టైటానియం చిక్కుల్లో..కేవీపీ!

– కేవీపీపై రెడ్ కార్నర్ నోటీసులు..?
– షికాగో ఫెడరల్ కోర్టులో అభియోగాలు
– సీబీఐ అధికారులతో యూఎస్ టీమ్ చర్చలు
– టైటానియం అనుమతుల కోసం రూ. 111 కోట్లు ఎర..!
– రూ. 64 కోట్లు ఇప్పటికే సంబంధికుల అకౌంట్లలో జమ
– అక్రమ దందాకు తమ భూభాగం వాడుకున్నారన్న యూఎస్
– ఆండ్రస్, సురెన్, గజేంద్రలాల్, సుందరలింగంపై అభియోగాలు
– మార్చి 12వ తేదీన ఫిర్టాష్‌ అరెస్టు
– 1.74  కోట్ల డాలర్ల పూచీకత్తుతో మార్చి 21న బెయిల్
– 2006 నుంచి 2010 మధ్య 57 లావాదేవీలు
– రూ. 64 కోట్ల బదలీ అయ్యాయని నిర్ధారణ
– ట్రాన్సాక్షన్స్ కోసం 159 కంపెనీల వినియోగం..

కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు చుట్టూ టైటానియం కేసు.. నీడలా వెంటాడుతోంది. గనుల తవ్వకాల అనుమతుల కోసం రకరకాల వ్యక్తులకు, శక్తులకు ముడుపులు ముట్టజెప్పే క్రమంలో రంగంలోకి దిగారన్న అభియోగాలు ఎదుర్కొంటున్నారు కేవీపీ. తాజాగా.. ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసినట్లు ప్రచారం జరగడంతో.. ఈ కేసులో అసలేం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. అటు అమెరికా దర్యాప్తు అధికారుల ఎంట్రీ రకరకాల అనుమానాలకు తావిస్తోంది.

టైటానియం తవ్వకాల కేసు వ్యవహారం.. కేవీపీ చుట్టూ నీడలా వెంటాడుతోంది. కేసు దర్యాప్తులో పురోగతి సాధిస్తున్న అమెరికా దర్యాప్తు బృందాలు.. పూర్తిస్థాయిలో రంగంలోకి దిగినట్లు తెలిసింది. కేవీపీపై ఇప్పటికే ఇంటర్‌ పోల్ రెడ్ కార్నర్ నోటీసు సైతం జారీ చేసినట్లు చెబుతున్నారు. టైటానియ్ గనుల కోసం చక్రం తిప్పిన అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో పాటు.. ఇక్కడ ఆ వ్యవహారాన్ని నడిపినట్లుగా దాదాపు నిర్ధారణకు వచ్చిన షికాగో ఫెడరల్ కోర్టు కేవీపీపైనా అభియోగాలు మోపింది. ఈక్రమంలోనే యూఎస్ టీమ్.. ఢిల్లీ చేరుకున్నట్లు తెలిసింది. సీబీఐ అధికారులతో ఈ విషయంపై కూలంకషంగా చర్చించి తదుపరి చర్యలపై ఇక్కడి చట్టాల ప్రకారం ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు చెబుతున్నారు.

2006లో మొదలైన టైటానియం గనుల వ్యవహారం.. ఎన్నెన్నో మలుపులు తిరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో టైటానియం ఉత్పత్తులకు అవసరమైన ఖనిజాన్ని వెలికితీసి, అంతర్జాతీయ స్థాయిలో విక్రయించి, కోట్లు మూటగట్టుకునేందుకు చేసిన ప్రయత్నంలో… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో 111 కోట్లు… లంచాలుగా ఎరవేసేందుకు కుట్ర పన్నారని తేలింది. ఇందులో సుమారు 64 కోట్ల సొమ్ము అనుమతులు మంజూరు చేసే వారి అకౌంట్లలోకి చేరిందని దర్యాప్తు సంస్థ నిర్ధారించుకుంది. ఈ అక్రమ దందా అమలుకు తమ దేశ  భూభాగాన్ని, తమ దేశంలోని ఆర్థిక వ్యవస్థలను ఉపయోగించుకున్నారంటూ అమెరికాలోని షికాగో ఫెడరల్ కోర్టు అభియోగాలు నమోదు చేసింది.

ఈ కేసులో కేవీపీ సహా.. హంగేరీకి చెందిన వ్యాపారి ఆండ్రస్ నాప్, ఉక్రెయిన్‌కు చెందిన సురెన్, అమెరికాలో ఉండే గజేంద్ర లాల్, శ్రీలంకకు చెందిన సుందరలింగంలపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ లావాదేవీల్లో కీలకపాత్ర పోషించిన ఉక్రెయిన్ జాతీయుడైన ఫిర్తాష్‌ను ఈ ఏడాది మార్చి 12వ తేదీన అరెస్టు చేశారు. 1.74  కోట్ల డాలర్ల పూచీకత్తు ఇచ్చాక ఇదేనెల 21న ఫిర్తాష్‌కు బెయిల్ లభించింది. 2006 ఏప్రిల్ 28 నుంచి 2010 జూలై 13 మధ్య.. వివిధ వ్యక్తులు, సంస్థల పేరిట 57 ఆర్థిక లావాదేవీలు జరిగాయి. సుమారు 64 కోట్లు బదిలీ అయ్యాయని నిర్ధారణకొచ్చారు. ఈ లావాదేవీల కోసం ఆస్ట్రియా, సైప్రస్, జర్మనీ, హంగేరీ, నెదర్లాండ్స్, సీషెల్స్, స్విట్జర్లాండ్, బ్రిటన్‌లలో రిజిస్టర్ అయిన 159 కంపెనీలను ఉపయోగించుకున్నట్లు గుర్తించారు. ఇప్పటికే చేతులు మారిన 64 కోట్లను గుర్తించి.. కేవీపీ సహా ఆరుగురు నిందితుల నుంచి ఇంతే మొత్తం విలువగల ఆస్తులు జప్తు చేయాలని అభియోగ పత్రాల్లో పేర్కొన్నారు. తాజాగా అమెరికా అధికారులు ఢిల్లీ చేరుకోవడంతో.. ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుందో చూడాల్సిందే.

Advertisements
Video | This entry was posted in Andhra Pradesh News and tagged , , , , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s