టీఆరెస్‌లో సిద్ధమైన అభ్యర్థుల జాబితా

  • తుది దశకు చేరిన టిఆర్‌ఎస్‌ కసరత్తు
  • సర్వేల ఆధారంగానే మెజార్టీ అభ్యర్థుల ఖరారు
  • ఉగాది నాడు తొలిజాబితా విడుదలకు సన్నాహాలు
  • ఉత్తర తెలంగాణాలోని 44 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు
  • పాలమూరు, నల్గొండ, మెదక్‌ల్లోనూ మెజార్టీ సీట్లపై కన్ను
  • రంగారెడ్డి, హైదరాబాద్‌, ఖమ్మం జిల్లాల్లో కొనసాగుతున్న అభ్యర్థుల వేట
  • గజ్వేల్‌ నుంచి బరిలో కేసీఆర్‌…
  • ఆంథోల్‌లో బాబూమోహన్‌
  • మెదక్‌లో పద్మా దేవేందర్‌ రెడ్డి
  • ఆలేరులో గొంగడి సునీత
  • అమరుల కుటుంబాల నుండి హుజూర్‌నగర్లో శంకరమ్మ
  • డోర్నకల్‌ సత్యవతి రాథోడ్‌
  • ఖానాపూర్‌లో రేఖానాయక్‌
  • పాలమూరులో శ్రీనివాస్‌ గౌడ్‌
  • పిడమర్తి రవికి సత్తుపల్లి
  • తుంగతుర్తి నుంచి గాదారి కిషోర్‌
  • చొప్పదండిలో బాల్క సుమన్‌
  • మాజీ మంత్రుల నియోజకవర్గాలపై ప్రత్యేకదృష్టి
  • ఉత్తరతెలంగాణలోని 42 స్థానాలకు అభ్యర్థులు రెడీ
  • సిర్పూరు నుంచి కావేటి ప్లేస్‌ లో పాల్వాయి రాజ్యలక్ష్మికి ఛాన్స్‌
  • వేములవాడలో రమేష్‌కు బదులు చెన్నాడి సుధాకర్‌రావు
  • 10 ఎంపీ స్థానాలకు పూర్తయిన అభ్యర్థుల ఖరారు
  • నిజామాబాద్‌ బరిలో కవిత
  • నాగర్‌కర్నూల్‌, పెద్దపల్లిల్లో మందా, వివేక్‌
  • వరంగల్‌లో కడియం, పాలమూరులో జితేందర్‌రెడ్డి
  • ఆదిలాబాద్‌లో నగేష్‌, జహీరాబాద్‌లో బీబీ పాటిల్‌
  • మహబూబాబాద్‌లో రిటైర్డ్‌ ఐఎఎస్‌ రామచంద్రనాయక్‌
  • చేవెళ్లలో విశ్వేశ్వర్‌రెడ్డి, భువనగిరిలో నర్సయ్యగౌడ్‌
  • మెదక్‌ స్థానంపై కేసీఆర్‌ పునరాలోచన
  • కరీంనగర్‌ నుండి పోటీకి యోచన
  • మెదక్‌ బరిలో ఉద్యోగ నేతకు ఛాన్స్‌
  • సికింద్రాబాద్‌, మల్కాజ్‌గిరి, హైదారాబాద్‌, ఖమ్మం, నల్గొండల్లో రాని క్లారిటీ

టిఆర్‌ఎస్‌ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై తుది కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే దాదాపు 100 అసెంబ్లీ…10  ఎంపీ  అభ్యర్థుల జాబితా సిద్దమైంది. అయితే కాంగ్రెస్‌ జాబితాల విడుదల… టీడీపీ, బీజేపీల పొత్తులు తేలాకే ముందుకెళ్తే మంచిదనే యోచనలో కేసీఆర్‌ ఉన్నారు. ఈ నెల 31 ఉగాది నాడు తొలి జాబితా విడుదలకు టిఆర్‌ఎస్‌ ప్లాన్‌ చేస్తోంది.

టిఆర్‌ఎస్‌ అసెంబ్లీ అభ్యర్థుల తొలిజాబితా సిద్దమైంది. దాదాపు 100 స్థానాలపై టిఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కసరత్తు పూర్తి చేశారు. దాదాపు సిట్టింగ్‌లు అందరికీ మరోసారి అవకాశం ఇచ్చే ఆలోచనలోనే కేసీఆర్‌ ఉన్నారు. సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేసే ప్రయత్నాలు చేశారు. 30కి పైగా స్థానాల్లో బీసీ అభ్యర్థులకు చోటు కల్పించారు. పాతబస్తీలోని నాలుగైదు నియోజకవర్గాలతో పాటు… నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో ముస్లీం అభ్యర్థులు దాదాపు ఖరారయ్యారు. మరో ఆరుగురు మహిళలకు ఈ సారి పోటీ చేసే అవకాశం కల్పిస్తున్నారు. వరంగల్‌ తూర్పు నుండి కొండా సురేఖ, మెదక్‌లో పద్మాదేవేందర్‌రెడ్డి, ఆలేరులో గొంగడి సునీత, హుజూర్‌నగర్‌లో ఆమరుల కుటుంబాల నుండి శంకరమ్మ, డోర్నకల్‌లో సత్యవతి రాథోడ్‌, ఖానాపూర్‌లో రేఖానాయక్‌లు పోటీ చేయనున్నారు. ఇక ఉద్యోగ జేఏసీ నేత శ్రీనివాస్‌గౌడ్‌కు పాలమూరులో… విద్యార్థి జేఏసీ నేత పిడమర్తి రవికి సత్తుపల్లిలో బెర్తులు కన్‌ఫర్మ్‌ అయ్యాయి. తుంగతుర్తిలో కూడా విద్యార్థి జెఎసీ నేత కిషోర్‌.. చొప్పదండిలో టిఆర్‌ఎస్వీ అధ్యక్షుడు సుమన్‌ పేర్లను సైతం పరిశీలిస్తున్నారు.

