తెలంగాణలో సంపూర్ణంగా బంద్

  • ఆర్టినెన్స్‌పై రాష్ట్రపతి సంతకం
  • గిరిజనులకు అన్యాయంపై ఆగ్రహం
  • బంద్‌కి కేసీఆర్ పిలుపు
  • 10 జిల్లాల్లో భారీగా నిరసనలు
  • విభజన బిల్లులోనే విలీనం ప్రస్తావన
  • ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంట్‌కే హక్కు
  • ఏడు మండలాల్లో పెద్దఎత్తున ఆందోళనలు

విభజన చిచ్చు ఇంకా రగులుతూనే ఉంది. పోలవరం ముంపు గ్రామాలు ఆంధ్రాలో కలపడం వ్యతిరేకిస్తూ ఇవాళ TRS తెలంగాణ బంద్‌కి పిలుపివ్వడంతో ఒక్కసారిగా మళ్లీ రాజకీయం వేడెక్కింది. ఆర్డినెన్స్‌ ఆపాలంటూ అవసరమైతే సుప్రీంకైనా వెళ్తామని చెప్తున్న గులాబీదళం.. ఆ మూడు పార్టీలు టార్గెట్‌గా మళ్లీ ఉద్యమ వేడి రగిల్చింది.

రాష్ట్ర విభజన అయిపోయింది. ఎన్నికలు ఫలితాలూ వచ్చేశాయ్. జూన్‌2 తర్వాత కొత్త ప్రభుత్వాలు కొలువు తీరబోతున్నాయ్‌. ఈ టైమ్‌లో పోలవరంపై పోరు మళ్లీ మొదటికొచ్చింది. కేంద్రం అత్యంత వ్యూహాత్మకంగా పోలవరం ముంపు గ్రామాల విలీనంపై ఆర్టినెన్స్‌ తేవడం.. దాన్ని రాష్ట్రపతికి పంపడం చకచకా జరిగిపోయాయి.  ఇదిప్పుడు అధికార TRSకి ఆగ్రహం తెప్పిస్తోంది. లక్షలాది మంది గిరిజనుల్ని నిర్వాసితుల్ని చేసేలా కేంద్రం ఏకపక్షంగా వ్యవహరించిందని మండిపడుతోంది. ప్రధాని మోడీ తీరును ఆక్షేపిస్తూ.. TRS అధ్యక్షుడు, కాబోయే ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా ఇవాళ బంద్‌కి పిలుపిచ్చారు.

పోలవరం విషయంలో కేంద్రం ప్రభుత్వం.. ఆంధ్ర ప్రాంతానికి అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. ఇవాళ పదిజిల్లాల్లో ఎక్కడిక్కడ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయ్. నిజానికి పోలవరం ముంపు గ్రామాల్ని ఆంధ్రాలో కలపాలన్న ప్రతిపాదన కొత్తదేమీ కాదు. పార్లమెంట్‌లో విభజన బిల్లుకు ఆమోదం సందర్భంగా అధికారికంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. ముంపు ముప్పు ఉండే మిగతా గ్రామాల్ని కూడా గుర్తించి వాటి విలీనానికి ఆర్డినెన్స్ తెస్తారన్నది ఊహించిందే. ఐతే, రాష్ట్రపతి సంతకం తర్వాత ఏపీ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు చట్టంగా మారినందున.. ఇప్పుడు తెలంగాణ సరిహద్దులు మార్చే హక్కు కేంద్రానికి లేదన్నది TRS వాదన. ఆర్టికల్ 3 ప్రకారం ఈ విషయంపై నిర్ణయాధికారం పార్లమెంట్‌కు మాత్రమే ఉంటుందని గులాబీ నేతలు చెప్తున్నారు. త్వరలో పార్లమెంట్ సమావేశాలు జరగనున్నందున.. ఇప్పుడు హడావుడిగా ఆర్డినెన్స్ తేవాల్సిన అవసరం ఏంటన్నది వాళ్ల ప్రశ్న.

ఖమ్మం జిల్లాలో 7 మండలాల్ని ఆంధ్రాలో కలపడాన్ని నిరసిస్తూ.. స్థానికంగా పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. TRSకి CPI మద్దతు పలికింది. భద్రాచలం CPM ఎమ్మెల్యే సున్నం రాజయ్య అయితే ఏకంగా నిరాహార దీక్షకు దిగుతున్నారు. ఆయనతోపాటు అఖిలపక్షం ఆధ్వర్యంలో ఏజెన్సీలోని సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కూడా నిరశన తెలపబోతున్నారు. మొత్తంమీద, అధికారికంగా కొత్త ప్రభుత్వాలు కొలువుదీరకముందే మొదలైన ఈ రగడ భవిష్యత్‌లో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో వేచిచూడాలి.

 

Advertisements
Video | This entry was posted in Andhra Pradesh News, Hyderabad News and tagged , , , , , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s