మే16న సార్వత్రిక ఫలితాలు ఉత్తరప్రదేశ్‌ గ్రామాల్లో చీకట్లు తెచ్చాయి

మే16న సార్వత్రిక ఫలితాలు ఉత్తరప్రదేశ్‌ గ్రామాల్లో చీకట్లు తెచ్చాయి. ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా..? ఇది మాత్రం వాస్తవం. ఫలితాలు మరుసటి రోజు నుంచి రాష్ట్రంలో చీకట్లు కమ్ముకున్నాయి. గ్రామాలు అంధకారంలో చిక్కుకున్నాయి. అసలు ఈ పరిస్థితికి కారణం ఏంటి..? అసలు యూపీలో ఏం జరుగుతోంది.? వాచ్‌ దిస్‌ స్టోరీ..

రోజుకి 12గంటలు పవర్‌ కట్‌ ఉంటేనే నరకం ప్రత్యక్షంగా కనపడుతుంది.. ఇక 16గంటలు కట్‌ చేస్తే.. ఇక ఆ కష్టం చెప్పలేం.. కానీ ఉత్తరప్రదేశ్‌ గ్రామాలు ప్రస్తుతం ఇదే పరిస్థితిలో ఉన్నాయి. రోజుకి ఎనిమిదంటే ఎనిమిదే గంటలు విద్యుత్‌ సరఫరా ఉంటోంది. ఫలితంగా ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. విద్యుత్‌ కోతలతో కుళాయిల్లో నీళ్లు రాక అవస్థలు పడుతున్నారు. ఇంతకు ఉత్తరప్రదేశ్‌ ప్రజల ఈ దుస్థితికి కారణం ఏంటి..? విద్యుత్‌ కోతలు ఇంత దారుణం ఉండటానికి రీజనేంటి..? అంటే ఒక ఆసక్తికరమైన విషయం బయటపడుతోంది.

అది మే 16.. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు.. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ ఎన్నికల్లో కమలం వికసించింది. ఉత్తరప్రదేశ్‌లో రికార్డ్‌ స్థాయిలో 73స్థానాలు కైవసం చేసుకుంది. ఇక ఎంతో హడావుడి చేసిన సమాజ్‌వాజ్‌ పార్టీకి తలఎత్తుకోలేని ఫలితాలు వచ్చాయి. కేవలం ఐదే స్థానాల్లో ఆ పార్టీ గెలిచింది. ఇక మరుసటి రోజు నుంచి రాష్ట్రంలో పరిస్థితులు మారిపోయాయి. ఓటమి కసితో ఊగిపోయిన సమాజ్‌వాదీ పార్టీ.. మాకు ఓట్లు వేయరా మీ సంగతి చూస్తామన్నట్లు ప్రజలపై ప్రతాపం చూపడం ప్రారంభించింది. గ్రామాల్లో చీకట్లు కమ్ముకున్నాయి. విద్యుత్‌ కోతలు పతాకస్థాయికి చేరుకున్నాయి. ఇక ప్రజల కష్టాలు వర్ణనాతీతం. ముఖ్యంగా మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గంతో పాటు, బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న లక్నో, ఘజియాబాద్‌, నోయిడాలో అసలు కరెంటే ఉండటం లేదు. రోజు మొత్తం ప్రజలు విద్యుత్‌ లేకుండానే గడుపుతున్నారు. బోర్లు పనిచేయక.. కుళాయిల్లో నీళ్లు కూడా రాక నరకం చూస్తున్నారు.

ఫలితాల మరుసటి రోజు నుంచి సమాజ్‌వాదీ పార్టీ వ్యవహరిస్తున్న తీరును బీజేపీ తీవ్రంగా తప్పుబడుతోంది. ఓటమి కోపాన్ని ప్రజలపై చూపుతున్నారని ఆరోపిస్తోంది. సమాజ్‌వాదీ పార్టీ మాత్రం అలాంటిదేమీలేదని కవర్‌ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. విద్యుదుత్పత్తి తక్కువగా ఉండటంతోపాటు.. ఏటా వేసవిలో ఇలాగే ఉంటుందని చెప్పుకొస్తోంది. ఏదేమైనా ఇంతటిస్థాయిలో విద్యుత్‌ కోతలు విధించడం ఇదే తొలిసారని ప్రజలు అంటున్నారు. ఫలితాల మరుసటి రోజు నుంచే ఇలా వ్యవహరించడం రాజకీయ కక్ష కాకపోతే మరేంటని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి రేప్‌లను సర్థిస్తూ.. గూండాయిజాన్ని ప్రోత్సహిస్తూ ఇప్పటికే ఇమేజ్‌ కోల్పోయిన సమాజ్‌వాదీ పార్టీ.. ఈ తరహా ప్రవర్తనతో ప్రజలకు మరింత దూరమయ్యే అవకాశముంది..

Advertisements
Video | This entry was posted in National and tagged , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s