సీమాంధ్ర నిర్మాణాత్మక అభివృద్ధి టీడీపీతోనే సాధ్యం

టీడీపీ అధికారంలోకి వస్తే తెలుగు నేల గర్వపడేలా చేస్తానని చంద్రబాబు అన్నారు. రెండు రాష్ట్రాల్లో పారిశ్రామిక, ఐటీ, వ్యవసాయరంగాలను అభివృద్ధి చేసి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తామని చెప్పారు. కడప ప్రజాగర్జనలో పాల్గొన్న ఆయన.. బీజేపీతో పొత్తు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందో వివరించారు.

వైఎస్సార్‌ ఇలాఖా కడపలో టీడీపీ నిర్వహించిన ప్రజాగర్జన సూపర్ సక్సెస్ అయింది. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన టీడీపీ కార్యకర్తలు, అభిమానులతో కడప మున్సిపల్ మైదానం కిక్కిరిసి పోయింది. అశేష జనవాహినిని చూసిన చంద్రబాబు కార్యకర్తల్లో  ఉత్సాహం నింపారు. రాష్ట్ర విభజన ఆంశంతో పాటు కాంగ్రెస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పై దుమ్మెత్తి పోశారు. నిర్మాణాత్మకమైన అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమంటూ బలమైన వాణి వినిపించారు. దేవుని గడప అయిన కడప జిల్లా.. పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి, అన్నమయ్య వంటి ఎందరో మహానుబావులు జన్మనిచ్చిన ప్రాంతమని, అలాంటి జిల్లాలో అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు రాజ్యమేలుతున్నాయని చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రమంతా టీడీపీ గాలి బలంగా వీస్తోందన్న బాబు.. తాము అధికారంలోకి వస్తే పారిశ్రామికంగా, వ్యవసాయపరంగా, అన్ని రంగాల్లో దేశం గర్వపడేలా, తెలుగువాడి ఆత్మగౌరవం పెరిగేలా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. దేశ, రాష్ట్ర ప్రయోజనాలకోసమే బీజేపీతో పొత్తుపెట్టుకోవాల్సి వచ్చిందని టీడీపీ చీఫ్ వివరణ ఇచ్చారు.
బైట్ – చంద్రబాబు, టీడీపీ అధినేత

రైతు రుణాలను బేషరతుగా రద్దు చేస్తామన్న చంద్రబాబు.. రైతులకు గిట్టుబాట ధర, వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. డ్వాక్రా సంఘాల రుణాలు మాఫీ చేయడంతోపాటు మహిళలకు సెల్ ఫోన్లు ఇచ్చి వారి రక్షణకు పాల్పడతామన్నారు. వృద్దాప్య పించను వెయ్యి రూపాయలు, ప్రతి నియోజకవర్గంలో వృద్దాశ్రమం, వికలాంగులకు 1500 పించను ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని చంద్రబాబు చెప్పారు. ముస్లింలకు ప్రత్యేకమైన ప్యాకేజీ, దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేరుస్తామని హామీ ఇచ్చారు.

మొత్తానికి వైఎస్‌ఆర్ ఇలాఖాలో నిర్వహించిన ప్రజాగర్జన సభ సక్సెస్ కావడంతో టీడీపీ శ్రేణుల్లో జోష్ పెరిగింది.

Advertisements
Video | This entry was posted in Andhra Pradesh News and tagged , , , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s