ఓటుకి రేటు! రూ.500!

గంటల వ్యవధిలో కోట్లలో డబ్బు
ప్రత్యర్థుల్ని ఓడించే ఎత్తులు
ఆఖర్లో లీడర్లకు తప్పని ఇబ్బందులు
20 రూపాయల వడ్డీకి అప్పులు
గెలుపోటములపై జోరుగా బెట్టింగ్‌లు

10 కోట్ల రూపాయల సీజ్
మెజారిటీ స్థానాల్లో హోరాహోరీ..
బీరు, బిర్యానీ, 500 నోటు..
ఎంపీ అభ్యర్థి ఖర్చు 20 కోట్లు..

అనంతలో రూ.5 కోట్లు స్వాధీనం
పట్టు కోసం అగ్రనేతల ప్రయత్నం
ఓటుకు కనీసం రూ.500


సీమాంధ్ర ఎన్నికలు ప్రధాన పార్టీలకు జీవన్మరణ సమస్య. అందుకే.. గెలుపు కోసం ఆ పార్టీలు కోట్లను కుమ్మరించాయ్. మద్యం ఏర్లు పారించాయ్. ఈసీకి ఆధారాలతో చూపించలేకపోవచ్చు కానీ ఇదంతా ముమ్మాటికీ నిజం. సరాసరిన లెక్కేస్తే ఒక్కో నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి తక్కువలో తక్కువ 3 కోట్లు ఖర్చు పెట్టినట్టు అంచనా. గెలుపు ప్రతిష్టాత్మకంగా మారిన చోట్ల ఇది పదికోట్లు దాటేసింది. మొత్తంమీద, దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీకి 2వేల 500 కోట్లు ఖర్చవుతుంటే.. ఒక్క మన రాష్ట్రంలోనే గెలుపుకోసం అభ్యర్థులు పెడుతున్న ఖర్చు ఇంతకు సమానంగా ఉండడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది.

పాలిటిక్స్‌లో ఉండే పవరేంటో రుచి చూసినోళ్లకు పదవి లేకపోతే నిద్రపట్టదు. అందుకే.. అధికారం కోసం అడ్డదారులు తొక్కుతారు. ఓటు ఫ్రీగా దొరికే రోజులు ఎప్పుడో పోయాయ్‌. అన్నిసార్లు ఓటు 500కి కూడా దొరకదని ఇప్పటికే రుజువైంది కూడా. అందుకే, ఈసారి ఎన్నికల్లో అభ్యర్థుల బడ్జెట్ డబుల్ త్రిబులైపోయింది. గెలుపు నల్లేరుపై నడక అనుకున్న చోట్ల కూడా.. ఓటుకు ఎంతో కొంత ఇవ్వాల్సిన పరిస్థితి. ఉత్తరాంధ్ర జిల్లాల విషయానికి వస్తే విశాఖలో ఓటుకు ఎక్కువ రేటు పలికిందంటున్నారు. ఇప్పటికే, మున్సిపల్ ఎన్నికలు, పరిషత్ ఎన్నికల్లో విజయం కోసం భారీగా ఖర్చు చేసిన లీడర్లు.. సార్వత్రిక సమరం కోసం పొలాలు, స్థలాలు అమ్మేసి మరీ ఎన్నికల్లో విజయానికి పెట్టుబడిగా పెట్టారు.

ఎలక్షన్ల పేరు చెప్పి ఉభయగోదావరి జిల్లాల్లో ఫైనాన్షియర్లకు పంట పడిందనే చెప్పాలి. అడగాలే కానీ కోట్లకొద్దీ డబ్బు గంటల వ్యవధిలో సర్దుబాటు చేసే బిజినెస్‌మాన్‌లు ఇక్కడున్నారు. అడిగినవాళ్లకు అడిగినంత తెచ్చిచ్చారు. ఐతే, ఈసారి ఫైనాన్సియర్లు కూడా పార్టీల పరంగా విడిపోవడం విశేషం. ఈ మొత్తం రింగ్‌ను లీడ్ చేస్తున్న బడా సేఠ్‌ల ద్వారా.. ప్రత్యర్థుల్ని ఓడించే ఎత్తులు పైఎత్తులు కనిపించాయి. ఈసారి ఎన్నికల్లో ఫలానా పార్టీ గెలుస్తుందని.. వాళ్లకు కాకుండా వేరే వాళ్లకు ఫైనాన్స్ చేస్తే వడ్డీ కాదు కదా అసలు కూడా వసూలు చేసుకోవడం కష్టమని ప్రచారం జరిగింది. ఈ తరహా ప్రచారం రెండు పార్టీల వైపు నుంచీ జరగడంతో.. కొందరు లీడర్లు బాగా ఇబ్బంది పడ్డారు. ఆఖర్లో ఇంకో కోటి ఖర్చు పెడితే ఉంటే గెలుస్తామన్న ధీమా ఉన్నవాళ్లు…. ఇళ్లు, పొలాలు తాకట్టు పెట్టేందుకు కూడా సిద్ధమయ్యారు. ఐతే, 10 కాకపోతే 20 రూపాయల వడ్డీ ఇస్తామన్నా అప్పు ఇచ్చేవాళ్లు లేకపోవడంతో వాళ్లకు గుండె ఆగినంత పనవుతోంది. మొత్తంగా ఈ జిల్లాల్లో ఓటు విలువ వెయ్యికి తక్కువ కాకుండా పలుకుతోంది. గోదావరి జిల్లాల్లో ఏ పార్టీకి లీడ్ వస్తే.. ఆ పార్టీయే అధికారంలోకి వస్తుందన్న సెంటిమెంట్‌తో ఇక్కడ బెట్టింగ్‌లు కూడా జోరుగానే జరుగుతున్నాయ్‌.

కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ పరిస్థితి ఇందుకు  భిన్నంగా ఏమీ లేదు. చెకింగ్స్‌లో భాగంగా ఈ మూడు జిల్లాల్లో అధికారులు స్వాధీనం చేసుకున్న నగదు దాదాపుగా 10 కోట్లు ఉంది. నాలుగు జిల్లాల్లో కలిపి 55 అసెంబ్లీ సీట్లున్నాయి. వీటిల్లో సగం చోట్ల ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు ఉండడంతో గెలుపు కోసం అభ్యర్థులు కోట్లు కుమ్మరిస్తున్నారు. చీకటిపడితే చాలు నోట్ల కట్టలు నడుచుకుంటూ ఓటర్ల ఇంటికెళ్లి తలుపులు తడుతున్నాయ్. బీరు, బిర్యానీల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక్కడ బడా వ్యాపారస్థుల ద్వారా ఆయా పార్టీలకు నగదు సర్దుబాట్లు రాత్రికి రాత్రే జరిగిపోయాయి. ఈ జిల్లాల్లో చాలా చోట్ల ఓటు 500 పలికింది. కీలకమనుకున్న గ్రామాల్లో వెయ్యినోట్లు పంచారు. ఇలా పంచే డబ్బులో ఎంపీ అభ్యర్థుల వాటా కూడా ఉంది. వాళ్ల ఎన్నికల ఖర్చు 10 నుంచి 20 కోట్ల మధ్యలో ఉందని ఆయా పార్టీల లీడర్లే చెప్తున్నారు.

రాయలసీమ జిల్లాల్లో పార్టీల మధ్య ఆధిపత్యపోరు పతాకస్థాయికి చేరడంతో.. ఇక్కడ కూడా నోట్ల కట్టలు బుసలుకొట్టాయి. ఒక్క అనంతపురం జిల్లాలోనే పోలీసు తనిఖీల్లో 5 కోట్ల రూపాయలు దొరకడం విశేషం. ఆయా పార్టీల అగ్రనేతలు తమ సొంత జిల్లాల్లో పట్టు నిలుపుకునేందుకు తమవంతు ప్రచారం బాగానే చేశారు. రాయలసీమలో చాలాచోట్ల ఫ్యామిలీ ప్యాకేజీలు కనిపించాయి. ఆయా కాలనీల్లో ఓటర్లను గంపగుత్తగా తమ ఖాతాలో వేసుకునేందుకు డీల్స్ కుదుర్చుకున్నారు. ఇక్కడ కూడా సరాసరిలో ఓటుకు 500 తక్కువ కాకుండా గిట్టుబాటైందంటున్నారు.

సీమాంధ్రలో ఎవరు గెలిచినా.. అన్నీ ఫ్రీ అంటున్నారు. ఆల్‌ఫ్రీ హామీలతో తెగ ఊదరకొట్టేశారు. ఇన్ని ఫ్రీ ఉపన్యాసాలు ఇచ్చిన లీడర్లు.. ఓటు మాత్రం తమకు ఫ్రీగా వెయ్యక్కర్లేదంటున్నారు. తామే ఎదురు డబ్బిచ్చి ఓటు కొనుక్కుంటున్నారు. సో, ఇలా ఓటుకు నోటిచ్చిన నేతలు.. రేపు గెలిచాక మనకేంచేస్తారో ఓసారి ఆలోచించుకుంటే బెటర్.

Advertisements
Video | This entry was posted in Andhra Pradesh News and tagged , , , , , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s