ఉగాది పర్వదినాన రాజకీయ పార్టీల్లోపంచాంగ పఠనం

ఉగాది పర్వదినాన రాజకీయ పార్టీల్లో సందడి అంతా ఇంతా కాదు. ముఖ్యనేతల మధ్య పంచాంగ పఠనం జరిగింది. జయనామ సంవత్సరంలో తెలుగు ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని నాయకులు ఆకాంక్షించగా.. వచ్చే ఎన్నికల్లో మీరే గెలుస్తారంటూ పండితులు అన్ని పార్టీలకు ఒకేరకమైన జోస్యం వినిపించారు.

To See Video Click Here

వైసీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మారేపల్లి రామచంద్రశాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు. జయనామ సంవత్సరంలో వైసీపీకి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. ఎన్నికల తర్వాత అనేక పార్టీలు రాజకీయ ముఖచిత్రం నుంచి కనుమరుగుకాక తప్పదన్నారు. వర్షాలు సకాలంలో పడతాయని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పారు. ఈ ఉగాది వేడుకలల్లో పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మతో పాటు పార్టీ ముఖ్య నేతలంతా హాజరయ్యారు.

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరాభవన్‌లో జయనామ సంవత్సర ఉగాది వేడుకలు నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భవిష్యత్తుపై ఆశాభావంతో ముందడుగువేయాలని చిరంజీవి పిలుపిచ్చారు. ఇందిరాభవన్‌లో జరిగిన ఉగాది వేడుకలలో కేంద్రమంత్రి చిరంజీవి, మాజీ మంత్రులు సి.రామచంద్రయ్య, డొక్కా మాణిక్యవరప్రసాద్, ఎం.సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు.

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రముఖ జ్యోతిష్కుడు పొన్నలూరి శ్రీనివాసగార్గేయ పంచాంగ శ్రవణం చేశారు. తెలుగు ప్రజలకు పూర్వ వైభవం తీసుకువచ్చే బాధ్యత తెలుగుదేశంపై ఉందని చంద్రబాబు అన్నారు. ఈ ఉగాదివేడుకల్లో చంద్రబాబుతో పాటు పలువురు దేశం నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవులను చంద్రబాబు సత్కరించారు.

జై సమైక్యాంధ్ర పార్టీ కార్యాలయంలో తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ సందర్భంగా పంచాంగ శ్రావణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కిరణ్ కుమార్ రెడ్డితో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ఉగాది తెలుగు ప్రజలందరికీ సుఖసంతోషాలు అందించాలని కిరణ్ ఆకాంక్షించారు. తెలుగు జాతి అంతా కలిసి ఉండాలని కోరుకుంటున్నామన్నారు.

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేడుకల్లో పాల్గొన్న విద్యాసాగర్‌రావు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. సంతోష్ కుమార్ శాస్త్రి పంచాంగశ్రవణం చేశారు.

Advertisements
Video | This entry was posted in Andhra Pradesh News and tagged , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s