ఉత్తర తెలంగాణాలోని కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, వరంగల్‌ జిల్లాల్లో  ఎంపీ, ఎమ్మెల్యేల జాబితా దాదాపు పూర్తయిపోయింది. మొత్తం 44 స్థానాల్లో 42 మంది అభ్యర్థుల బాబితా రెడీ అయింది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న సిర్నూర్‌ కాగజ్‌నగర్లో  అభ్యర్థిని మారిస్తే ఎలా ఉంటుందనే దానిపై చర్చ సాగుతోంది. పాల్వాయి రాజ్యలక్ష్మి అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తున్నారు. ఇక పౌరసత్వంపై సుప్రీంకోర్టులో కేసు ఎదుర్కొంటున్న వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ పోటీకి ఆటంకాలుంటే… ప్రస్తుత టిడిపి నియోజకవర్గ ఇంఛార్జి చెన్నాడి సుధాకర్‌రావుకు టిఆర్‌ఎస్‌ టిక్కెట్‌ దక్కే అవకాశాలున్నాయి. మహబూబ్‌నగర్, నల్గొండ, మెదక్‌ల్లోనూ అభ్యర్థులపై క్లారిటీ వచ్చేసింది. గజ్వేల్‌ బరిలో టిఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ దిగుతుండగా…ఆంధోల్‌లో బాబూమోహన్‌ పోటీకి సిద్దమౌతున్నారు. జలగం వెంకట్రావు రాకతో ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, ఖమ్మం, కొత్తగూడెం స్థానాలపై టిఆర్‌ఎస్‌ కన్నేసింది. అలాగే పార్లమెంట్‌ స్థానంలోనూ ప్రభావం చూపే స్థాయికి ఎదుగుతామనే నమ్మకంలో ఉంది. రంగారెడ్డిలో తాజా మాజీలు హరీశ్వర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, రత్నంలకు బెర్తులు ఖరారు కాగా… సీనియర్‌ నేత నాయిని నర్సింహారెడ్డిని ఎల్బీనగర్‌ బరిలో దింపేందుకు సిద్దమౌతున్నారు గులాబీబాస్‌. రాజధాని హైదరాబాద్‌ జిల్లా పరిదిలోని సికింద్రాబాద్‌, సనత్‌నగర్‌, ఉప్పల్‌, కుత్బుల్లాపూర్‌, కూకట్‌పల్లి, రాజేంద్రనగర్‌ లాంటి ఐదారు స్థానాల్లో విజయం సాధిస్తామనే నమ్మకంతో టిఆర్‌ఎస్‌ ఉంది.

పదికి పైగా ఎంపీ స్థానాలపై కన్నేసిన టిఆర్‌ఎస్‌… విజయం సాధిస్తామనే ధీమా ఉన్న స్థానాల అభ్యర్థులపై క్లారిటీకి వచ్చేసింది. నిజమాబాద్‌ నుండి కవిత పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. నాగర్‌కర్నూల్‌, పెద్దపల్లి స్థానాల నుండి మందా జగన్నాథం, వివేక్‌ మరోసారి పోటీ చేయనున్నారు. వరంగల్‌ నుండి కడియం శ్రీహరి, మహబూబాబాద్‌ నుండి రామచంద్రునాయక్‌, ఆదిలాబాద్‌ నుండి నగేష్‌, జహీరాబాద్‌ నుండి వ్యాపారవేత్త బీబీ పాటిల్‌, చేవెళ్ల నుండి విశ్వేశ్వర్‌రెడ్డి, భువనగిరి నుండి నర్సయ్యగౌడ్‌, మహబూబ్‌నగర్‌ నుండి జితేందర్‌రెడ్డి పోటీ చేయడం ఖాయమైంది. మెదక్‌ నుండి పోటీ చేసే విషయంలో టిఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌ అభ్యర్థిగా విజయశాంతి బరిలో ఉంటే… ఆమెపై తాను పోటీ చేయాల్సిన అవసరం లేదనే ఆలోచనలో కేసీఆర్‌ ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడి నుండి ఎవరినైనా నిలిపి… విజయశాంతిని ఓడించాలనే వ్యూహంలో టిఆర్‌ఎస్‌ ఉంది. ఓ ఉద్యోగ సంఘం నేత పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్‌ స్థానం నుండి మరోసారి పోటీకి దిగే ఆలోచనలో కేసీఆర్‌ ఉన్నట్లు తెలుస్తోంది. లేదంటే కేవలం గజ్వేల్‌ ఎమ్మెల్యే స్థానానికే పరిమితం అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదని తెలుస్తోంది.

కాంగ్రెస్‌ జాబితాలు విడుదల కాగానే తమ జాబితాను విడుదల చేసే వ్యూహంలో కేసీఆర్‌ ఉన్నారు. ఈ నెల 30లోగా కాంగ్రెస్‌ జాబితా విడుదల అయితే…ఆ మరుసటి రోజు ఉగాది నాడే టిఆర్‌ఎస్‌ జాబితా విడుదలయ్యే అవకాశాలున్నాయి.

Advertisements
Video | This entry was posted in Andhra Pradesh News and tagged , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s