పోలవరం ప్రాజెక్ట్‌పై మరోసారి రగడ

  • జలయజ్ఞంలో భాగంగా పోలవరం
  • ఎన్నికల హామీగా పోలవరం
  • ఎందరో ముఖ్యమంత్రులు, ఎన్నోసార్లు శంకుస్థాపనలు
  • 13 వేల కోట్లకు చేరిన ప్రాజెక్ట్‌ వ్యయం
  • 10 లక్షల ఎకరాల్లో ఆయకట్టు స్థిరీకరణ
  • ఎడమ కాల్వ ద్వారా విశాఖ, విజయనగరం జిల్లాలకు తాగునీరు
  • ప్రాజెక్ట్‌తో 750 మెగావాట్ల జల విద్యుదుత్పత్తి
  • ముంపు బారిన పోలవరం మండలంలోని 26 గ్రామాలు
  • పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లించని అధికారులు
  • ఇష్టారాజ్యంగా ముంపు గ్రామాల తరలింపు

m22

పోలవరం ప్రాజెక్ట్‌పై మరోసారి రగడ జరుగుతోంది. ఓవైపు ఈ ప్రాజెక్ట్‌ డిజైన్‌ను మార్చాలని, తెలంగాణలోని ముంపు ప్రాంతాలను ఆంధ్రాలో కలపొద్దని TRS ఆందోళన నిర్వహిస్తోంది. మరోవైపు నష్ట పరిహారం చెల్లించాలంటూ పశ్చిమగోదావరి జిల్లాలోని ముంపు గ్రామాల ప్రజలు కూడా డిమాండ్‌ చేస్తున్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞంలో భాగంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్‌ పోలవరం. దీన్ని పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం దగ్గర నిర్మిస్తున్నారు. నిజానికి ఈ ప్రాజెక్ట్‌ ఏళ్లకు ఏళ్లుగా ఎన్నికల హామీగానే మిగిలిపోయింది. ఎందరో ముఖ్యమంత్రులు.. ఎన్నో సార్లు శంకుస్థాపన చేసినా.. నిర్మాణం మాత్రం ప్రారంభం కాలేదు. దీంతో పోలవరం ప్రాజెక్ట్‌ వ్యయం భారీగా పెరిగి 13 వేల కోట్ల రూపాయలకు చేరింది. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా కృష్టా డెల్టాలోని 10 లక్షల ఎకరాల్లో రెండు పంటలకు ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. ఇక ఎడమ కాల్వ ద్వారా గోదావరి జిల్లాలతో పాటు విశాఖ, విజయనగరం జిల్లా వాసులకు తాగునీరు లభిస్తుంది. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా 750 మెగావాట్ల జల విద్యుదుత్పత్తి జరుగుతుంది. బహుళ ప్రయోజనాలు కలిగిన ఈ ప్రాజెక్ట్‌ వల్ల పోలవరం మండలంలోని 26 ఏజెన్సీ గ్రామాలు ముంపునకు గురవుతాయి. ఈ ప్రాజెక్ట్‌ వల్ల మొదట ముంపునకు గురయ్యేది పైడిపాక. దీంతో పాటు దేవరగొంది, తోటగొంది, రామయ్యపేట, చేగొండిపల్లి, సింగన్నపల్లి గ్రామాల వారికి నష్ట పరిహారం చెల్లించి ఊర్లను ఖాళీ చేయించాల్సి ఉంది. అయితే అధికారులు  పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందించలేదు.

అంతేకాదు నిర్వాసితులు కోరిన చోట కుండా వేరో ప్రాంతంలో ఇళ్లు కట్టి అక్కడికి ముంపు గ్రామాల వారిని తరలించే ప్రయత్నం చేశారు. పైడిపాక గ్రామస్తులు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ కింద జంగారెడ్డిగూడెంలో ఇళ్లు కావాలని కోరగా.. సగం మందికి అక్కడే ఇళ్లు కట్టించి ఇచ్చి, మరో సగం మందికి వేరే ప్రాంతంలో ఇళ్లు ఇచ్చారు. దీంతో పైడిపాక గ్రామస్తులు పంచాయతీ ఎన్నికలను బహిష్కరించి నిరసన తెలిపారు.

ఇప్పటికైనా అధికారులు తాము కోరిన చోట ఇళ్లు కట్టించడంతో పాటు పెరిగిన రేట్లకు అనుగుణంగా నష్ట పరిహారాన్ని ఇవ్వాలని నిర్వాసితులు డిమాండ్‌ చేస్తున్నారు. త్వరలో ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వమైనా తమ సమస్యలు తీర్చాలని ముంపు ప్రాంతాల వారు కోరుతున్నారు.

Advertisements
Video | This entry was posted in Andhra Pradesh News and tagged , , , , , , , , , , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s