అట్టహాసంగా మోడీ ప్రమాణోత్సవం..

ఆనందం.. అద్భుతం.. అపూర్వం.. యుగానికొక్కడంటూ జాతి జేజేలు కొట్టింది. ప్రపంచమంతా భారత్‌వైపు ఉత్కంఠగా చూసింది. అలాంటి ఆ ఉద్వేగభరిత క్షణంలో నరేంద్రుడి పట్టాభిషేక మహోత్సవం ఆద్యంతం వైభవోపేతంగా సాగింది. ప్రత్యర్థులు సైతం వహ్వా అనేలా రాజసం ఉట్టిపడింది. దైవసాక్షిగా ప్రమాణం చేసిన 63 ఏళ్ల మోడీ.. 120 కోట్ల మంది ప్రజల కలల్ని నిజం చేస్తానని- ఆ మార్పు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. తద్వారా మోడీ శకం మొదలైందని చెప్పకనే చెప్పారు.

ఈ క్షణాల కోసం జాతి యావత్‌ పది రోజులుగా ఎదురు చూసింది. అనుకున్న ముహూర్తానికి భారతదేశ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. యావత్‌జాతి హర్షాతిరేకాల మధ్య, విశిష్ట అతిథులుగా వివిధ దేశాధ్యక్షులు తరలిరాగా.. రాష్ట్రపతిభవన్‌ ఆవరణలో 4వేల మంది ప్రత్యేక అతిథుల సమక్షంలో.. ప్రధానమంత్రిగా నరేంద్ర దామోదర్‌దాస్ మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆద్యంతం ఉత్సాహభరితంగా.. నవభారత నిర్మాణానికి నాందీవాక్యంలా నరేంద్రుడి పట్టాభిషేకం కన్నుల పండువగా సాగింది…

రాష్ట్రపతి భవన్ వద్ద సాయంత్రం నుంచే సందడి మొదలైంది. ఆరుగంటలకు కార్యక్రమం మొదలయ్యేసరికల్లా మాజీ ప్రధానులు, మాజీ రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు, సెలబ్రిటీలు అంతా సభా ప్రాంగణానికి విచ్చేశారు. మోడీ కంటే ముందు అక్కడికి సార్క్ దేశాధినేతల రాకతో.. విశిష్ట మైత్రీబంధమూ ఆవిష్కృతమైంది. ఇంతలోనే చిరు దరహాసంతో హుందాగా అక్కడ అడుకు పెట్టారు మోడీ. ఆయనకు అంతా లేచి నుంచుని కరతాళధ్వనులతో ఘన స్వాగతం పలికారు. దర్బార్ హాల్‌ నుంచి ఠీవీగా వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మోడీతో ప్రమాణం చేయించారు…

మోడీ తర్వాత 45 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. 23 కేబినెట్‌, 10 మందికి ఇండిపెండెంట్ ఛార్జ్, 12 మంది సహాయ మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. మెజార్టీ సభ్యులు హిందీలోనూ, కొందరు ఇంగ్లీష్‌లోనూ దైవసాక్షిగా ప్రమాణం చేశారు….

ప్రమాణస్వీకారోత్సవం తర్వాత ఫొటో సెషన్‌ జరిగింది. కేబినెట్ సభ్యులంతా రాష్ట్రపతితో ఫోటో దిగారు. తర్వాత సార్క్ దేశాధినేతలతో మోడీ కరచాలనం చేస్తూ స్నేహహస్తం అందించారు. నవాజ్‌ షరీఫ్  సహా అంతా మోడీ మ్యాజిక్‌కి ముగ్దులైపోయారనే చెప్పాలి. మొత్తంమీద వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌ కంటే ఉత్కంఠగా దేశప్రజలంతా మోడీ ప్రమాణస్వీకారాన్ని తిలకించారు.

Advertisements
This entry was posted in Uncategorized and tagged , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s