పొలిటికల్ స్ర్కీన్ పై జనసేన దూకుడు

  • ఎన్నికల్లో పోటీపై తేల్చే అవకాశం
  • జనంలోకి దూసుకెళ్లనున్న జనసేన
  • 27 నుంచి ప్రజల్లోకి వెళ్లేందుకు పక్కా ప్రణాళిక
  • జోష్‌ పెంచుతున్న జనసేన పాటలు
  • కొలిక్కివస్తున్న బీజేపీ- జనసేన మధ్య సీట్ల పంపకం?
  • పవన్‌ పార్టీ కోసం సీట్లు కేటాయించే అవకాశం

పవన్‌ కళ్యాణ్‌ జనసేన.. దూకుడు పెంచబోతోంది. ఈ 27 నుంచి రాష్ట్ర పొలిటికల్‌ స్క్రీన్‌పై అసలు సిసలు సినిమా చూపించనుంది. సినిమాకు ముందు ఆడియో రిలీజ్‌ అయినట్లు.. తొలి బహిరంగ సభకు ముందు రెండు పాటలు విడుదల చేసి జోష్‌ పెంచారు జనసేనాని.

నసేనాని మాటలు సూటిగా సుత్తిలేకుండా జనంలోకి వెళ్లాయి. దీంతో తొలి బహిరంగ సభలో పవన్‌ ఏం మాట్లాడతాడా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విశాఖ సభలో పార్టీ విధివిధానాలు, ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అన్న విషయాలు ప్రకటించే అవకాశం ఉండడంతో.. పార్టీల్లోనూ టెన్షన్‌ పట్టుకుంది.

నొవోటెల్‌ వేదికగా విడుదలైన ట్రైలర్‌కి భారీ రెస్పాన్స్‌ వచ్చింది. దీంతో జనంలోకి దూసుకుపోయేందుకు సర్వం సిద్ధం చేసుకుంటోంది జనసేన పార్టీ. 27 నుంచి ప్రజల్లోకి వెళ్లేందుకు పక్కా ప్రణాళిక తయారుచేసుకుంది. ప్రస్తుతం పవన్‌ కల్యాణ్‌ ఇజం పుస్తకం విడుదల చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే ప్రచార పాటలను కూడా విడుదల చేశారు. ప్రస్తుతానికైతే పార్టీ బలోపేతం కోసం పనంతా తెరవెనకే జరుగుతోంది. ఎల్లుండి నుంచి పక్కా స్క్రీన్‌ప్లేతో అసలైన సినిమా మొదలుకాబోతోంది.

సినిమాపై ఆడియో ఎఫెక్ట్‌ చూపించినట్లే.. జనసేన పార్టీ ప్రచారానికి రీసెంట్‌గా విడుదలైన పాటలు కొత్త జోష్‌ పెంచుతున్నాయి. పార్టీ ఉద్దేశం ఏంటి? విధివిధానాలేంటన్నది ఈ పాటల్లోనే చెప్పేశారు. పవన్‌ సాధించాలనుకున్నదేంటి? పార్టీ లక్ష్యం ఏంటన్నది కూడా ఈ పాటల్లో వివరించారు.

ఇదే సమయంలో పార్టీ బలోపేతంపైనా దృష్టి పెట్టారు పవన్‌ కల్యాణ్‌. ఇప్పటికే మోడీకి జై కొట్టి వచ్చిన పవర్‌ స్టార్‌ దూకుడు చూపించారు. అటు బీజేపీ- జనసేన మధ్య సీట్ల పంపకం కూడా ఓ కొలిక్కి వస్తోంది. బీజేపీ అన్ని రాష్ట్రాల్లో అభ్యర్థుల లిస్ట్‌ సిద్ధం చేసినా.. తెలంగాణ, సీమాంధ్రలో మాత్రం అభ్యర్థుల లిస్ట్‌పై ఇంకా కసరత్తు చేస్తోంది. అంటే, పవన్‌ పార్టీ కోసం కొన్ని సీట్లు కేటాయించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తానికి కాంగ్రెస్‌ హఠావో అనే ఒక్క నినాదంతో రెండు రాష్ట్రాల్లో తన స్ట్రాటజీని బయటపెట్టారు. అంతేకాదు, జనసేన కంటే ముందు పుట్టిన జై సమైక్యాంధ్ర పార్టీ… జనసేన క్రేజ్‌ ముందు దాదాపు కనుమరుగయ్యే స్థితికి చేరుకుంది.

Advertisements
Video | This entry was posted in Andhra Pradesh News and tagged , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s