జనసేన తొలి బహిరంగసభకు సర్వం సిద్ధం

జనసేన తొలి బహిరంగసభకు సర్వం సిద్ధం..
వేదిక నుంచి.. జనసేకరణ వరకు అంతా రెడీ..
లక్షకు పైగా అభిమానులు వస్తారని అంచనా..
ఇప్పుడు అందరి కళ్లు విశాఖ వైపే.. ఆవిర్భావ సభలో అదరగొట్టిన పవర్‌స్టార్‌.. తొలి బహిరంగ సభలో ఎలాంటి పంచ్‌లు ఇస్తాడోనని ఒక్కటే చర్చ..

బెనిఫిట్‌ షో అదిరిపోయింది.. ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించింది..పవన్‌ సినిమాయే కాదు.. పవర్‌స్టార్ స్పీచ్‌ కూడా అంతే పవర్‌ఫుల్‌గా ఉంటుందని నిరూపిచింది. ఇది  జనసేన ఆవిర్భావసభ రిజల్ట్‌.. ఇప్పుడు ఇదే జోష్‌తో తొలి బహిరంగ సభకు ఏర్పాట్లు చేసింది జనసేన. భారీ ఎత్తున అభిమానులను తరలించి.. తొలి సభను సక్సెస్‌  చేయాలని పట్టుదలతో ఉంది. ఇవాళ విశాఖలో జరిగే సభకు ఏర్పాట్లన్నీ  ఇప్పటికే పూర్తయ్యాయి. అటు, రాజా రవితేజ విత్ పవన్ అంటూ “ఇజం” పుస్తకాన్ని కూడా ఈ సభలోనే ఆవిష్కరించబోతున్నారు.

ఎన్నో విమర్శలు.. మరెన్నో ఆరోపణలు.. అసలు రాజకీయాల్లోకి వస్తాడో రాడో అనుకున్న తరుణంలో ఏకంగా పార్టీయే పెట్టి సెన్షేషన్‌ సృష్టించిన పవన్‌కళ్యాణ్‌..   ఆవిర్భావ సభలో వన్‌ మ్యాన్‌ షో చూపించాడు. ఎక్కడా తొణుకుబెణుకు లేకుండా సూటిగా సుత్తిలేకుండా పవర్‌ఫుల్‌ స్పీచ్‌ దంచాడు. సోనియా, రాహుల్‌, కాంగ్రెస్సే  పార్టీయే టార్గెట్‌గా ఆవేశంగా ప్రసంగించాడు.. అభిమానులు కేరింతలుకొట్టేలా చేశాడు.

కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసిన పవన్‌..టీఆర్‌ఎస్‌నూ ఇరుకునపెట్టేలా ప్రసంగించాడు. వ్యక్తిగత జీవితంపై ఉన్న విమర్శలకూ తనదైన స్టైల్‌లో  సమాధానం చెప్పాడు. మరోసారి ఎవ్వరూ కామెంట్ చేయని విధంగా ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చాడు.

అంతా బాగానే ఉన్నా.. జనసేన అసలు ఉద్దేశం ఏంటి.. పార్టీ విధివిధానాలు, భవిష్యత్‌ ప్రణాళిక ఎంటన్న దానిపై పవన్‌ స్పష్టత ఇవ్వలేదు. ఏ పార్టీకైనా మద్దతుగా  నిలుస్తాడా.. లేదా తానే ఎన్నికల బరిలో దిగుతాడా అన్నదానిపైనా సమాధానం చెప్పలేదు. దీంతో విశాఖ సభపై ఎక్సపర్టేషన్స్‌ పెరిగిపోతున్నాయి. పవన్‌ కీలక  ప్రసంగం చేయబోతున్నాడని పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతోంది. ఎన్నికల్లో పోటీ నుంచి.. పార్టీ విధానాల వరకు అనేక కీలక విషయాలపై ఆయన మనోగతం  చెప్పబోతున్నారని అంటున్నారు. దీంతో పవన్‌ ఫ్యాన్స్‌తో పాటు.. మిగిలిన వారు విశాఖ సభపై దృష్టిపెట్టారు..

విశాఖ సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న జనసేన నేతలు, పవన్‌ అభిమానులు.. భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు.. ఉభయగోదావరి  జిల్లాల  నుంచీ భారీగా జనసమీరణ చేయనున్నారు. సభలో ఎలాంటి గందరగోళం లేకుండా మహిళల కోసం ప్రత్యేక గ్యాలరీలను సిద్ధం చేస్తున్నారు.

అన్నయ్య చిరంజీవిపై ఇప్పటి వరకు ఎలాంటి విమర్శలు చేయకపోయినా.. మెగాస్టార్‌ మాత్రం పరోక్షంగా తమ్ముడిని తప్పుబడుతున్నారు. లౌకికవాది అయిన పవన్‌..   మోడీని ఎలా కలుస్తారంటూ విమర్శించారు. ఈ నేపథ్యంలో అన్నపై కూడా పవన్‌.. పవర్‌ చూపిస్తాడా.. విమర్శలపై డైరెక్ట్ ఎటాక్‌ ఇస్తాడా అన్నది ఆసక్తిగా  మారింది.  మొత్తానికి తాజా పరిణామాలతో పవన్‌ సభ కోసం యావత్‌ రాష్ట్రం ఆసక్తిగా చూస్తోంది.

Advertisements
Video | This entry was posted in Andhra Pradesh News and tagged , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s