గులాబీ పార్టీ తొలి జాబితా విడుదల ఖరారు

గులాబీ పార్టీ తొలి జాబితా విడుదలకు ముహూర్తం పెట్టింది. ఈ ఉదయం 11 గంటలకు అసెంబ్లీ, పార్లమెంట్‌ అభ్యర్ధుల ఫస్ట్‌ లిస్ట్‌ ప్రకటించబోతోంది. 70 మంది అసెంబ్లీ, 10 లోక్‌సభ నియోజకవర్గాల అభ్యర్థులతో జాబితా విడుదల కాబోతుంది. అయితే టిక్కెట్‌ రాని నాయకుల నుంచి వ్యతిరేకత రాకుండా కేసీఆర్‌ జాగ్రత్త పడుతున్నారు.

a2

To See Video Click Here

టిఆర్‌ఎస్‌ జాబితా కొలిక్కి వచ్చింది. సుమారు 70 మంది ఎమ్మెల్యే, 10 ఎంపీ అభ్యర్ధులతో తొలిజాబితాను ఖరారు చేసింది. ఇందులో దాదాపు 15 నియోజకవర్గాల్లో ఇద్దరు, ముగ్గురు ఆశావహులున్నారు. పది మంది లోక్‌సభ అభ్యర్ధుల్ని ఒకే చేసినా కొన్ని నియోజకవర్గాల విషయంలో కేసీఆర్‌ ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఇద్దరు ముగ్గురు బలమైన నేతలు టిక్కెట్లు ఆశిస్తుండటం కొత్త చిక్కులు తెస్తోంది. మిగిలిన ఏడు లోక్‌సభ సీట్ల విషయంలో బలమైన అభ్యర్ధులు దొరక్కపోవడం టీఆర్‌ఎస్‌కు కునుకు లేకుండా చేస్తోంది. మొత్తం లోక్‌సభ స్తానాల్ని గెలుచుకొని ఢిల్లీలో చక్రం తిప్పాలన్న ఆశతో ఉన్న KCR బరిలో నిలిచే నేతల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నారు. అటు సీటు ఆశించి భంగపడ్డ నేతల్ని బుజ్జగించి దారిలోకి తెచ్చుకొనేందుకు ప్రత్యేక బృందం మంతనాలు చేస్తున్నట్లు సమాచారం.

గజ్వేల్‌ నుంచి కేసీఆర్‌ అసెంబ్లీ పోటీ చేయడం ఖాయమైందంటున్నారు. అయితే లోక్‌సభకు ఎక్కడి నుంచి బరిలో దిగుతారన్న విషయంలో టీఆర్‌ఎస్‌ క్లారిటీ ఇవ్వడంలేదు. మెదక్‌ నుంచి పోటీ చేసే విషయంలో KCR సందిగ్ధం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలంటున్నాయ్‌. ఇక పెద్దపల్లి లోక్‌సభకు రసమయి బాలకిషన్‌, కొప్పుల ఈశ్వర్‌ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఈ ఇద్దరు నేతలు ఎంపీగా పోటీకి విముఖత చూపుతున్నారు. ఇక ఖమ్మం నుంచి పార్లమెంట్‌కు పోటీ చేసే విషయంలో జలగం వెంకట్రావ్‌ అంతగా ఆసక్తి చూపించడం లేదు. కొత్తగూడెం నుంచి శాసనసభకు పోటీ చేస్తానని గులాబీ బాస్‌కు ఇప్పటికే ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ లోక్‌సభ స్థానాల్లో గెలుపు గుర్రాల కోసం వేట సాగిస్తున్నారు. హైదరాబాద్‌లో మజ్లీస్‌ హవాను తట్టుకోవడం కష్టం. ఇక మిగిలిన రెండు చోట్ల అయినా గులాబీ జెండాను రెపరెపలాడించాలన్నది కేసీఆర్‌ ప్లాన్‌.

మరో 30 అసెంబ్లీ స్థానాల్లో పోటీకి నాయకులెవరూ ముందుకు రాకపోవడమూ కేసీఆర్‌కు మింగుడు పడటం లేదు. అయితే ఇప్పటి వరకు ఖరారైన నియోజకవర్గాల అభ్యర్ధులను ఇవాళ ప్రకటించేందుకు టీఆర్‌ఎస్‌ సిద్ధమౌతోంది. ఒకటి రెండు రోజుల్లో మిగిలిన టిక్కెట్ల విషయంలో క్లారిటీ ఇవ్వడానికి గులాబీ దళం ప్రయత్నిస్తోంది. అయితే అభ్యర్ధుల ప్రకటన అనంతరం కారుపార్టీలో ఎలాంటి అసంతృప్తులు బయటపడతాయన్నది ఆసక్తికర అంశం.

టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థులు

మెదక్‌                  –      కేసీఆర్‌
మహబూబ్‌నగర్‌    –     జితేందర్‌రెడ్డి
కరీంనగర్‌        –    వినోద్‌
ఆదిలాబాద్‌        –    నగేష్‌ ( బోథ్ సిట్టింగ్ ఎమ్మెల్యే )
నిజామాబాద్‌              –    కవిత
మహబూబాబాద్‌    –    రామచంద్రనాయక్ ( రిటైర్డ్ ఐఏఎస్ )
వరంగల్‌        –    కడియం శ్రీహరి
నాగర్‌కర్నూల్‌     –        మందా జగన్నాథం
చేవెళ్ల                  –    విశ్వేశ్వర్‌ రెడ్డి
భువనగిరి        –    భూర నర్సయ్యగౌడ్‌‌
ఖమ్మం            –    జలగం వెంకట్రావు (కొత్తగూడెం ఎమ్మెల్యే స్థానంపై ఆసక్తి చూపుతున్నారు)
జహీరాబాద్‌        –     బీవీ పాటిల్‌
నల్గొండ        –    రాజేశ్వర్‌రెడ్డి
ఇంకా ఖరారు కాని ఎంపీ స్థానాల అభ్యర్థులు
సికింద్రాబాద్‌, మల్కాజ్‌గిరి, హైదరాబాద్‌, పెద్దపల్లి

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థులు
కరీంనగర్‌ జిల్లా                    (13)
హుజూరాబాద్‌     –     ఈటెల రాజేందర్‌(సిట్టింగ్)
సిరిసిల్ల            –     కేటీఆర్‌(సిట్టింగ్)
ధర్మపురి        –     కొప్పుల ఈశ్వర్‌(సిట్టింగ్)
కరీంనగర్‌        –    గంగుల కమలాకర్‌(సిట్టింగ్)
రామగుండం        –    సోమారపు సత్యనారాయణ(సిట్టింగ్)
కోరుట్ల             –    విద్యాసాగర్‌రావు(సిట్టింగ్)
వేములవాడ        –    చెన్నమనేని రమేష్‌(సిట్టింగ్)
మానకొండూర్‌     –    రసమయి బాలకిషన్‌
మంథని         –    పుట్ట మధు (2009లో పిఆర్పీ ఎమ్మెల్యే అభ్యర్థి)
పెద్దపల్లి            –    మనోహర్‌రెడ్డి
హుస్నాబాద్‌         –    సతీష్‌బాబు
జగిత్యాల        –     డా.సంజయ్‌కుమార్‌
చొప్పదండి                పెండింగ్

ఆదిలాబాద్ జిల్లా         (10)
ఆదిలాబాద్‌         –    జోగు రామన్న(సిట్టింగ్)
సిర్పూర్‌         –    కావేటి సమ్మయ్య(సిట్టింగ్)
చెన్నూర్‌         –    ఓదెలు(సిట్టింగ్)
ముథోల్‌         –    వేణుగోపాలాచారి(సిట్టింగ్)
ఖానాపూర్‌             రేఖానాయక్‌
ఆసిఫాబాద్‌             కోవా లక్ష్మి
బోథ్‌             –    రాములు నాయక్‌
మంచిర్యాల           –    దివాకర్‌రావు (మాజీ ఎమ్మెల్యే)
నిర్మల్‌            –    శ్రీహరిరావు
బెల్లంపల్లి             పెండింగ్

వరంగల్‌ జిల్లా        (12)
స్టేషన్‌ ఘనపూర్‌        –    రాజయ్య(సిట్టింగ్)
వరంగల్‌ (వెస్ట్‌)            –     వినయ్‌ భాస్కర్‌(సిట్టింగ్)
పరకాల             –    భిక్షపతి(సిట్టింగ్)
నర్సంపేట             –    పెద్ది సుదర్శన్‌రెడ్డి
భూపాలపల్లి            –    మధుసూదనాచారి
జనగామ            –    యాదగిరి రెడ్డి
వరంగల్‌ (ఈస్ట్‌)        –    కొండాసురేఖ
పాలకుర్తి                 సుధాకర్‌రావు
ములుగు                 చందూలాల్‌
డోర్నకల్‌                 సత్యవతిరాథోడ్‌
మహబూబాబాద్‌             సీతారాం నాయక్‌
వర్థన్నపేట                పెండింగ్

