పవన్ కోసం టిడిపి రెడ్ కార్పెట్

తమ్ముడు కమలాన్ని అందుకొన్నారు. గాంధీనగర్‌ వెళ్ళి మరీ లోటస్‌ను చేతబట్టారు. కాంగ్రెస్‌ను దేశం నుంచి తరిమేయడమే ధ్యేయమన్న పవర్‌స్టార్‌… అందుకు సరైన జోడీని ఎంచుకొని యుద్ధరంగంలోకి అడుగుపెడ్తున్నారు. దీంతో రాష్ట్రంలో టీడీపీతో కలసి ముందుకెళ్ళడం దాదాపు ఖరారైపోయింది. ఈ పతాక సన్నివేశంతో సైకిల్‌ పార్టీ ఉబ్బితబ్బిబౌతోంది.

cp2

కథ రసకందాయంలో పడింది. రాజకీయం మలుపు తిరిగింది. ఎన్నికలు ఓవైపు, పొత్తులు మరోవైపు. అన్నీ పతాక సన్నివేశానికి స్వాగతం పలుకుతున్నాయ్‌. సార్వత్రిక ఎన్నికల వేళ కొత్త స్నేహాలు ప్రత్యర్ధుల్ని పరుగులు పెట్టిస్తున్నాయ్‌. జనసేన పార్టీతో ప్రజల ముందుకొచ్చిన పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ కేంద్రంగా రాజకీయ ముఖచిత్రం సరికొత్త పొత్తులకు స్వాగతం పలికింది. ఇక్కడ అసలు ట్విస్ట్‌ ఏంటంటే గాంధీనగర్‌ వేదికగా.. స్టేట్‌ పొలిటిక్స్‌ ఇప్పుడు జెడ్‌ స్పీడ్‌లో ముందుకెళ్తున్నాయ్‌.

ఎన్నికలకు అతి సమీపంలో పవన్‌ కళ్యాణ్‌ పార్టీ పెట్టారు. కాంగ్రెస్‌ హఠావో…దేశ్‌ బచావో. ఇదే పార్టీ నినాదం. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఏ పార్టీతోనైనా కలుస్తానంటూ పవన్‌ సుస్వాగతం చెప్పారు. తమ్ముడి ఆఫర్‌కు ఉబ్బితబ్బిబ్బయ్యింది టీడీపీ. పొత్తు విషయం బయటకు చెప్పలేదు. కానీ తమకే కలిసొస్తుందని తెలుగు తమ్ముళ్ళు కేరింతలు కొట్టారు. పవర్‌స్టార్‌ అనుకున్నట్లుగానే వయా బీజేపీ, టీడీపీకి దగ్గరౌతున్నారు. కమలంతోనే నా ప్రయాణమంటూ తేల్చేశారు మెగా బ్రదర్‌. గాంధీనగర్‌ వెళ్ళి మరీ మోడీని కలిశారు. కమలానికి జైకొట్టి వచ్చారు. ఇక్కడ టీడీపీ, అక్కడ బీజేపీతో కలసి డ్యూయల్‌రోల్‌ పోషించనున్నారు పవర్‌ స్టార్‌.

పవన్‌ ఒంటరిగా ఎన్నికలకు వెళ్తారా? మరే పార్టీతోనైనా పొత్తు పెట్టుకుంటారా? ముందు నుంచి ఉత్కంఠ కలిగించింది. అయితే తన ప్రసంగంలో చంద్రబాబును పల్లెత్తు మాటనకపోవడంతో పవర్‌స్టార్‌ సైకిలెక్కడం ఖాయమని తేలింది. కానీ డైరెక్ట్‌గా దేశం గూటికెళ్ళడానికి తమ్ముడు ఇష్టపడలేదు. కానీ మోడి మేనియాకు ఫిదా అయిపోయారు. కాంగ్రెస్‌కు సమవుజ్జీగా ఉన్న లోటస్‌ పార్టీతోనే జతకట్టారు. ఇక్కడే అసలైన ట్విస్ట్‌ ఉంది. ఎన్డీయేలో టీడీపీ భాగస్వామ్యం కాబోతుంది. తద్వారా రాష్ట్రంలో చంద్రబాబు-పవన్‌లు ఎన్నికల్లో కలసి అడుగేయబోతున్నారు. కళ్యాణ్‌ను చేరదీయడం ద్వారా అన్నయ్యకు ధీటైన జవాబు చెప్పాలని ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌ తొందరపడుతోంది. పవన్‌ కోసం రెడ్‌ కార్పెట్‌ వేస్తోంది.

జనసేన పార్టీకి యూత్‌ నుంచి వచ్చిన స్పందన అంతా ఇంతా కాదు. ఇదంతా ఇప్పుడు ఓట్లుగా టీడీపీ క్యాష్‌ చేసుకోబోతుంది. కొద్దిసీట్లలో పోటీకి సిద్దపడుతున్న పవన్‌ సేన…మిగతా స్థానాల్లో సైకిల్‌ గుర్తుకే ఓట్లేయనుంది. ఇది బాగా కలిసొస్తుందని టీడీపీ ఖుషీ అవుతోంది. గబ్బర్‌సింగ్‌ సైకిలెక్కితే అది అసెంబ్లీ దగ్గరే ఆగుతుందన్న నమ్మకం వారిలో బలపడుతోంది. తాజా సన్నివేశానికి టీడీపీ శ్రేణులు ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. కాంగ్రెస్‌పై కోపం, ఫ్యామిలీలో వార్‌.. పార్టీ పెట్టడానికి కారణం ఏదైనా… కాలం కలిసొచ్చి ఇదంతా తెలుగుదేశం పార్టీకి మేలుచేస్తుండటం విశేషం. అటు టీడీపీనే ప్రధాన ప్రత్యర్ధిగా భావించి ఎన్నికల్లో దిగిన వైరీ పక్షాలు… ప్రతివ్యూహాల్లో నిమగ్నమైపోయాయి.

Advertisements
Video | This entry was posted in Andhra Pradesh News and tagged , , , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s