మందెయ్‌.. చిందెయ్‌..

గ్రామాల్లో మద్యం ఏరులైపారుతోంది.. డబ్బు, చీరల పంపకం జోరుగా సాగుతోంది. ప్రచారం పర్వం ముగియడంతో ప్రలోభాలపై  దృష్టిపెట్టాయి పార్టీలు. ఓటర్లను ఆకట్టుకోవడానికి భారీగా మద్యం, డబ్బు పంపిణీ చేస్తున్నాయి.

ప్రచారం ముగిసింది.. ప్రలోభాలకు తెరలేచింది. పోలింగ్‌కు ఒక్కరోజే సమయడం ఉండటంతో తెరచాటు ప్రయత్నాలను పార్టీలు ముమ్మరం చేశాయి. ఓటర్లను ఏదోలా తమవైపు తిప్పుకోవడానికి అన్ని అడ్డదారులు తొక్కుతున్నాయి. జోరుగా డబ్బు, మద్యం, చీరలు  పంపిణీ చేస్తున్నాయి.
pralobam big
పశ్చిమగోదావరిజిల్లా పెనుగొండలో పోలీసుల తనిఖీల్లో భారీగా చీరలు పట్టుబడ్డాయి. గాంధీబొమ్మ సెంటర్‌లోని బ్యూటిపార్లర్‌లో  దాచిన 23 బేళ్ల చీరలను పోలీసులు సీజ్‌ చేశారు. ఓటర్లకు వీటిని పంచడానికి ప్రయత్నించిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

నెల్లూరుజిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో భారీగా మద్యం పట్టుబడింది. నియోజకవర్గంలో పంచడానికి మద్యం తరలిస్తున్నట్లు  సమాచారం అందుకున్న ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు తనిఖీలు చేశారు. వెంకటాచలం వద్ద ఆటోలో తరలిస్తున్న 1847 మద్యం  బాటిళ్లను సీజ్‌ చేశారు. ఆటోలో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

చిత్తూరుజిల్లా పలమనేరులోనూ భారీ మద్యం పట్టుబడింది. ఓ పార్టీకి చెందిన నేత పొలంలో మద్యం దాచాడన్న సమాచారం  అందుకున్న పోలీసులు దాడులు చేశారు. కర్నాటక నుంచి తెచ్చిన మూడు లక్షల రూపాయల మద్యాన్ని సీజ్‌ చేశారు.

కడపజిల్లా రాజంపేట నియోజకవర్గంలో డబ్బు, మద్యం పంపిణీతోపాటు.. అసాంఘిక కార్యకలాపాలూ పెద్ద ఎత్తున సాగుతున్నాయి.  పుల్లంపేట వద్ద విస్త్రతంగా తనిఖీలు చేసిన పోలీసులకు నాలుగు నాటు బాంబులు దొరికాయి. దుండగులు వీటిని గ్యాస్‌ గోడౌన్‌లో  దాచారు. పొరపాటు ఇవి పేలి ఉంటే పెద్ద విపత్తే సంభవించేదని అధికారులు అంటున్నారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు..  కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

Advertisements
This entry was posted in Andhra Pradesh News and tagged , , , , , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s