పవన్‌తో ఏకాంతంగా మాట్లాడిన మోడీ… పొత్తు ఖరారు, సీట్ల పంపకంపై ప్రకాష్ జవదేకర్, అరుణ్ జైట్లీతో మాట్లాడాలని సూచించినట్లు తెలుస్తోంది.

Advertisements
Video | This entry was posted in Andhra Pradesh News and tagged , , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s