ఆశావహులకు ఆశాకిరణంగా టీఆర్‌ఎస్

పార్టీలలో పెరిగిపోతున్న అసంతృప్తులు
ఆశావహులకు ఆశాకిరణంగా టీఆరెస్
కారెక్కేందుకు రెడీ అవుతున్న నేతలు
ఇవాళ కేసీఆర్‌ను కలవనున్న లీడర్లు
బలమైన నేతలకోసం టీఆరెస్ అన్వేషణ

తెలంగాణలో ఆశావహులకు టీఆరెస్ పార్టీ కామధేనువులా తయారైంది. పార్టీలో సీటురానివారు కారెక్కేందుకు రెడీ అవుతున్నారు. అటు తమ అవసరాలకు తగ్గట్టుగా లీడర్లను ఎంపిక చేసుకునే పనిలో పడింది.. గులాబీ దళం. అటు నామినేషన్ల ప్రక్రియ ముగిసేందుకు టైం దగ్గరపడడంతో ఫైనల్‌ లిస్టుకు కేసీఆర్ తుదిమెరుగులు దిద్దుతున్నారు.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల లిస్టు ప్రకటించడంతో సీట్లురాని వారు రగిలిపోతున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకుని పనిచేసిన వారంతా హైకమాండ్ ఇచ్చిన ట్విస్టుతో షాకయ్యారు. దీంతో వారంతా పక్కచూపులు చూస్తున్నారు. వారి చూపంతా టీఆరెస్‌పై పడుతోంది. ఇంకా గులాబీ పార్టీ రెండోలిస్టు ప్రకటించడపోవడంతో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యారు. అటు టీఆరెస్ కూడా బవలహీనంగా ఉన్న ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలలో బలమైన కేండిడేట్ల కోసం చూస్తోంది. ఈ క్రమంలో తమకు పనికొచ్చేవారిని ఆచితూచి ఎంపిక చేసుకునే పనిలో పడింది.

ఖమ్మం జిల్లాలో గులాబీదళం సంస్థాగతంగా బలహీనంగా ఉంది. ఇక్కడ పార్టీకి బలమైన అభ్యర్ధులు దొరకడం కష్టంగా మారింది. దీంతో ఇతరపార్టీలలోని అసంతృప్తులపై ఫోకస్ చేసింది. టీడీపీలో పాలేరు సీటును ఆశించి భంగపడ్డ స్వర్ణకుమారి కారెక్కేందుకు రెడీ అవుతున్నారు. అలాగే నల్లగొండ జిల్లాలో సీపీఎం నేత నోముల నర్సింహయ్య కూడా గులాబీ కండువా కప్పుకునేందుకు సిద్దమయ్యారు. నోముల కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. అటు కాంగ్రెస్ ఆకర్షణలో పడి పార్టీ వీడిన వికారాబాద్ నేత ఎ.చంద్రశేఖర్ సొంతగూటికి చేరేందుకు సన్నాహాలు చేరుకుంటున్నారు. వీరితోపాటు మరికొందరు ముఖ్యనేతలు ఇవాళ కేసీఆర్ ను కలిసి గులాబీ తీర్ధం పుచ్చుకునేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు.

ఉత్తర తెలంగాణలో బలంగా ఉన్న గులాబీ దండు..దక్షిణ తెలంగాణలో ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అంతగా ప్రాబల్యంలేదని గుర్తించింది. ఇందులో భాగంగానే ఇతరపార్టీలలోని బలమైన నేతలకు  సీట్లు ఆఫర్ చేస్తోంది. అటు బుధవారంతో నామినేషన్లకు తెరపడుతుండడంతో ఇవాళే వలసలకు ఫుల్‌స్టాప్‌ పెట్టి ఫైనల్ లిస్టును ఖరారు చేసేందుకు కేసీఆర్ రెడీ అయ్యారు.

Advertisements
Video | This entry was posted in Andhra Pradesh News and tagged , , , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s