మెదక్‌ జిల్లా                (10)
సిద్దిపేట     –    హరీష్‌రావు(సిట్టింగ్)
గజ్వేల్‌         –    కేసీఆర్‌
మెదక్‌        –    పద్మాదేవేందర్‌రెడ్డి
దుబ్బాక     –    రామలింగారెడ్డి
ఆంధోల్‌    –    బాబూమోహన్‌
పటాన్‌చెరు    –    మహిపాల్‌రెడ్డి
సంగారెడ్డి         చింత ప్రభాకర్‌
నారాయణఖేడ్         పెండింగ్
నర్సాపూర్         పెండింగ్
జహిరాబాద్        పెండింగ్

నల్లొండ జిల్లా        (12)
సూర్యాపేట        –     జగదీశ్వర్‌రెడ్డి
ఆలేరు            –    సునీత
హుజూర్ నగర్            శంకరమ్మ
దేవరకొండ             లల్లూ నాయక్
కోదాడ                శశిధర్ రెడ్డి
మిర్యాల గూడ            అమరేందర్ రెడ్డి
భువనగిరి            పెండింగ్
మునుగోడు             పెండింగ్
నల్గొండ            పెండింగ్
తుంగతుర్తి             పెండింగ్

మహబూబ్‌నగర్‌ జిల్లా     (14)
కొల్లాపూర్‌        –     జూపల్లి కృష్టారావు(సిట్టింగ్)
మక్తల్‌             –    ఎల్లారెడ్డి (నారాయణపేట సిట్టింగ్‌ ఎమ్మెల్యే)
కల్వకుర్తి         –    జైపాల్‌ యాదవ్‌(సిట్టింగ్)
మహబూబ్‌నగర్‌     –    శ్రీనివాస్‌ గౌడ్‌
జడ్చర్ల         –    లక్ష్మారెడ్డి (మాజీ ఎమ్మెల్యే)
గద్వాల         –    కృష్టమోహన్‌రెడ్డి
నాగర్‌కర్నూల్‌         –    మర్రి జనార్థన్‌రెడ్డి (2010 ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి)
అచ్చంపేట         –    గువ్వల బాలరాజు (2009లో నాగర్‌కర్నూల్‌ టిఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి)
అలంపూర్‌         –    శ్రీనాథ్‌(మంథాజగన్నాథం తనయుడు)
నారాయణపేట         –    శివకుమార్‌
వనపర్తి             నిరంజన్ రెడ్డి
దేవరకద్ర            పెండింగ్
కొడంగల్            పెండింగ్
షాద్ నగర్             పెండింగ్

నిజామాబాద్‌ జిల్లా             (9)
బాన్సువాడ        –     పోచారం శ్రీనివాస్‌రెడ్డి(సిట్టింగ్)
ఎల్లారెడ్డి         –    రవీందర్‌రెడ్డి(సిట్టింగ్)
కామారెడ్డి         –    గంప గోవర్థన్‌(సిట్టింగ్)
జుక్కల్‌        –    హన్మంతు షిండే(సిట్టింగ్)
నిజామాబాద్‌ అర్బన్‌        బస్వా లక్ష్మినర్సయ్య
బోధన్‌                 షకీల్‌
బాల్కొండ        –          ప్రశాంత్‌రెడ్డి
ఆర్మూర్‌         –    జీవన్‌రెడ్డి
నిజామాబాద్  రూరల్‌         బాజిరెడ్డి గోవర్థన్‌

హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలు (29)
పరిగి            –    హరీశ్వర్‌రెడ్డి(సిట్టింగ్)
తాండూర్‌        –    మహేందర్‌రెడ్డి(సిట్టింగ్)
చేవెళ్ళ        –    రత్నం (సిట్టింగ్)
సికింద్రాబాద్‌     –    పద్మారావు (మాజీ ఎమ్మెల్యే)
మేడ్చల్‌          –    సుధీర్‌రెడ్డి
సనత్‌నగర్‌         –    దండె విఠల్‌
ఇబ్రహీంపట్నం     –    సామల వెంకటరెడ్డి
కుత్బుల్లాపూర్         శంభీర్ పూర్ రాజు
ఎల్బీనగర్             నాయిని నర్సింహారెడ్డి
పెండింగ్‌లో మరో ఇరవై సీట్లు

ఖమ్మం జిల్లా         (10)
కొత్తగూడెం         జలగం వెంకట్రావ్
సత్తుపల్లి             పిడమర్తి రవి
పెండింగ్‌లో 8 నియోజక వర్గాలు

Advertisements
Video | This entry was posted in Andhra Pradesh News and tagged , , , , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s